E-Paper
Advertisement

Trinayani Serial Today January 14th: ‘త్రినయని’ సీరియల్‌: నయనిని బతికించిన గురువు – షాక్ లో  తిలొత్తమ్మ, వల్లభ

Trinayani Serial Today January 14th: ‘త్రినయని’ సీరియల్‌: నయనిని బతికించిన గురువు – షాక్ లో  తిలొత్తమ్మ, వల్లభ
Advertisement

trinayani serial today Episode: గాయత్రి చూపించిన నయని బాడీని చూసి అందరూ షాక్‌ అవుతారు. చెల్లి ఇక్కడ పడుకుందేంటి చెల్లి అని హాసిని అంటుంది. పడుకోలేదు హాసిని కన్నుమూసింది అంటుంది తిలొత్తమ్మ.. ఏం మాట్లాడుతున్నావు వదిన అంటూ దురందర తిడుతుంది. అవును శాశ్వతంగా కన్ను మూసిందేమో అంటున్నాను అంటుంది తిలొత్తమ్మ.. మీ అమ్మ నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతుంది కానీ చెల్లిని లేపండి ముందు అంటుంది హాసిని.

ఏంటి లేపేది నిద్రా పెద్ద మరదలు కోమాలో ఉందో శవంగా ఉందో తెలియడం లేదు అంటాడు వల్లభ. దీంతో కోమాలోనే ఉంది వల్లభ అంటాడు గురువు. ఆరోజు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న నయనియే ఇక్కడ అచేతనంగా పడి ఉంది హాసిని అంటాడు గురువు. హాల్లో ఉంది కదా గురువు గారు అని దురందర అడగ్గానే.. ఇంకెక్కడ ఉంది. గాయత్రి పాప మా అమ్మవాళ్లను తీసకుని ఇక్కడకు రాగానే అక్కడ సంచి తీసుకుని ఉడాయించింది అంటాడు విక్రాంత్‌. దీంతో నేను చెప్పానా..? ఎవ్వరూ నమ్మలేదు అంటుంది తిలొత్తమ్మ. అవును అత్తయ్యా మీరు చెప్పినా ఎవ్వరూ వినలేదు అంటుంది సుమన.

Advertisement

మిమ్మల్ని మాయ చేస్తుందంటే మీరు నా మాట విన్నారా..? అంటుంది తిలొత్తమ్మ. మాయ చేయలేదు.. మంచే చేసుకుంటు వచ్చింది ఎవరినీ మోసం చేయలేదు అంటుంది హాసిని. అలా అయితే ఆరోజు త్రినేత్రి ఇంట్లోంచి వెళ్లిపోయిందని రత్నాంభ చెప్పారు కదా అంటుంది దురందర. ఎవరు చూశారు. మనవరాలు, బామ్మ కలిసి అలా నాటకం ఆడారేమో అంటాడు వల్లభ. మనం ఏది పడితే అది ఊహించుకోకూడదు. కానీ ఏది ఏమైనా మా అమ్మ అనుమానమే నిజమైంది. అమ్మా హ్యాట్సాప్‌ అంటాడు విక్రాంత్‌. ఇక గురువు గారే తన తపశక్తిని ఉపయోగించి వదిన స్పృహలోకి వచ్చేలా చేయాలి అంటాడు. సుమన కూడా అవును చేయాలని చెప్తాడు.

వల్లభ కూడా చేయాలని చెప్పగానే.. నువ్వు ఎమోషనల్‌ అవుతావేంటిరా..? డాక్టర్ల వల్ల కాకనే విశాల్‌ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అంటుంది. తిలొత్తమ్మ.. కానీ గురువు గారి వల్ల అవుతుంది. అమ్మవారి ఉపాసకులు. ఈ మేలు చేసి పుణ్యం కట్టుకుంటారు అని దురందర చెప్పగానే.. ఆయన వల్ల అవుతుంది అంటారా..? అని వల్లభ అనుమానంగా అడిగితే ఏం మాట్లాడుతున్నావు అల్లుడు గురువు గారు ఇది మీ శక్తికి కాదు మా నమ్మకానికి పరీక్ష అంటుంది దురందర. మీకు మీరే పందెలు పెట్టుకుని నన్ను శంఖిస్తున్నట్టు ఉంది అంటాడు గురువు.

Advertisement

అలా మాట్లాడకండి గురువు గారు మీరే ఏదో ఒకటి చేయాలి అంటుంది తిలొత్తమ్మ. దీంతో గురువు గారు అలాగే కాస్త ఓపికగా చూడండి అమ్మవారి కృపాకటాక్షం నయని మీద ఉందో లేదో చూడాలి అంటాడు గురువు. దీంతో కచ్చితంగా ఉంటుంది. మా వదిన అమ్మవారి భక్తురాలు అంటాడు విక్రాంత్‌. సరే అలాగే అంటూ గురువు.. నయని దగ్గరకు వెళ్లి నుదిటి మీద బొటనవేలు పెట్టి మంత్రిస్తాడు. నయని మెల్లగా కదులుతూ కళ్లు తెరుస్తుంది. విక్కి.. నయని స్పృహలోకి వస్తుంది అంటుంది.

అత్తయ్యా నువ్వు నేను నయని వదినతో పాటు గురువు గారు, చివరికి గాయత్రి పాప కూడా బ్రహ్మాండంగా నటిస్తున్నాం అని మనసులో అనుకుని తాము ఆడిన నాటకం గుర్తు చేసుకుంటాడు విక్రాంత్‌. మళ్లీ ఏమీ తెలియనట్టు ఉంటాడు. కళ్లు తెరచిని నయని దగ్గరకు హాసిని వెళ్లి చెల్లి అంటుంది. నయని కూడా అక్కా అంటూ హాసినిని హగ్‌ చేసుకుంటుంది. మమ్మీ గాయత్రి పెద్దమ్మకే కాదు పెద్ద మరదలుకు కూడా పునర్జన్మే అంటాడు వల్లభ.

తిలొత్తమ్మ, వల్లభ, సుమన ఆలోచిస్తుంటారు. ఎంత నాటకం ఆడింది ఆ కొత్త అక్క అంటూ తిడుతుంది సుమన. ఆడలేదు సుమన ఆడించారు అని తిలొత్తమ్మ చెప్తుంది. దీంతో ఆ మోసకారి త్రినేత్రి అయితే ఇంట్లోంచి వెళ్లిపోయింది కదా అంటాడు వల్లభ. ఇంట్లో ఉంటున్న ఆ త్రినేత్రి బామ్మకు అత్తమామ్మలకు నిజం ఎలా చెప్పాలో ఆలోచించండి అంటుంది తిలొత్తమ్మ. కానీ ఆ త్రినేత్రిని పట్టుకుని మన నయనికి చెక్‌ పెడితే ఎలా ఉంటుంది అంటుంది. మమ్మీ పోయిపోయి సొంత చెల్లెలు ముందే చెప్తున్నావు అంటాడు వల్లభ. అరేయ్‌ చెల్లి చెల్లే పేకాట పేకాటే అంటుంది తిలొత్తమ్మ. అవును అత్తయ్యా మీ ఐడియా ఏంటో చెప్పండి ఫాలో చేద్దాం అని చెప్తుంది. ఇంతటితో  త్రినయని సీరియల్‌ ఈరోజు ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×