E-Paper
Advertisement

Actress Vandana : నటి వందన ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదేనా..?

Actress Vandana : నటి వందన ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదేనా..?
Advertisement

Actress Vandana : బుల్లితెరపై ఒకప్పుడు సీరియల్స్లలో నటించే బిజీగా ఉన్న ముద్దుగుమ్మలు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.. అయితే గతంలో జరిగిన కొన్ని పరిస్థితుల కారణంగా వాళ్ళు ఇండస్ట్రీకి దూరమైనట్లు ఇటీవల యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో బయటపెడుతున్నారు. ఎంతోమంది ఇండస్ట్రీకి దూరమవడానికి కారణం క్యాస్టింగ్ కౌచ్ అని నిర్మూహమాటంగా బయటపెట్టారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఇండస్ట్రీకి దూరమైన సీరియల్ హీరోయిన్లలో వందన ఒకరు. ఒకప్పుడు వరుసగా సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ సడన్గా ఇండస్ట్రీకి దూరమై అందరికి షాక్ ఇచ్చింది. అసలు ఎందుకు ఆమె ఇండస్ట్రీకి దూరమైంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఒకప్పుడు బిజీగా ఉన్న ఈమె ఇండస్ట్రీకి దూరం అవడానికి రెండు కారణాలని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇంతకీ ఈమె ఎందుకు దూరమైంది? ఆ కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..

వందన ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదేనా..?

తెలుగు బుల్లితెరపై భార్యామణి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది సీరియల్ నటి వందన.. ఈమె అప్పట్లో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. ఒకవైపు రెమ్యూనరేషన్ తక్కువే అయినా కూడా వరుసగా సీరియల్స్ చేస్తూనే ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ఎక్కువగా విలన్ పాత్రలు కనిపించిన ఈమె ఆ తర్వాత కొన్ని రోజులకు సీరియల్స్ కి దూరమైంది. గతంలో ఆమె ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్ లో ఆమె మాట్లాడుతూ తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా సీరియల్స్ ద్వారా ప్రేక్షకులు ఆమెను ఎంతగా ఆదరించారో అన్న విషయాన్ని చెప్పి ఎమోషనల్ అయింది. సీరియల్స్ చేస్తున్న సమయంలో నా గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అవన్నీ కేవలం రూమర్సే అయినా కూడా కొంతమంది నా గురించి తప్పుగా మాట్లాడుకోవడం విని నేను సహించలేకపోయాను అని ఆమె అన్నారు. ఆ వార్తలని పెద్దగా పట్టించుకోలేదు కానీ నా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ సీరియల్స్ చేయడం నాకు నచ్చలేదు అందుకే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసాను అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్న వందన పూర్తిగా సీరియల్స్ కి దూరమైంది. ఇక ఫ్యూచర్లో అయినా సీరియల్స్లలో నటిస్తుందేమో చూడాలి.

వందన నటించిన సీరియల్స్..

Advertisement

సీరియల్ నటి వందన రియల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జన్మించింది. అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. బి ఫార్మసీ వారికి చదివిన ఈమె నటనపై ఇంట్రెస్ట్ ఉండడంతో సీరియల్స్ ఆడిషన్స్ కి వెళ్లి అక్కడ సెలెక్ట్ అయింది. అలా ఆమె మొదటి సీరియల్ భార్యామణి. గతంలో ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్ ఎన్నో ఎపిసోడ్లను పూర్తిచేసుకుని ప్రేక్షకులను మెప్పించింది. ఆ సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆ తర్వాత వందనకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. భార్యామణి సీరియల్ తర్వాత అభిషేకం, స్వాతి చినుకులు వంటి సూపర్ హిట్ సీరియల్స్లో నటించి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. యాంకర్ గా కెరియర్ ని మొదలుపెట్టిన ఈమె నటిగా మారి పలు సీరియల్స్ లో నటించి ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న వందన తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది..

Also Read :Illu illaalu Pillalu Srivalli : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ నుంచి శ్రీవల్లి అవుట్.. సడెన్గా ఇదేం ట్విస్ట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×