E-Paper
Advertisement

Ashmitha : అస్మిత సీరియల్స్ నుంచి తప్పుకోవడానికి కారణం ఇదే.. ఇన్నాళ్లకు బయటపెట్టిన నిజాలు..

Ashmitha : అస్మిత సీరియల్స్ నుంచి తప్పుకోవడానికి కారణం ఇదే.. ఇన్నాళ్లకు బయటపెట్టిన నిజాలు..
Advertisement

Actress Ashmitha : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సీరియల్ నటి అస్మిత.. తెలుగులో ప్రసారమైన పద్మవ్యూహం వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. సీరియల్స్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ రోజుల్లో ఆమె నటనకు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. ఒకటిన్నర దశాబ్దాల పాటు అనేక సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి అస్మిత కర్నాని, తన సుదీర్ఘ ప్రయాణాన్ని విడిచి ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను పలకరిస్తూ వస్తుంది. అయితే ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ మించిన ఫాలోయింగ్ ఉన్న నటి.. అలాంటి ఈమె ఎందుకు సడన్గా సీరియల్స్ ని మానేసింది.? ఏదైనా బలమైన కారణాలు ఉన్నాయా? లేదా ఇంకేదైనా సమస్యలు ఎదురయ్యాయా? అన్న విషయాల గురించి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. ఇంతకీ ఆమె చెప్పిన నిజాలు ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

సీరియల్స్ నుంచి అందుకే తప్పుకున్నా..?

సీరియల్ నటి అష్మిత అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. టీనేజ్ లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె దాదాపు 30 సీరియల్స్ లలో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సీరియల్స్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు..సీరియల్ పరిశ్రమలో మారిన పనితీరు ఆమెను నిరాశపరిచిందని అస్మిత తెలిపారు. ప్రారంభంలో, ప్రతిరోజు ఒక కొత్త నేర్చుకునే అవకాశంగా, ఎప్పటికప్పుడు కొత్త ఉత్సహం నిండేది అని ఆమె అన్నారు. ఎపిసోడ్‌లను పూర్తి చేయాలనే లక్ష్యం ఉండటంతో, నటనకు, సృజనాత్మకతకు తక్కువ అవకాశం లభించిందని ఆమె అభిప్రాయపడ్డారు.. కొన్నిసార్లు అవి సరిగ్గా చేసిన సీన్లను కూడా డైరెక్టర్లు ఓకే ఓకే అని అనడంతో అక్కడ తనకి ఇబ్బందిగా అనిపించింది అని అశ్మిత అన్నారు.. మనస్ఫూర్తిగా పనిచేయడం కన్నా ఆర్టిఫిషియల్ గా పనిచేయడం ఎక్కువైంది అందుకే సీరియల్స్ నుంచే తప్పుకున్నానని ఆమె ఒక్కమాటలో చెప్పేసారు. ఆ తర్వాత నుంచి పెద్దగా సీరియల్స్లలో కనిపించలేదు కానీ సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో తనకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు..

Advertisement

Also Read :ఇష్టం లేకుండానే ఇండస్ట్రీలోకి.. డాక్టర్ బాబు ఏం చదివాడో తెలుసా..?

అస్మిత కెరీర్ ఎలా మొదలైంది..? 

1980 సెప్టెంబర్ 29న రాజస్థాన్‌లో జన్మించిన అస్మిత… డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పద్మావ్యూహం అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సీరియల్ లోని ఆమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సీరియల్ నటించడం నాకు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ దాదాపు 30 సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఇకపోతే సీరియల్స్‌తో పాటు మురారి, అపుడప్పుడు, మధుమాసం, అతిథి, కలెక్టర్ గారి భార్య వంటి సినిమాల్లోనూ నటించి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈమె సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ని స్టార్ట్ చేసి తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటూ వస్తుంది.. ఇకముందు మీకు సీరియల్స్ చేస్తుందో లేదో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×