E-Paper
Advertisement

Trinayani Serial Today January 18th: ‘త్రినయని’ సీరియల్‌: టీలో విషం కలిపిన హాసిని – తిలొత్తమ్మను టీ తాగొద్దన్న విశాలాక్షి   

Trinayani Serial Today January 18th: ‘త్రినయని’ సీరియల్‌: టీలో విషం కలిపిన హాసిని – తిలొత్తమ్మను టీ తాగొద్దన్న విశాలాక్షి   
Advertisement

trinayani serial today Episode: దురందర ఆయాస పడుతూ వెళ్లి హాల్లో సోపాలో కూర్చుని అలాగే నిద్రలోకి జారుకుంటుంది. ఇంతలో గాయత్రి పాప వచ్చి దురందర కడుపు మీద చేయి పెట్టి రాస్తుంది. ఇంతలో రత్నాంభ వచ్చి ఇక్కడేం చేస్తున్నావు పాప అని అడుగుతుంది. ఇంతలో నిద్ర లేచిన దురందర కూడా ఇక్కడేం చేస్తుంది అని అడుగుతుంది. నీ కడుపు మీద పెట్టి సుతారంగా రాస్తుంటే ఏం చేస్తున్నావు అని అడుగుతున్నానమ్మా..? అని చెప్తుంది రత్నాంభ. వామ్మో నా కడుపులో బిడ్డకు ఏం కాదు కదా అంటుంది దురందర. ఇంతలో నయని వస్తుంది. అదేంటి పిన్ని అలా అంటావు అని అడుగుతుంది. ఏమో నయని ఆ విశాలాక్షి ఏం చెప్పింది.

తిలొత్తమ్మ వదిన నాలుగు రోజుల్లో కన్ను మూస్తే నాలుగు నెలలో మళ్లీ నా బిడ్డగా పుడుతుంది అన్నది కదా..? పోయిన వాళ్లు మళ్లీ జన్మ ఎత్తితే మన వాళ్లు దూరం కానట్టు ఉంటుంది కదా పిన్ని అని నయని చెప్తుంది. దురందర భయం అది కాదు నయని.. గాయత్రి పాపకు తెలిసిందేమోనని.. అని రత్నాంభ చెప్పగానే..  ఏ విషయం అని నయని అడుగుతుంది. దురందర కడుపులో మళ్లీ విశాలాక్షి పుడుతుందని.. రత్నాంభ చెప్తుంది. ఊరుకే పిన్ని ఎవరైనా వింటూ నవ్వుకుంటారు అంటుంది నయని.

Advertisement

వినడానికి ఇది తమాషాగానే ఉండొచ్చు కానీ నష్టపోయాక అయ్యో పాపం అని జాలి పడే వాళ్లు ఎక్కువ అంటుంది దురందర. ఎందుకైనా మంచిది ఆ పాపకు కొంచెం దూరంగా ఉండమ్మా అంటుంది రత్నాంభ. మీకు చాదస్తం ఎక్కువై పోయింది అని రత్నాంభను తిడుతుంది. నిజం గాయత్రి.. ఇప్పటి వరకు ఎప్పుడు గాయత్రి నా దగ్గరకు రాలేదు. ఎప్పుడైతే విశాలాక్షి ఆ మాట చెప్పిందో కానీ గాయత్రి పాప నా దగ్గరకు రావడం ఏంటి..? అని దురందర చెప్పగానే.. నయని గాయత్రి పాపను తీసుకుని వెళ్లిపోతుంది.

తిలొత్తమ్మ ఆలోచిస్తూ కూర్చుంటే వల్లభ వస్తాడు. నువ్వేంటి నీ గ్లామర్‌.. ఆ వెయిట్‌.. ఆ గ్రేస్‌.. శ్రీమతి తిలొత్తమ్మ వస్తుంది అంటే ర్యాంపు షోలో ఉన్నట్టు ఉంటుంది. అలాంట లెజెండరీ పర్సనాలిటీ పోయి పోయి దురందర అత్తయ్య కడుపులో పుడుతావంటే ఊహించుకోవడానకే ఆసహ్యంగా ఉంది. పావణమూర్తి మామయ్య నీకు డాడీ అబ్బా ఏంటి మమ్మీ నీ కర్మ కాకపోతే అంటాడు వల్లభ..రేయ్‌ ఆపరా ఇంక అంటూ కోపంగా నువ్వు చెప్తుంటే.. నాకు ఇంకా బతకాలని ఉంది.

