E-Paper
Advertisement

Trinayani Serial Today : విశాల్ ను చంపేందుకు తిలోత్తమ కుట్ర.. బుద్ధిచెప్పిన గాయత్రి పాప

Trinayani Serial Today : విశాల్ ను చంపేందుకు తిలోత్తమ కుట్ర.. బుద్ధిచెప్పిన గాయత్రి పాప
Advertisement

Trinayani Serial Today September 13th Episode: అందరూ ప్రసాదం కోసం గొడవ పడుతుంటారు. ఇంతలో ఒక ఎలుక వచ్చి పాయసాన్ని కిందపడేసి వెళ్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. నయని స్వామికి కోపం వచ్చినట్టు ఉంది. తన దగ్గర పెట్టిన ప్రసాదం వెంటనే తీసుకుని తినడానికి గొడవ పడుతున్నారు అనుకుని ఉంటాడు అంటుంది నయని. తిలోత్తమ్మ మాత్రం గాయత్రి పాప పాయసం తినలేదని బాధపడ్డట్టు నటిస్తుంది. అయితే సాయంత్రం పూజకు మళ్లీ ప్రసాదం చేస్తానని అప్పుడు పాపకు పెడతానని నయని చెప్తుంది.

సుమనకు వార్నింగ్ ఇచ్చిన విక్రాంత్

Advertisement

తర్వాత విక్రాంత్ ప్లేట్లు పట్టుకుని సుమనను పిలుస్తాడు. విశాల్ రూంలో భోజనం పెడదాం పద అంటాడు. దీంతో సుమన మా అక్క చేసే పని మీరు చేయడం ఏంటని.. అడుగుతుంది. దీంతో పాపం వదిన అన్ని పనులు తనే చూసుకుంటుంది. పైగా ఇద్దరు పిల్లలు. అందులోనూ బ్రో ఇప్పుడు తను తినలేడని చెప్పడంతో విశాల్ ను వెటకారంగా మాట్లాడుతుంది సుమన. దీంతో విక్రాంత్ కోపంగా సుమనకు వార్నింగ్ ఇస్తాడు. ఇందాకా నువ్వు చెప్పినట్టు నువ్వే తినేటట్టు చేస్తానని తిడతాడు. నువ్వు తప్పుకో అంటూ విక్రాంత్ తీసుకెళ్లబోతుంటే సుమన అడ్డుపడుతుంది. సుమనను తిట్టి విక్రాంత్ భోజనం తీసుకెళ్తాడు.

ఇంట్లో ఎలుక చచ్చిన వాసన వస్తుందన్న హాసిని

Advertisement

తర్వాత హాసిని, దురందర, నయని గార్డెన్ లో కూర్చుని ఉంటారు. హాసిని అందరికీ స్ప్రే చేస్తుంది. ఇంతలో వల్లభ వచ్చి ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు అని అడుగుతాడు. దీంతో వల్లభకు కూడా స్ప్రే కొడుతుంది. ఎందుకు కొడుతున్నావు అని అడగ్గానే ఇంట్లో ఎలుక చనిపోయిన వాసన వస్తుందని, అందుకే కొడుతున్నానని హాసిని చెప్తుంది. ఇంతలో నయని పూజ టైంలో ప్రసాదం మీద దూకిన ఎలుకే చనిపోయిందా? అని అడుగుతుంది. దురందర అదేం కాదు ఎందుకంటే అది దూకగానే పారిపోయింది అని చెప్పగానే మరి ఎలా వాసన వస్తుంది అని హాసిని అడుగుతుంది. నా వల్లే వస్తుందని ఇవాళ సాయంత్రం స్నానం చేయలేదని వల్లభ అనగానే అందరూ షాక్ అవుతారు. దురందర స్ప్రే బాటిల్ తీసి వల్లభకు ఇస్తుంది. దీంతో హమ్మయ్య మా మీద డౌట్ రాకుండా చేశాను అని వల్లభ మనసులో అనుకుంటాడు. అందరూ కలిసి మీరు ఇక్కడి నుంచి వెళ్లండి అని చెప్పగానే వల్లభ వెళ్లిపోతాడు.

