E-Paper
Advertisement

Trinayani Serial Today October 22nd: ‘త్రినయని’ సీరియల్‌: ఎవరి వల్ల గండమో చెప్పిన విశాలాక్షి – పేరు తెలుసుకుని షాకైన తిలొత్తమ్మ

Trinayani Serial Today October 22nd: ‘త్రినయని’ సీరియల్‌: ఎవరి వల్ల గండమో చెప్పిన విశాలాక్షి – పేరు తెలుసుకుని షాకైన తిలొత్తమ్మ
Advertisement

trinayani serial today Episode: సుమన వచ్చి హాసిని తిడుతుంటే వదినను తిడితే పాపం వస్తుందని విక్రాంత్‌ తిడతాడు. దీంతో మీరు నాకు అర్థమే కారు..  ప్రాణాలు తీయాలనుకున్న వదినను మంచిది అమాయకురాలు అంటారు. మిమ్మల్ని ప్రాణంగా చూసుకునే నన్ను మాత్రం రాక్షసి అని తిడతారు అంటూ కోప్పడుతుంది. దీంతో హాసిని వదిన మంచికో చెడుకో అలాంటి ప్రయోగం చేసింది. దీంతో నయని వదినకు ప్రాణగండం లేదని తెలిసిపోయింది అని విక్రాంత్‌ చెప్పగానే మంచిది కానీ మరి ఇదేంటి అని ఇంకో పాయిజన్‌ బాటిల్‌ చూపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని విక్రాంత్‌ అడుగుతాడు. చెత్తబుట్టలో దొరికింది అని సుమన చెప్తూ.. హాసిని అక్కా మరోసారి నయని అక్కకు విషం పెట్టాలనుకుందా? అని ప్రశ్నిస్తుంది. అలా కాదు ఇది ఎవరో తీసుకొచ్చారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని విక్రాంత్‌ ఆలోచిస్తుంటాడు.

పావణమూర్తి, దురంధరకు ఫోన్‌ చేసి మాట్లాడుతుంటాడు. ఇంతలో విశాలాక్షి వచ్చి ఆ నీళ్లల్లో చేయి ఎందుకు పెట్టావు అని అడుగుతుంది. ఇంతలో సుమన వచ్చి ఎందుకు ఆ నీళ్లల్లో చేయి పెడితే ఏమౌతుంది అని అడుగుతుంది. అవి మాట్లాడుకునే నీళ్లు అని.. నయని అమ్మకు మృత్యుగండం రావడానికి కారకులు ఎవరో ఆ నీళ్లల్లో చూపిస్తాను అని  చెప్తుంది విశాలాక్షి. ఇంకెవరు హాసిని అక్కా అని తేలింది కదా? పుస్తకంలో పేరు కూడా వచ్చింది కదా? అంటుంది సుమన. అవును చెప్పేశాను కదా? అంటుంది హాసిని. మధ్యాహ్నం విషప్రయోగంలో ఫెయిల్ అయింది కదా? అంటుంది తిలొత్తమ్మ.

Advertisement

ఇంతలో విశాలాక్షి.. నేను వెళ్లే ముందు మీకు ఒక్క విషయం చెప్తాను. నయని అమ్మను మీలో ఎవరు కాపాడతారు అని అడుగుతుంది. దీంతో ఒక్కొక్కరు మేము కాపాడతామంటే మేము కాపాడతామని చెప్తారు. హాసిని మాత్రం నేను పోయినా పర్వాలేదు కానీ చెల్లికి ఏమీ కాకూడదు అంటుంది. హాసిని జోక్స్‌ వేస్తుంది చూడు మమ్మీ అంటాడు వల్లభ. దీంతో హాసిని వల్లభను తిడుతుంది. నయని అక్క కోసం నేను ఏమైనా చేస్తాను అంటుంది. అంటే ఈ లెక్కన నయని అమ్మకు గండం వచ్చేది నీవల్ల కాదన్నమాట అని విశాలాక్షి అడుగుతుంది. దీంతో నావల్లే అని పుస్తకంలో నా పేరు కూడా కనిపించింది అని చెప్పాను కదా విశాలాక్షి అంటుంది హాసిని.

