E-Paper
Advertisement

Trinayani Serial Today October 9th: ‘త్రినయని’ సీరియల్‌: నయని ఇంటికి వచ్చిన అహల్య – భర్త గురించి ఎమోషనల్‌ అయిన అహల్య  

Trinayani Serial Today October 9th: ‘త్రినయని’ సీరియల్‌: నయని ఇంటికి వచ్చిన అహల్య – భర్త గురించి ఎమోషనల్‌ అయిన అహల్య  
Advertisement

trinayani serial today Episode:  వల్లభ ఇంకోటి అడుగు అనగానే ఇంకో పొడుపుకథ అడుగుతుంది హాసిని. దీంతో వల్లభ ఆన్సర తెలియక ఆలోచిస్తుంటాడు. మళ్లీ నయనే ఆన్సర్‌ చేస్తుంది. ఇంతలో ఎవరో వల్లభకు ఫోన్‌ చేసి తిడుతుంది. మీ అమ్మ జిత్తుల మారి నక్క తనకు ఫోన్‌ ఇవ్వు అని చెప్తుంది. దీంతో వల్లభ మమ్మీ ఎవరో నిన్నే తిడుతుంది అంటూ ఫోన్‌ ఇస్తాడు. ఫోన్‌ తీసుకున్న తిలొత్తమ్మ ఎవరని అడుగుతుంది.

నన్నే మర్చిపోయావంటే నేను నిన్ను కలవాల్సిన టైం దగ్గర పడింది. రేపే నిన్ను కలుస్తాను అని ఫోన్‌ పెట్టేస్తుంది. ఎవరని అందరూ అడుగుతారు తెలియదని చెప్తుంది తిలొత్తమ్మ. అప్పు ఇచ్చిన వాళ్లైతే కాదు కదా? అంటుంది సుమన. చచ అలాంటిదేం లేదని చెప్తుంది తిలొత్తమ్మ. మీ అమ్మకు ఈరోజు నిద్ర పట్టదు లేండి అంటుంది హాసిని. చూస్తా రేపు ఎవరు వస్తారో అంటుంది తిలొత్తమ్మ.

Advertisement

మరుసటి రోజు హాల్లో హాసిని, సుమన, దురంధర, తిలొత్తమ్మ ఉంటారు. తిలొత్తమ్మ టెన్షన్‌తో అటూ ఇటూ తిరుగుతుంది. వదిన నువ్వెందుకు టెన్షన్‌ పడుతున్నావు అని దురందర అడుగుతుంది. దీంతో నేనేమీ టెన్షన్‌ పడటం లేదని చెప్తుంది తిలొత్తమ్మ. ఇంతలో ఏమైందని నయని, విశాల్‌ వస్తారు. ఏం కాలేదని హాసిని మా అత్తయ్యకే ప్రాబ్లమ్‌ లా ఉంది అని చెప్తుంది. నిన్న ఫోన్‌ కాల్‌ చేసిన ఆవిడ ఐదు నిమిషాల్లో వస్తున్నానని మెసేజ్‌ చేసిందట. ఆ విషయం తెలిసి మా ఆయన ఎటు పారిపోయాడో తెలియడం లేదు అని హాసిని అంటుంది.

ఇంతలో ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. కారొచ్చింది అని నయని చెప్తుంది. ఆవిడగారు ఎవరో చూడాలని ఉంది అంటుంది సుమన. ఇంతలో కారు దిగిన ఆవిడ బోమ్మను తన ముఖానికి అడ్డంగా పెట్టుకుని లోపలికి వస్తుంది. అందరూ ఎవరా అని చూస్తుంటారు. లోపలికి వచ్చిన ఆవిడ బొమ్మను గాయత్రికి చూపిస్తూ నీకోసమే తీసుకొచ్చాను చూడు అంటుంది. బొమ్మను తన ముఖానికి అడ్డం తీయగానే గాయత్రి వెళ్లి బొమ్మ తీసుకుంటుంది. తిలొత్తమ్మ మాత్రం షాకింగ్‌ గా అహల్య అంటూ పిలుస్తుంది. నయని, విశాల్‌ హ్యాపీగా పిలుస్తారు. అమ్మగారు ఎన్ని రోజులు అయింది మిమ్మల్ని చూసి అంటుంది. పిన్ని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు అని విశాల్‌ అడుగుతాడు.