Advertisement

ఈ జన్మను పొడిగించుకుంటే తప్పా.. నువ్వు చెప్తున్న ఊబిలో పడకుండా ఉండగలను అనిపిస్తుంది. పొరపాటున ఈ నాలుగు రోజుల్లో చచ్చావనుకో.. అనగానే కోపంగా రేయ్‌ ఆపరా.. అంటుంది. దీంతో నువ్వు మేల్కోని అత్తయ్య కడుపున పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు..నన్ను ఏం చేయమన్నా చేస్తాను అంటాడు. సరే రేపు పొద్దునే ఆలోచించుకుని చెప్తాను. ఇప్పుడు నువ్వు వెళ్లిపో అని చెప్తుంది తిలొత్తమ్మ. సరేనని వల్లభ వెళ్లిపోతుంటే.. నా రూం బయట తాళం వేసుకుని వెళ్లిపో అంటుంది.

విక్రాంత్‌ వర్క్‌ చేసుకుంటుంటే.. సుమన వచ్చి ఎదురుగా అటూ ఇటూ తిరుగుతుంది. ఏయ్‌ నువ్వు ఇక్కడే క్యాట్‌ వాక్‌ చేయాలా..? అంటూ ఇరిటేట్‌ అవుతాడు. అయితే మీరు నా మీద దృష్టి పెట్టారన్నమాట అంటుంది. చెత్తను పంచుకోరు సుమన పారేస్తారు అంటాడు విక్రాంత్‌.  ఇప్పుడు నా కోసం కన్నా దురందర పిన్ని గురించి ఎక్కువ ఆలోచించాలి అంటుంది సుమన. ఎందుకు ఏం పాపం అంటాడు విక్రాంత్‌. మీ అమ్మకు మోక్షం రాకుండా తన ప్రాణం పోతే ఆ జీవం పిన్ని కడుపులో పెరుగుతున్న పిండంలో కలిసి తిలొత్తమ్మ అత్తయ్య మళ్లీ పుడుతుందట కదా..?

అది సరే కానీ ఆరు నెలల గర్బవతి అయిన పిన్ని కడుపులో ఏదో ఒక పిండం పెరుగుతుంది కదా..? ఇక తిలొత్తమ్మ ఎలా పుడుతుంది అని అడుగుతుంది. విశాలాక్షి చెప్పింది నాలుగు రోజుల్లో గాయత్రి పాప చేతిలో చనిపోతే ఈ ఇంట్లో పుడుతుంది. అంతే కానీ మళ్లీ జన్మ ఉండదు..  చావు ఉండదు అని కాదు అంటూ విక్రాంత్‌ చెప్పగానే.. సరదాగా చెప్తున్నారా..? అంటూ సుమన అడగ్గానే.. జరిగేది తెలిసినప్పుడు మనసు తేలికగానే ఉంటుంది సుమన అంటాడు విక్రాంత్‌.

నయని టీ తీసుకుని వస్తుంది. అందరికీ ఇస్తుంది. విశాలాక్షికి ఇవ్వలేదేంటని రత్నాంభ అడుగుతుంది. విశాలాక్షి టీ తాగదని చెప్తుంది. ఇంతలో నువ్వు ఆ టీ తాగితే చనిపోతావు తిలొత్తమ్మ అంటూ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. మీ ఇద్దరిలో ఎవరు చెప్తారు అంటూ విశాలాక్షి, నయని,హాసినిని అడుగుతుంది. దీంతో టీలో విషం కలిపిన విషయం హాసిని గుర్తు చేసుకుంటుంది. తిలొత్తమ్మను ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండమని నయని హెచ్చరిస్తుంది. ఇంతటితో  త్రినయని సీరియల్‌ ఈరోజు ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×