E-Paper
Advertisement

Tollywood: టాలీవుడ్ ఫీమేల్ యాంకర్స్.. ఎవరు ఎక్కువ చదువుకున్నారంటే?

Tollywood: టాలీవుడ్ ఫీమేల్ యాంకర్స్..  ఎవరు ఎక్కువ చదువుకున్నారంటే?
Advertisement

Tollywood:సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులు ఎలా అయితే తెలుసుకోవాలని చూస్తారో.. యాంకర్స్ కి సంబంధించిన విషయాలను కూడా అలాగే తెలుసుకోవాలని పరితపిస్తూ ఉంటారు. ముఖ్యంగా బుల్లితెరపై పలు టీవీ చానల్స్ లో ప్రసారమయ్యే షోలకు మంచి రేటింగ్ రావడానికి ప్రథమ పాత్ర పోషించే ఈ యాంకర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అటు సినిమా ప్రమోషన్స్ లో ఇటు షోలకు మంచి టిఆర్పి రేటింగ్ తీసుకురావడంలో యాంకర్స్ పడే తపన, కష్టం వర్ణనాతీతం. అందుకే యాంకర్స్ ఇటువంటి వాటికి మూల స్తంభంగా నిలుస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ యాంకర్స్ కి అభిమానులు కూడా ఎక్కువే . అందుకే వీరికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు టీవీ ఫీమేల్ యాంకర్స్ విద్యార్హతలు ఏంటి? ఎవరు ఎంత ఎక్కువ చదువుకున్నారు? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సుమ కనకాల..

యాంకర్ అనగానే ముఖ్యంగా వినిపించే పేరు సుమ కనకాల. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరిని మెస్మరైజ్ చేస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న సుమా కనకాల.. టీవీ క్వీన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తన యాంకరింగ్ తో దశాబ్దాల కాలంగా ఆడియన్స్ హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఈమె విద్యార్హత విషయానికి వస్తే.. సికింద్రాబాద్ లోని రైల్వే కాలేజ్ లోఎం కామ్ (M.Com )పూర్తి చేసింది.

ఉదయభాను:

Advertisement

తెలుగులో సుమా కంటే ముందే అడుగు పెట్టి అందంతో, అభినయంతో, చక్కని వాక్చాతుర్యంతో అటు పిల్లలను ఇటు పెద్దలను మెప్పించిన ఏకైక లేడీ యాంకర్ ఉదయభాను. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసింది.

అనసూయ:

ప్రముఖ ఛానల్లో న్యూస్ ప్రజెంటర్ గా తన కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా మారి అటు సినిమాలు, షోలతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ.హైదరాబాదులోని భద్రూఖా కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది.

రష్మీ గౌతమ్:

Advertisement

జబర్దస్త్ లో మరో యాంకర్ గా తన ఉనికిని చాటుకున్న రష్మీ గౌతమ్ ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్ గా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీలో బీకాం (B.Com) పూర్తి చేసింది.

శ్రీముఖి:

ఈ జనరేషన్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న లేడీ యాంకర్ శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రియాలిటీ షో లైనా.. సినిమా ఈవెంట్లైన ఇప్పుడు సినిమాలలో కూడా నటిస్తూ మరింత క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు బీడీఎస్ (డెంటల్) చదువుతున్న సమయంలోనే అదుర్స్ షోలో అవకాశం రావడంతో చదువుకి మధ్యలోనే బ్రేక్ చెప్పేసింది.

లాస్య:

బుల్లితెరపై సంథింగ్ స్పెషల్ షో తో యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన లాస్య.. హైదరాబాదులోని సిబిఐటి కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది.

శ్యామల:

మొదట బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ.. ఆ తర్వాత తెలుగులో స్టార్ యాంకర్ గా దూసుకుపోయిన శ్యామల.. కాకినాడలో బీకాం పూర్తి చేసింది.

also read:సారా అర్జున్ తండ్రి తెలుగు స్టార్ నటుడని మీకు తెలుసా?

మంజూష:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రాఖీ సినిమా ద్వారా నటిగా తన కెరీర్ను ప్రారంభించిన మంజుష ఆ తర్వాత యాంకర్ గా పేరు దక్కించుకుంది. హైదరాబాదులో బీటెక్ చేసింది.

వర్షిణి :

ప్రముఖ యాంకర్ వర్షిణి హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేయగా..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×