E-Paper
Advertisement

Actors Harika- Eknadh: మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు..ఫస్ట్ మంత్ ప్రగ్నెన్సీ.. నరకం..

Actors Harika- Eknadh: మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు..ఫస్ట్ మంత్ ప్రగ్నెన్సీ.. నరకం..
Advertisement

Actor Harika- Eknadh: ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య పుడుతుందో చెప్పడం కష్టమే అయితే ప్రేమించుకున్న జంటలు అన్నీ కూడా పెళ్లి వరకు వెళ్తాయి అని చెప్పడం కూడా కష్టమే.. కానీ కొంతమంది మాత్రం తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలానే తమ ప్రేమని గెలిపించుకోవడానికి పెద్దలను కూడా ఎదిరిస్తున్నారు ఇది మామూలు వాళ్లకు మాత్రమే కాదు.. అటు సెలబ్రీటీలు కూడా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. అలాంటివారిలో హారిక, ఏక్ నాథ్ ల జంట ఒకటి.. వీరిద్దరూ ఒక సీరియల్ ద్వారా పరిచయమయ్యారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే వాళ్ళని ఒప్పించారు. అలా వీరిద్దరూ జంట అయ్యారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట.. గతంలో ఎదుర్కొన్న కొన్ని కన్నీళ్లు తెప్పించే ఘటనలను పంచుకున్నారు.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.. వీళ్ల ఎమోషనల్ స్టోరీ ఏంటో ఒకసారి చూసేద్దాం..

మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు..

హారిక ఏకనాథ్ లు నేను శైలజ సీరియల్ లోనటించారు. ఆ సీరియల్ లో నటించే సమయంలో వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే భావన ప్రతి ఒక్కరికి కలిగింది.. అనంతరం వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది అని చెప్పాలి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తమ పెళ్లి గురించి ఇంట్లో చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంట్లో ఒప్పుకోకపోవడంతో చాలా బాధపడ్డాము. చివరికి కొన్నేళ్లు దూరంగా ఉన్నాము కూడా ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాము అని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొత్తానికి ఎన్నో ట్విస్ట్ లతో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు ఈ జంట.. ప్రస్తుతం వీరిద్దరూ కూడా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఫోటోలు కూడా తీసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ఆ ఫోటోలకు ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే..

Advertisement

Also Read :39 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ.. ఇన్నేళ్లు కళ్యాణ్ చక్రవర్తి ఏం చేశాడంటే..?

ప్రగ్నెన్సీ టైంలో అలా జరిగింది…

అలాగే పెళ్లయిన ఒక నెలకి ఈ జంట గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు. తల్లిదండ్రుల ఏ అవకాశం అందుకున్నారు. కానీ ప్రెగ్నెన్సీ అయినా కొన్ని రోజులకి అబార్షన్ కూడా అయింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట తమ పెళ్లి గురించి అలాగే మొదటి గర్భం గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు. పెళ్లయిన ఒక నెలకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కానీ అప్పుడు మేము పిల్లల్ని కనడానికి రెడీగా లేము. ఇక మా బిడ్డను చంపడం ఇష్టం లేక పిల్లల్ని కనాలని అనుకున్నాము. కానీ విధి మా జీవితాలతో ఆడుకుంది.. అండం సరిగ్గా ఏర్పడలేదు. ప్రాణాలకే రిస్క్ అని డాక్టర్లు చెప్పడంతో వెంటనే అడ్మిట్ అయి అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. లేకున్నా అంటే ఇప్పుడు పాప బాబు మాతో ఉండేవారు అని హారిక ఎమోషనల్ అయింది. ఈ వీడియో వైరల్ అవడంతో చాలామంది నెటిజెన్లు వీళ్ళకి ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ఈ జంట ఇద్దరు కూడా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×