Also Read: రామ్మూర్తితో అమర్ అలా ఎందుకు అన్నాడు ? మేజర్ అమర్ కు ఏం చెప్పాడు ?

విశాల్ ను చంపేందుకు డాక్టర్ ను పిలిపించిన తిలొత్తమ

తర్వాత అందరూ హాల్లో కూర్చుని సీరియస్ గా ఆలోచిస్తుంటారు. ఇంతలో తిలొత్తమ.. వల్లభ ఇంకా రాలేదని ఎదురుచూస్తుంది. ఇంతకీ మీరు ఎవరికోసం పంపిచారు అని అడుగుతారు. డాక్టర్ ను తీసుకురావాలని పంపిచాను అంటుంది. ఇంతలో డాక్టర్ ను తీసుకుని వల్లభ వస్తాడు. తిలొత్తమ డాక్టర్ ముసలయ్యను విశాల్ కు పరిచయం చేస్తుంది. డాక్టర్ తాను కెనడాలో సెటిలయ్యానని చెప్తాడు. హాసిని, సుమన డాక్టర్ తో పాటు వచ్చిన సిస్టర్ మీద జోకుల వేస్తుంటారు. ఇంతలో డాక్టర్ ను ముసలయ్య అని మీకు ఎలా ఆ పేరు పెట్టారు అని హాసిని అడుగుతుంది. అలాగే సిస్టర్ ను మీరు మీ డాక్టర్ గారిని ఎమని పిలుస్తారు అని అడుగుతుంది. దీంతో సిగ్గుతో వయ్యారంగా సిస్టర్ డాక్టర్ తాను ఎలా పిలిచేది చెప్తుంది. సిస్టర్, డాక్టర్ మాటలకు అందరూ నవ్వుకుంటారు. పక్కనే ఉన్న డాక్టర్ కిట్ ను ఓపెన్ చేసిన గాయత్రి పాప మెడిసిన్ సిరంజీలోకి ఎక్కిస్తుంది. ఎవరి మాటల్లో వాళ్లు ఉంటారు. కానీ హాసిని గమనిస్తుంది.

గాయత్రి అత్తయ్య ఇంజక్షన్ తీసుకుంది అంటే తిలొత్తమ అత్తయ్య తీసుకొచ్చిన డాక్టర్లకు బుద్ది చెప్పాలనుకుంటుందేమో అనుకుని గాయత్రి పాప చేతిలోని ఇంజక్షన్ తీసి డాక్టర్ పక్కన పెడుతుంది. ఇంతలో విశాల్ తనకు ఇంజక్షన్ ఏమీ వద్దని చెప్తాడు. దీంతో డాక్టర్ పేషెంట్స్ ఎప్పుడూ ఇలాగే అంటారు మేమే వేస్తాము అని చెప్పగానే.. నేను పేషెంట్ చేయి పట్టుకుంటాను మీరు ఇంజక్షన్ చేయండి డాక్టర్ అంటుంది సిస్టర్. ఇంతలో హాసిని.. సిస్టర్ ను ముందు నువ్వు కూర్చో అంటూ ఇంజక్షన్ పెట్టిన సోఫా మీద కూర్చోబెడుతుంది. ఇంజక్షన్ గుచ్చుకోవడంతో సిస్టర్ ఏడుస్తుంది. ఏదో గుచ్చుకుంది అంటూ అరుస్తుంది. హాసిని నవ్వుకుంటుంది. వల్లభ వచ్చి సిస్టర్ ను సోఫాలోంచి పైకి లేపడంతో సిస్టర్ కు గుచ్చుకున్న ఆఫ్రికా సిరంజిని చూసి డాక్టర్ షాక్ అవుతాడు. ఆ ఇంజక్షన్ నువ్వెందుకు వేసుకున్నావు అని డాక్టర్ అడుగుతాడు. అంతలా నొప్పి వచ్చే ఇంజక్షన్ నాకెందుకు వేయించాలనుకున్నావు అమ్మా అని విశాల్, తిలొత్తమను ప్రశ్నిస్తాడు. ఇంతటితో నేటి త్రినయని సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×