E-Paper
Advertisement

Actor Vishwa: కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటుడు విశ్వ.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!

Actor Vishwa: కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటుడు విశ్వ.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!
Advertisement

Actor Vishwa: ఇటీవల కాలంలో ఎంతోమంది బుల్లితెర నటీనటులు ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున సంపాదన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇక మరి కొంతమంది సెలబ్రిటీలు ఏకంగా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఎంతోమంది క్లోతింగ్ బిజినెస్ ప్రారంభించగా మరి కొంతమంది బోటిక్స్ , డిజైనర్ స్టూడియోస్ ప్రారంభించి మంచిగా ఆదాయం పొందుతున్నారు. అయితే తాజాగా బుల్లితెర నటుడు విశ్వ (Vishwa)సైతం మరో కొత్త వ్యాపారం లోకి అడుగుపెట్టారు. ఫిట్నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే విశ్వ తాజాగా జిమ్ సెంటర్ ప్రారంభించారు. తాజాగా ఈయన విశ్వ ఫిట్నెస్ క్లబ్(Vishwa Fitness Club) పేరిట జిమ్ సెంటర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ జిమ్ సెంటర్ ను ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా డిజిటల్ లాంచ్ చేశారు.

విశ్వ ఫిట్ నెస్ క్లబ్….

సాధారణంగా విశ్వ ఫిట్ నెస్ కు కీలక ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వ్యక్తి ఏకంగా తన పేరిట జిమ్ సెంటర్ ప్రారంభించడంతో ఎంతోమంది అభిమానులు ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక జిమ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పలువురు బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా కూడా పాల్గొన్నారు. ఇక త్వరలోనే సమ్మర్ రాబోతున్న నేపథ్యంలో ఈయన తన ఫిట్నెస్ క్లబ్ లో సమ్మర్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.

యువ సీరియల్ తో బుల్లితెర నటుడిగా పరిచయం..

Advertisement

బుల్లితెర నటుడిగా కొనసాగుతూనే ఈయన మరోవైపు ఇలాంటి బిజినెస్ ప్రారంభించడంతో ఇందులో కూడా మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. విశ్వ బుల్లితెర సీరియల్స్ లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన అక్కినేని నాగార్జున నిర్మాణంలో వచ్చిన యువ అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఈ సీరియల్ ద్వారా విశ్వ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని తదుపరి వరుసగా గంగతో రాంబాబు, గంగ మంగ అనే సీరియల్స్ లో నటించారు. ఇలా సీరియల్స్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్న విశ్వ ఇటీవల సీరియల్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

?igsh=bjhndXZrNXhyYnM5

Advertisement

ఇక బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమానికి కంటెస్టెంట్ గా కూడా కొనసాగిన విశ్వ ఈ రియాలిటీ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ తర్వాత విశ్వ డాన్స్ జోడి డాన్స్, ఇస్మార్ట్ జోడి, బిబి జోడి సీజన్ 2 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన నేహా చౌదరితో కలిసి బి బి జోడీ సీజన్ 2 కార్యక్రమంలో కంటెస్టెంట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ రన్నర్ గా నిలిచారని సమాచారం. ఇలా కెరియర్ పరంగా ఒకవైపు క్షణం తీరిక లేకుండా గడుపుతూనే మరోవైపు ఈయన బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టడం విశేషం.

Also Read: Virosh wedding: విరోష్ వెడ్డింగ్ ..అలిగిన గబ్బర్ సింగ్ టీమ్.. మేమేం పాపం చేసినాం అన్నా అంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×