E-Paper
Advertisement

Actress Debjani : గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ నటి దేబ్జానీ..కల నెరవేరిందంటూ!

Actress Debjani : గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ నటి దేబ్జానీ..కల నెరవేరిందంటూ!
Advertisement

Actress Debjani: కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తమ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోని స్థిరపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎంతో మంది సీరియల్ నటీమణులు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు . ఇలా కన్నడ ముద్దుగుమ్మగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో దేబ్జానీ మోదక్ (Debjani Modak)ఒకరు. ఈమెను అసలు పేరుతో చెబితే పెద్దగా ఎవరు గుర్తుపట్టరు కానీ, సత్య అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తుకు వస్తుంది.

బిజినెస్ రంగంలోకి దేబ్జానీ..

ఇలా తెలుగు సీరియల్స్ ద్వారా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న దేబ్జానీ ఇప్పటికి పలు సీరియల్స్ నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా దేబ్జానీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. ఇటీవల కాలంలో సెలెబ్రిటీలు అందరూ కూడా క్లాతింగ్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేబ్జానీ కూడా పెద్ద స్టోర్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో ఈమెకు ఇలాంటి బిజినెస్ చేయాలని కోరికగా ఉండేదట తాజాగా బెంగళూరులో ఈమె హోల్సేల్ క్లాత్ స్టోర్ (Cloth Store)ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఈ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

కంగ్రాట్స్ చెబుతున్న అభిమానులు..

Advertisement

ఎప్పటినుంచో ఇలాంటి ఒక బిజినెస్ ప్రారంభించాలని ఈమె కలలు కన్నారట అయితే నేటితో ఆకల నెరవేరిందని తెలియచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు, ఇతర సీరియల్ నటిమనులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా బిజినెస్ మంచిగా సక్సెస్ అవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇటీవల శోభా శెట్టి కూడా శోభ డిజైనర్ స్టూడియో అంటూ స్టూడియో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

?igsh=MWhjdGQ0emNiY2xmZA%3D%3D

Advertisement

ఇటీవల యాంకర్ లాస్య కూడా క్లాతింగ్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇలా బుల్లితెర ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సెలబ్రిటీలందరూ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. ఇక ఈమె తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో వేద పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సీరియల్ అనంతరం సత్యభామ సీరియల్లో సత్య పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ఈ సీరియల్ తర్వాత కొత్త సీరియల్స్ కు దేబ్జానీ కమిట్ అవ్వకపోయిన బుల్లితెరపై ప్రసారమవుతున్న స్టార్ మా పరివారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నా దేబ్జానీ మరోవైపు బిజినెస్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Allari Naresh: షూటింగ్ లో దెబ్బలు తగిలితే సినిమా హిట్..ఇదేం సెంటిమెంట్ రా బాబు!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×