E-Paper
Advertisement

Tv Serial Actresses: కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటీమణులు.. కొత్త సంవత్సరంలో తొలి అడుగు!

Tv Serial Actresses: కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటీమణులు.. కొత్త సంవత్సరంలో తొలి అడుగు!
Advertisement

TV Serial Actresses: ఇటీవల కాలంలో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు బుల్లితెర నటీనటులు కేరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే పెద్ద ఎత్తున వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతోమంది బుల్లితెర నటీమణులు డిజైనర్ స్టూడియోస్, క్లోతింగ్ బిజినెస్ ప్రారంభించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఇదే బాటలోనే మరి కొంతమంది నటీమణులు పయనిస్తున్నారు. 2026వ సంవత్సరంలో తమ కొత్త బిజినెస్ ప్రారంభించి, అందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

హౌస్ ఆఫ్ శివాసం..

వదినమ్మ సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న మహేశ్వరి(Maheswari) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే జానకి కలగనలేదు సీరియల్ నటి విష్ణు ప్రియ(Vishnu Priya), నటి మేఘన(Meghana) ఈ ముగ్గురు చాలా క్లోజ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఈ మూడు ఫ్యామిలీలు తరచూ వెకేషన్ లకి వెళ్లడం, యూట్యూబ్ వీడియోల ద్వారా పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే మహేశ్వరి, మేఘన, విష్ణు ప్రియ ఈ ముగ్గురు కలిసి క్లోతింగ్ బిజినెస్ ప్రారంభించారని తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ ముగ్గురు “హౌస్ ఆఫ్ శివాసం” (House Of Sivasam)పేరుతో ఈ బిజినెస్ ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇక ఈ పేరు వెనుక ఉన్న స్టోరీ గురించి కూడా మేఘన తెలియజేశారు.

క్లోతింగ్ బిజినెస్..

Advertisement

శివాసం అనే పేరును ఈ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల నుంచి మొదటి అక్షరాన్ని తీసుకొని ఈ పేరును క్రియేట్ చేసినట్లు మేఘన తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ బిజినెస్ లో మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకున్నారు. ప్రస్తుతం క్లోతింగ్ బిజినెస్ ప్రారంభించిన ఈ ముగ్గురు భవిష్యత్తులో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇటీవల ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా ఓన్ బిజినెస్ ప్రారంభించి మంచి సక్సెస్ అందుకున్నారు.

Advertisement

ఇక ఇటీవల కాలంలో మేఘన, మహేశ్వరి సీరియల్స్ పూర్తిగా తగ్గించారని చెప్పాలి. ఇక విష్ణుప్రియ మాత్రం పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఈ ముగ్గురు ఒకవైపు సీరియల్స్ లో చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ తమకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక వీరి భర్తలు శివ, సిద్దు, ఇంద్రనీల్ ఇండస్ట్రీలోనే బిజీగా ఉన్న సంగతి తెలిసిందే .సిద్ధార్థ్ వర్మ పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండగా, నటుడు ఇంద్రనీల్ ఇటీవల శంబాల సినిమాలో కీలకపాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ రిలీజ్ పై క్లారిటీ.. ఆకట్టుకున్న న్యూ ఇయర్ పోస్టర్ !

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×