E-Paper
Advertisement

Actress Nandini death: పెళ్లి ఒత్తిడి.. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటి

Actress Nandini death: పెళ్లి ఒత్తిడి.. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటి
Advertisement

Actress Nandini death: ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీల మరణ వార్తలు ఇండస్ట్రీకి తీరని లోటును మిగులుస్తున్నాయి. ఈ ఏడాదిలో పలువురు సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే .అయితే తాజాగా ఇండస్ట్రీలో మరొక విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీరియల్ నటి నందిని (Nandini)ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన నందిని నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈమె కన్నడ తమిళ సీరియల్స్ నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సీరియల్స్ ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్న నందిని ఉన్నఫలంగా ఆత్మహత్య చేసుకొని మరణించడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.

బెంగళూరు ఇంటిలో ఆత్మహత్య

నందిని ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయం తెలియడంతో ఈ విషయంపై బెంగుళూరు పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నందిని తెలుగు అమ్మాయి అయినప్పటికీ కన్నడ తమిళ సినిమాలు ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు .తమిళంలో ఈమె గౌరీ అనే సీరియల్ లో ద్విపాత్రాభినయంలో నటించారు. ఈ సీరియల్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఈ సీరియల్ షూటింగ్లో భాగంగా ఇన్ని రోజులపాటు బెంగళూరులోనే ఉన్న గౌరీ ఇటీవల ఈ సీరియల్ షూటింగ్ చెన్నైకి షిఫ్ట్ అవడంతో ఈమె బెంగళూరులో ఉన్న తన నివాసానికి వెళ్లారని తెలుస్తుంది.

గౌరీ సీరియల్ తో గుర్తింపు

Advertisement

విశ్రాంతి కోసం ఇంటికి వెళ్లిన నందిని ఒక్కసారిగా సూసైడ్ చేసుకొని మరణించారనే వార్త బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉన్నఫలంగా ఈమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఈ సూసైడ్ వెనుక ఏం జరిగిందనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈమె మరణానికి సరైన కారణాలు తెలియవు కానీ నందిని మరణ వార్త తెలిసి తోటి నటీనటులు షాక్ అవుతున్నారు. ఇక నందిని ఇటీవల ఒక సీరియల్ లో భాగంగా డెత్ సీన్ చేసిన అనంతరమే ఈమె కూడా ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.

పెళ్లి విషయంలో ఒత్తిడి

Advertisement

ఇలా ఆత్మహత్యకు పాల్పడిన నందిని సూసైడ్ లెటర్ కూడా రాసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా తన తల్లిదండ్రులు పెళ్లి గురించి ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆమె ఈ సూసైడ్ లెటర్ లో ప్రస్తావించినట్టు సమాచారం. ఇలా తల్లిదండ్రులు పెళ్లి ఒత్తిడి చేయడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిజా నిజాలు ఏంటో తెలియనున్నాయి. నందిని మరణ వార్త తెలియడంతో ఈమె నటించిన గౌరీ సీరియల్ ప్రసారమవుతున్న కలైంజర్ టీవీ ఛానెల్ నందిని మరణ వార్తను తెలియజేస్తూ ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఇతర నటీనటులు అభిమానులు ఈమె మరణం పట్ల నివాళులు అర్పిస్తున్నారు.

Also Read: Trolls On Ashu Reddy: ‘నీకు మంగపతే కరెక్ట్’… అషురెడ్డి ఫోటోలకు నెటిజన్లు కౌంటర్స్

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×