E-Paper
Advertisement

Trinayani Serial Today October 17th: ‘త్రినయని’ సీరియల్‌: వల్లభను చుట్టేసిన యమపాశం – అద్దంలో మనిషిని చూసి షాకైన నయని

Trinayani Serial Today October 17th: ‘త్రినయని’ సీరియల్‌: వల్లభను చుట్టేసిన యమపాశం – అద్దంలో మనిషిని చూసి షాకైన నయని
Advertisement

 trinayani serial today Episode: వల్లభ తాడు తీసుకుని వచ్చి ఈ తాడు ముందు నీ దగ్గరకు వచ్చి తర్వాత గాయత్రి పాప దగ్గరకు వెళ్లిందంటే అర్థం ఏంటి.. ఈపిల్ల వల్ల నీకు ప్రాణగండం ఉందని చెప్తాడు. దీంతో నయని భయంగా విశాల్‌ వైపు చూస్తుంది. ఏ బిడ్డైనా తల్లి మరణం కోరుతుందా? అని అంటుంది. విశాల్‌ కోపంగా వల్లభను తిడతాడు. నువ్వు ఎవరినైనా అను కానీ గాయత్రి పాపను అన్నావంటే నేను ఊరుకోను అంటూ నయని, గాయత్రి పాపను తీసుకుని వెళ్లిపోతుంటే వల్లభ కరెంట్‌ షాక్‌ కొట్టినవాడిలా గిలాగిలా కొట్టుకుంటూ కిందపడిపోతాడు. విశాల్‌, నయని ఏమైందని వస్తారు. గాయత్రిపాప తాడు మీద కాలు పెట్టగానే లేచి కూర్చుంటాడు. ఏమైందని అడుగుతాడు. దీంతో పసిపిల్లల మీద ధ్వేషం పెంచుకుంటే దిష్టి తగులుతుందని అందుకే నువ్వు అలా పడిపోయావని నయని అంటుంది.

విక్రాంత్‌ లోపల పని చేసుకుంటుంటే సుమన వస్తుంది. మీ వల్లభ అన్నయ్యకు కరెంట్‌ షాక్‌ కొట్టిందట.. అని చెప్తుంది. విక్రాంత్‌ తెలియదు అంటాడు. అది ఎలా జరిగిందో కూడా తెలుసుకోవా? అని సుమన అడుగుతుంది. నాకు అవసరం లేదని చెప్తాడు విక్రాంత్‌. అయితే అదే షాక్‌ నాకు తగిలి ఉంటే.. అని సుమన అడగ్గానే విక్రాంత్‌ లేచి ఓమై గాడ్‌ నన్ను కరుణించావా? స్వామి నీకు నా తల నీలాలు ఇవ్వడానికి రేపే మీ గుడికి వస్తాను అంటాడు.

Advertisement

ఆపండి.. నేను పోతే మీరు పండగ చేసుకుంటారు అనుకుంటా? అంటుంది సుమన. మరీ అంత ఉత్సాహం పనికిరాదని నేను చెప్పేది వినండి. ఆ తాడు వల్లనే కరెంట్‌ షాక్‌ కొట్టిందట అని సుమన చెప్పగానే విక్రాంత్‌ అదే యమపాశమేనా? అని క్లారిటీగా అడుగుతాడు. అవునని ఆదే తాడుతో షాక్‌ కొట్టి చేపపిల్లలా విలవిలలాడిపోయాడట. అంటుంది. ఏం జరిగినా నా బ్రదర్‌కు ఏం కాదులే.. పాపి చిరాయువు అంటారు కదా? అంటాడు. మీరు ఎలా అనుకున్నా సరే అంటూ సుమన వెళ్లిపోతుంది.

