E-Paper
Advertisement

Aadhya Engagement: ప్రియుడితో నిశ్చితార్థం జరుపుకున్న బుల్లితెర నటి ఆధ్య పరుచూరి.. ఫోటోలు వైరల్!

Aadhya Engagement: ప్రియుడితో నిశ్చితార్థం జరుపుకున్న బుల్లితెర నటి ఆధ్య పరుచూరి.. ఫోటోలు వైరల్!
Advertisement

Aadhya Engagement: ఇటీవల బుల్లితెరలో కూడా పెద్ద ఎత్తున పెళ్లి భాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే మరి కొంతమంది తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్నారు. నిన్నటికి నిన్న కోయిలమ్మ సీరియల్ నటీనటులు స్రవంతి సాయి కిరణ్ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు మగ బిడ్డ జన్మించినట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే తాజాగా మరో నటి కూడా అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశారు.

పృథ్వీతో ఆధ్య నిశ్చితార్థం..

బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఆధ్య పరుచూరి(Aadhya Paruchuri) ఒకరు. ఈమె శ్రీమతి శ్రీనివాస్, దేవతలారా దీవించండి వంటి సీరియల్స్ ద్వారా నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఆధ్య బుల్లితెర కార్యక్రమాలలో కూడా తనదైన శైలిలోనే సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇలా కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా ఆద్య నిశ్చితార్థం(Engagment) జరిగినట్లు తెలుస్తోంది.

నమ్మలేకపోతున్నాను..

Advertisement

ఈమె తన స్నేహితుడు పృథ్వీ (Pruthvi) అనే అబ్బాయితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పృథ్వి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. నా బెస్ట్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం జరిగింది ఇప్పటికీ మాకు నిశ్చితార్థం జరిగిందంటే నమ్మలేకపోతున్నానని, ఇది ఒక కలగానే ఉందని తెలిపారు. త్వరలోనే తామిద్దరం ఒకటి కాబోతున్నాము అంటూ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

Advertisement

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు, బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా క్యూట్ కపుల్ అంటూ ఈ జంటపై కామెంట్లు చేస్తున్నారు. ఇక నిశ్చితార్థపు లుక్ లో ఆధ్యా ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. ఇలా ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన ఈ జంట పెళ్లి ఎప్పుడు? ఏంటి? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు ఇక ఈమె పెళ్లి చేసుకోబోయే పృథ్వి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థపు ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Premante First Day Collections: ప్రేమంటే ఫస్ట్ డే కలెక్షన్స్.. స్టార్ నటీనటులు ఉన్నా… మరీ అంత తక్కువా ?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×