E-Paper
Advertisement

Youtuber Vaishnavi: మూడు రోజులైనా సమాధి వీడని వైష్ణవి అన్నయ్యలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వైనం!

Youtuber Vaishnavi: మూడు రోజులైనా సమాధి వీడని వైష్ణవి అన్నయ్యలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వైనం!
Advertisement

Youtuber Vaishnavi:ప్రముఖ యూట్యూబ్ వైష్ణవి హత్య యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించి మరీ వైష్ణవి తల్లిదండ్రులను ఒప్పించి హరిబాబు వైష్ణవిని వివాహం చేసుకున్నాడు. కానీ వివాహం జరిగిన ఎనిమిది నెలలకే ఆమెను అత్యంత దారుణంగా హతమార్చారు. పైగా వైష్ణవి 4 నెలల గర్భవతి కూడా అన్న విషయాన్ని పట్టించుకోకుండా హరిబాబు ఆమె ఆస్తిపై కన్నేసి ఆమెను దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు యూట్యూబర్ వైష్ణవి మరణించి మూడు రోజులు అవుతున్నా ఆమె సమాధి వద్ద కనిపిస్తున్న దృశ్యాలు చూసేవారికి కంటతడి పెట్టిస్తున్నాయి.

సమాధిని వీడని వైష్ణవి అన్నదమ్ములు..

అసలు విషయంలోకి వెళ్తే ..వైష్ణవి వంశంలో 15 మంది అబ్బాయిలు కాగా. వైష్ణవి మాత్రమే అమ్మాయి. తమ గారాల చెల్లిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆ అన్నయ్యలు. జీవితాంతం తమతో ఉంటుందనుకున్న తమ చెల్లికి మృత్యువు తన భర్త హరిబాబు రూపంలో వస్తుందని పాపం ఆ అన్నయ్యలు గుర్తించలేదు. ఇకపై తమ గారాలపట్టి తమతో ఆడుకోదని , తాము తమ చెల్లిని ఆట పట్టించలేమని, ఇకపై తమ చెల్లితో కలిసి తిరగలేమని, తినలేమని తెలిసిన ఆ అన్నయ్యలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైష్ణవి సమాధి వద్ద ఉంటూ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నారు. జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మరణం ఆ కుటుంబంలోనే కాదు ఆ వంశంలోనూ తీరని శోఖాన్ని నింపింది. ఆమె చనిపోయి మూడు రోజులు అవుతున్నా ఆమె అన్నదమ్ములు ఆమె సమాధిని వదిలి వెళ్లడం లేదు. సమాధిని పూలతో అలంకరించి, ఆమెకు ఇష్టమైన టిఫిన్, పండ్లను అక్కడ ఉంచి “తినమ్మా.. లే” అంటూ పిలుస్తుంటే గ్రామస్తులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెలి మరణాన్ని జీర్ణించుకోలేక వారు పడుతున్న ఆవేదన అందరినీ కలిచి వేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement

ALSO READ:Anupam Kher: యువతకు అనుపమ్ ఖేర్ వార్నింగ్.. ఇప్పటికైనా మార్పు వస్తుందా?

వైష్ణవి హత్య కేసులో మరో ముగ్గురు నిందితులు..

మరోవైపు వైష్ణవి హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో అదనపు కట్నం కోసమే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు తేల్చారు. వైష్ణవి ని సొంత ఇంట్లోనే హతమార్చి ఆ వెంటనే హరిబాబు పరారయ్యారు. ఉదయం విగత జీవిగా పడి ఉన్న వైష్ణవిని చూసి కుటుంబ సభ్యులు , పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరిబాబును అరెస్టు చేశారు. విచారణ అనంతరం బుధవారం రిమాండ్ కు తరలించగా.. వైష్ణవి హత్యకు పరోక్షంగా హంతకుడు తల్లి లక్ష్మీ తో పాటు ఆయన సోదరులు ఇద్దరు కూడా కారణమన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వీరు ముగ్గురు పరారీలో ఉన్నట్లు సమాచారం . ఏది ఏమైనా వైష్ణవినీ కట్నం కోసం వీరంతా దారుణంగా హింసించి హతమార్చడం సగటు మనిషి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్, యూట్యూబర్స్, ఆమె ఫాలోవర్స్ కోరుకుంటున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×