E-Paper
Advertisement

Serial Actress : ప్రేమించి పెళ్లి.. విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్స్..

Serial Actress : ప్రేమించి పెళ్లి.. విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్స్..
Advertisement

Serial Actress : సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిళ్లు కామన్.. ఎవరి మధ్య ఎప్పుడు ప్రేమ పడుతుందో చెప్పడం కష్టమే. అలాగే ప్రేమించిన ఏ జంట బ్రేకప్ చెప్పుకుంటారో అన్నది కూడా చెప్పలేము. ఇది కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు అటు బుల్లితెరపై కూడా ఇదే ట్రెండు కొనసాగుతుంది. ఈమధ్య సీరియల్ హీరోయిన్లు ఎంతోమంది పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్న విషయాన్ని ఎక్కడా చెప్పకుండా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆ విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు. మరి అతి చిన్న వయసులోనే విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్ల గురించి ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ప్రియాంక నల్కారి..

Advertisement

బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక నల్కారి. ఈమె సీరియల్స్లలో మాత్రమే కాదు అటు బుల్లితెరపై ప్రసారమైన ప్రతి ఈవెంట్లలో కూడా సందడి చేసింది. అంతే కాదు ఆ మధ్య కొన్ని షోలకు యాంకరింగ్ కూడా చేసింది. అయితే ఏమైందో తెలియదు గానీ సడన్గా తెలుగు సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసి తమిళ్ ఇండస్ట్రీలో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం ఈమె మళ్లీ తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సీరియల్స్లలో నటిస్తుంది. ప్రియాంక ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు సీక్రెట్ గానే విడాకులు తీసుకున్న విషయం ఇటీవలే బయటకు వచ్చింది. రీసెంట్గా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఇక జీవితంలో రెండో పెళ్లి చేసుకొని అని ప్రకటించేసింది.

ఐశ్వర్య పిస్సే..

కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఐశ్వర్య పిస్సే.. కస్తూరి, అగ్నిసాక్షి వంటి సూపర్ హిట్ సీరియల్స్లలో నటించిన ఈ అమ్మడు తెలుగు సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి వాళ్ళ బ్రదర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈమె ఈ మధ్య విడాకులు తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ఐశ్వర్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సీరియస్లలో నటిస్తూ బిజీగా ఉంది.

శిరీష..

Advertisement

పదహారణాల తెలుగమ్మాయి సీరియల్ నటి శిరీష గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మొగలిరేకులు సీరియల్ తో బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ సీరియల్ లో తన నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత రాములమ్మ, మనసు మమత, స్వాతి చినుకులు వంటి సూపర్ హిట్ సీరియల్స్లలో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అయితే శిరీష ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకున్న విషయం ప్రకటించింది. కొన్ని మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయినట్లు ఆమె బయట పెట్టింది..

వీళ్లు మాత్రమే కాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో నటిస్తున్న ముద్దుగుమ్మలు కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని అనుకొని పరిస్థితుల వల్ల విడాకులు తీసుకున్నారు. అయితే కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సీరియల్స్లలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక చామంతి సీరియల్ లో నటిస్తుంది, శిరీష కూడా రెండు సీరియల్స్ లో నటిస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×