E-Paper
Advertisement

Serial Actress : సీరియల్స్ లలో నటిస్తున్న హీరోయిన్ల రియల్ ఏజ్.. అందరికంటే చిన్నది ఆమెనే..?

Serial Actress : సీరియల్స్ లలో నటిస్తున్న హీరోయిన్ల రియల్ ఏజ్.. అందరికంటే చిన్నది ఆమెనే..?
Advertisement

Serial Actress : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఎంతోమంది వేరే రాష్ట్రాల ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలు తెలుగు సీరియల్స్ హీరోయిన్లుగా నటిస్తూ బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈమధ్య ఎక్కువగా కన్నడ, తమిళ్ హీరోయిన్లు ఇక్కడ ఎంట్రీ ఇస్తూ వరుసగా సీరియల్ చేస్తూ బిజీగా ఉన్నారు.. వాళ్ల నటనకి తెలుగు ఆడియన్స్ ఫీదా అవుతున్నారు. కొంతమంది వాళ్ళ పేర్లు గురించి బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. ఇప్పుడు మనం కొంతమంది బుల్లితెర హీరోయిన్ల అసలు పేర్లు? వాళ్ల వయసు ఎంత అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

బుల్లితెర హీరోయిన్ల రియల్ ఏజ్.. 

కీర్తి భట్..

కార్తీకదీపం సీరియల్ ఫేమ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయినే.. 2017లో ఐస్ మహల్‌తో తొలిసారిగా నటించింది. స్టార్ మాలో అక్టోబరు 2019 నుండి జూన్ 2022 వరకు ప్రసారమైన మనసిచ్చి చూడు సీరియల్ లో నటించింది. బుల్లితెరపై వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె వయసు 24 సంవత్సరాలు..

రక్ష గౌడ..

Advertisement

స్టార్ మా లో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసులో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ వసుధర అలియాస్ రక్ష గౌడ. ఈమె కూడా కన్నడ నటి.. తెలుగులో ఈ సీరియల్ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఈమె వయసు 27 సంవత్సరాలు.

దెబ్జాని మోదక్..

ఈమె కూడా ఒక కన్నడ నటినే.. అక్కడ ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈమె ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సీరియల్లో వేదగా నటించి మంచి మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత సత్యభామ సీరియల్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఈమె వయసు 27 సంవత్సరాలు..

దీపిక రంగరాజు.. 

Advertisement

దీపిక రంగరాజు ఒక తమిళ నటి.. తమిళంలో ఎన్నో సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తుంది. ఒకవైపు సీరియల్ మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలోను, షోలలో కనిపిస్తూ ఉంటుంది. ఈమె వయసు కూడా 27 సంవత్సరాలు..

సుహాసిని.. 

తెలుగు హీరోయిన్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె వయసు 34 సంవత్సరాలు. ఇప్పటికీ హీరోయిన్ అంటే కచ్చితంగా ఎవరు పొరపాటు పడరు. అంత స్లిమ్ గా అందంగా తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తుంది.

Also Read : ‘నువ్వు లేక నేను లేను ‘ రాధ క్యూట్ లవ్ స్టోరీ.. ఫ్యాన్స్ హర్ట్..!

వీళ్లే కాదు ఇంకా చాలామంది ముద్దుగుమ్మలు తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో నటిస్తున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×