Advertisement

తిలొత్తమ్మను తిట్టిన అహల్య.. నాకు తిలొత్తమ్మ చేసిన ద్రోహం చాలు నువ్వు ఎలాంటి దానివో వీళ్లందరికీ తెలియడానికి అంటుంది. ఇంతలో అహల్య ఎవరని సుమన, హాసినిని అడుగుతుంది. జగదీశ్‌ మామయ్యవాళ్ల తమ్ముడి భార్య అని చెప్తుంది హాసిని.  ఇన్నాళ్ల తర్వాత నేను తిరిగి వచ్చాను కానీ నా భర్త ఏమైపోయారో ఇప్పటికీ ఆచూకి లేదని అహల్య చెప్తుంది. పిన్ని బాబాయ్‌ మిస్సింగ్‌ కేసు ఇంకా నడుస్తూనే ఉంది అంటాడు విశాల్‌. ఏదో ఒక రోజు చిన్న బావగారు తిరిగి వస్తారు అనుకుంటా అంటుంది తిలొత్తమ్మ.

రారు తిలొత్తమ్మ అని ఎందుకంటే మా ఆయన బతికి ఉన్నారో లేదో కూడా తెలియదు అంటుంది అహల్య. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఒకవేళ కన్నుమూసినా పునర్జన్మ ఎత్తి ఈ ఇంట్లో ఉండటానికి ఆయనేమీ గాయత్రి అక్కలాగా కాదు అంటుంది. ఇంతలో సుమన గాయత్రి అత్తయ్యా పునర్జన్మ ఎత్తారు కానీ మా అక్క కనగానే పెద్ద బిడ్డను ఎత్తుకెళ్లిపోయారు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాము కానీ దొరకడం లేదు అని చెప్తుంది. అదేంటి.. ఈ గాయ్రతి పాపనే గాయత్రి అక్క కాదా? అని అడుగుతుంది అహల్య.

వదిన నిన్నమొన్నటి దాకా ఈ కన్పీజన్‌ ఉండేది. కానీ గాయత్రి వదినే వచ్చి నిజం చెప్పింది అని దురందర అంటుంది. హాసిని కూడా గాయత్రి అత్తయ్య వేరు.. గాయత్రి పాప వేరు అంటుంది. దీంతో కాదు వేరు కాదు కచ్చితంగా కాదు అంటుంది అహల్య. దీంతో అంత కచ్చితంగా మీరెలా చెప్తున్నారు అంటూ నయని అడుగుతుంది. పిన్ని గాయత్రి పాపే మా అమ్మ అని మీరెలా అనుకుంటారు అని విశాల్‌ కూడా అడుగుతాడు. నేను అనుకోవడం కాదు విశాల్‌ జరిగిన దాన్ని బట్టి నేను ఆ మాట అన్నాను అంటుంది అహల్య. నాకు కాస్త సమయం ఇస్తే నిజానిజాలు చెప్తాను అంటుంది అహల్య. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి అత్తయ్యా అంటూ ఇల్లు చూద్దురు రండి అని అహల్యను తీసుకెళ్తుంది నయని.

గార్డెన్‌ లో కూర్చున్న విశాల్‌కు విక్రాంత్‌ ఫైల్‌ ఇస్తాడు. ఫైల్‌ చూసిన విశాల్‌, నయనితో సంతకం చేయించి వాళ్లుక పంపించు అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సుమన అహల్య గురించి వల్గర్‌ గా మాట్లాడుతుంది. దీంతో నయని, విక్రాంత్‌ కోపంగా చూస్తుంటారు. తర్వాత ఎవరు కొడతారో ముందుగా చెప్పండి అని అడుగుతుంది. ఎవరం కొట్టం కానీలే అంటారు. దీంతో ఇంతకీ అహల్య గారు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ అని అడుగుతుంది. ఆమెను గురించి నువ్వు ఆలోచించవద్దని విశాల్‌ చెప్తాడు.  ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×