E-Paper
Advertisement

ఆ సీరియల్ కారణంగా మాతృత్వానికి దూరమైన బుల్లితెర నటి..అదే శాపంగా మారిందా?

ఆ సీరియల్ కారణంగా మాతృత్వానికి దూరమైన బుల్లితెర నటి..అదే శాపంగా మారిందా?
Advertisement

TV Actress: బుల్లితెర నటిగా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు ఇంద్రనీల్, మేఘన దంపతులు ఒకరు. వీరిద్దరూ చక్రవాకం మొగలిరేకులు వంటి సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా బుల్లితెర నటీనటులుగా గుర్తింపు పొందిన వీరిద్దరూ ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తున్నప్పటికీ మరోవైపు పలు వ్యాపార రంగాలలో కూడా మంచిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తమ తోటి నటీనటులతో కలిసి ఇప్పటికే క్లోతింగ్ బిజినెస్ ప్రారంభించారు అలాగే ఫుడ్ బిజినెస్ కూడా మేఘన ఇంద్రనీల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ప్రేమ వివాహం చేసుకున్న ఇంద్రనీల్, మేఘన..

ఇక ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2005వ సంవత్సరంలో వీరి వివాహం జరిగింది. మేఘన ఇంద్రనీల్ ప్రేమ వివాహం చేసుకున్నారు . ఈ దంపతులకు పెళ్లి జరిగి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు సంతానం లేదనే చెప్పాలి. అయితే పిల్లల గురించి పలు సందర్భాలలో మేఘన, ఇంద్రనీల్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వయసులో తాము పిల్లల్ని ప్లాన్ చేస్తున్న వారికి మేము న్యాయం చేయలేమని అందుకే పిల్లల కోసం ట్రై చేయలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. గతంలో రెండు సార్లు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని, కొన్ని కారణాలవల్ల అబార్షన్ జరిగాయని తెలుస్తుంది.

చక్రవాకం సీరియల్..

Advertisement

మేఘన మంజుల నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చక్రవాకం సీరియల్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్లో ఈమె ఇంద్రనీల్ కు అత్త పాత్రలో నటించారు. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ సీరియల్ సమయం లోనే వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొద్ది నెలలకి మేఘన ప్రెగ్నెంట్ అయ్యారని ఈమె రెండో నెలలో ఉన్నప్పటికీ షూటింగుకు వెళ్లేవారని అయితే చక్రవాకం సీరియల్ కారణంగానే తనకు అబార్షన్ జరిగిందని ఓ సందర్భంలో వెల్లడించారు.

రెండుసార్లు అబార్షన్?

Advertisement

చక్రవాకం సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో మేఘన రెండో నెల గర్భంతో ఉన్నప్పటికీ ఈ సీరియల్ షూటింగ్లో భాగంగా డైరెక్టర్ తనని 40 సార్లు మెట్లు ఎక్కించారట. అంతసేపు మెట్లు ఎక్కి దిగడంతో తనకు అబార్షన్ జరిగిందని సమాచారం. అదేవిధంగా మరోసారి తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటికీ రెండోసారి కూడా అబార్షన్ జరిగిందని, ఇక అప్పటినుంచి తనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదని తెలిపారు. ఇలా పిల్లల కోసం చాలా ట్రై చేసిన పిల్లలు పుట్టకపోవడంతో ఇక పిల్లలు కూడా వద్దనుకున్నామని ఈ టైంలో పిల్లల్ని ప్లాన్ చేసిన వారిని పెంచి పెద్ద చేసేటప్పటికి మాకు వయసు అయిపోతుందని అందుకే అలాంటి ఆలోచనలు పెట్టుకోలేదు అంటూ పలు సందర్భాలలో తెలిపారు.

Also Read: ‘డెకాయిట్’ మూవీ టికెట్ ధరలు భారీ తగ్గింపు.. ఎంతంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×