పావణమూర్తి డాన్స్‌ కిందకు వస్తుంటే వల్లభ వచ్చి ఏంటి మామయ్యా హుషారుగా ఉన్నారు అని అడుగుతాడు. నయని అమ్మా.. విశాల్‌ మంచిగా ఉంటే నేను బాగానే ఉంటాను అంటాడు. ఇంతలో సుమన, విక్రాంత్‌, విశాల్‌, నయని, విశాలాక్షి వస్తారు. ఎప్పుడూ మీరు ఈ పిల్లను తీసుకునే వస్తారేంటి? అని అడుగుతాడు వల్లభ. వాళ్ల కన్నా ఈ పాప ఉండటమే మంచిది అంటుంది విశాలాక్షి.  అయితే విశాలాక్షిని వాయనం ఎవరికివ్వాలని తీసుకొచ్చావని విశాల్‌ అడుగుతాడు. అందంగా రెడీ అయిన ఎవరికైనా ఇస్తాను అంటుంది విశాలాక్షి.

Advertisement

ఇక్కడ మేం ముగ్గురమే ఉన్నాము కదా? అంటుంది నయని. ఇంతలో సుమన, తిలొత్తమ్మ మాకేం వద్దని చెప్తారు. దీంతో విశాలాక్షి మీకేం ఇవ్వడం లేదని చెప్తుంది. మరి ఎవరికి ఇస్తారు అని అడుగుతారు. గాయత్రి పాపకు ఇస్తారేమో అని వల్లభ అంటాడు. ఇంతలో గాయత్రి పాపను ఎవరు చూసుకుంటారో వాళ్లకు ఇస్తాను అంటుంది విశాలాక్షి. మేము బాగానే చూసుకుంటున్నాము కదా అంటారు నయని, విశాల్‌. గాయత్రి పాప వాళ్ల అమ్మకు ఇస్తాను అంటుంది విశాలాక్షి.

సుమన కోపంగా ఏయ్‌ విశాలాక్షి నువ్వు ఏం చెప్పదలచుకున్నావో క్లియర్‌గా చెప్పు అర్థం కావడం లేదు అంటూ అడుగుతుంది. చెప్తే అర్థం కానప్పుడు చూపిస్తాను అంటుంది విశాలాక్షి. ఎవరిని చూపించబోతున్నావు అంటూ నయని అడుగుతుంది. నువ్వు ఈ చీరను ఇవ్వాలి కదా? వారిని చూపిస్తాను అంటుంది విశాలాక్షి. పావణమూర్తి.. గాయత్రి కన్నతల్లిని చూపిస్తావా? ఆమె లేదు కదా? అంటాడు. దీంతో గుండెల మీద చేయి వేసుకుని చెప్పు అని విశాలాక్షి అడుగుతుంది. దీంతో పావణమూర్తి పాప కన్నతల్లి నయనే కదా? అని మనసులో అనుకుని నన్ను వదిలేయండి బాబు అంటాడు.

ఇంతలో నయని వాయనం తీసుకుని గాయత్రిని చూసుకునే ఆమెకు ఈ వాయనం ఇవ్వమన్నావు తను ఎక్కడుందో తెలియదు. నువ్వు చూపిస్తానన్నావు ఎక్కడుందో నీకే తెలియాలి అని అడుగుతుంది. దీంతో విశాలాక్షి అక్కడుందమ్మా అని చూపిస్తుంది. అక్కడ ఎవరున్నారు ఎవరూ లేరు కదా? అంటుంది సుమన. నయనమ్మా అక్కడికి వెళ్లితే కనిపిస్తుందని చెప్తుంది విశాలాక్షి. నయని అక్కడకు వెళ్లి చూసి ఇక్కడ అద్దం తప్ప ఏమీ లేదని చెప్తుంది. అద్దంలో చూస్తే కనిపిస్తుంది అని చెప్పగానే నయని అద్దంలో చూసి షాక్ అవుతుంది. వాయినం కింద పడిపోతుంది.

అద్దంలో నయనే కనిపిస్తుంది.  ఎవరు నువ్వు అని నయని అడుగుతుంది. అద్దం టచ్‌ చేయగానే అద్దం పగిలిపోతుంది. పగిలిపోయిన అద్దం ముక్కల్లో కూడా నయని ప్రతిరూపం కనిపిస్తుంది. అందరూ అయోమయంగా ఉంటారు. విశాల్‌ వచ్చి నయని ఏమైందని అడుగుతాడు. విశాల్‌ ను హగ్‌ చేసుకని ఏడుస్తుంది నయని. ఇంతలో గాయత్రి పాపను తీసుకుని వెళ్లిపోతుంది నయని.  ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×