అబద్దం ఆడకు పెద్దమ్మ పుస్తకంలో నీ పేరు కనిపించిందని అబద్దం చెప్పావు కదా? అని విశాలాక్షి ప్రశ్నించడంతో అందరూ షాక్‌ అవుతారు. వదిన ఎందుకు అలా అన్నావు అందరూ నిన్ను అపార్థం చేసుకున్నారు కదా? అంటాడు విశాల్‌. నయని కూడా ఎందుకు అక్కా అబద్దం చెప్పావు అని అడుగుతుంది. దీంతో విశాలాక్షి నేనైనా నువ్వు చూసిన పేరు చెప్పాలి కదా? పెద్దమ్మ అంటుంది. దీంతో చెప్పొద్దు అని హాసిని గట్టిగా అరుస్తుంది. కొంపదీసి నాపేరు చెప్తుందా? ఏంటి అని తిలొత్తమ్మ మనసులో అనుకుంటుంది. ఇంతల వల్లభ నిజం చెప్పమని అది మా మమ్మీ పేరైనా.. సరే చెప్పు అంటాడు వల్లభ.

Advertisement

నయని, విశాల్‌ కూడా చెప్పమని అడుగుతారు. నువ్వు పేరు చెప్పినంత మాత్రాన నిన్ను ఎవ్వరూ శత్రువుగా చూడరు అంటారు. దీంతో సారీ చెల్లి నా వల్ల కాదు అంటుంది హాసిని. మొగుడిని కాపాడుకోవడానికి హాసిని అక్కా ఇలా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతుంది అనుకుంటా అంటుంది సుమన. దీంతో వల్లభ షాక్‌ అవుతాడు. నాకు పకోడి చేయడం కూడా రాదు. పక్కోడి ప్రాణం తీసేంత సీన్‌ ఉందా? నాకు అంటాడు. ఇంతలో విక్రాంత్‌ వదిన మీరు చెప్పాలి.. లేదంటే మనలో మనం గొడవ పడాల్సి వస్తుంది చెప్పండి అంటాడు. సోదరి.. హాసిని అమ్మా భయపడుతుంది నువ్వైనా చెప్పు అంటూ విశాలాక్షిని అడుగుతాడు పావణమూర్తి. చూపించమంటావా? సోదరా ఇందాకా నువ్వు ఆడుకున్న నీళ్లే వాళ్లెవరో చూపిస్తుంది అని విశాలాక్షి చెప్పగానే ఇప్పుడు ఆ నీళ్లు తాగాలా అని అడుగుతాడు.

లేదు మీరందరూ నయని అమ్మా తప్పా ఒక్కొక్కరుగా వచ్చి ఈ నీళ్లలో చేయి పెట్టండి.. గండానికి కారణం ఎవరో వాళ్లు చేయి పెడితే నీళ్ల రంగు మారుతుంది అని విశాలాక్షి చెప్తుంది. దీంతో ఒక్కోక్కరుగా నీళ్లలో చేతులు పెడుతుంటారు. ఫస్ట్‌ హాసిని, తర్వాత విక్రాంత్‌ చేతులు పెట్టినా నీళ్లు రంగు మారవు. విశాలాక్షి, సుమనను రమ్మని చెప్తుంది అలాగేనని సుమన పెడుతుంది. తర్వాత పావణమూర్తిని పెట్టమంటుంది. ఆయన పెట్టినా రంగు మారవు. చివరికి తిలొత్తమ్మ నీళ్లలో చేయి పెట్టినా రంగు మారవు.. కానీ విశాల్‌ చేయి పెట్టగానే నీళ్లు రంగు మారిపోతాయి. అది చూసిన అందరూ షాక్‌ అవుతారు.  ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×