E-Paper
Advertisement

TGIK Show Host: కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంతంటే?

TGIK Show Host: కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంతంటే?
Advertisement

TGIK Show Host: గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్న ఏకైక హిందీ షో “ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో”. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగవ సీజన్ కూడా ప్రారంభం అయింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ వేదికగా మొదటి ఎపిసోడ్ ప్రసారం అయింది. ఇకపోతే ఈ కొత్త సీజన్ లో అందరినీ ఆకట్టుకునే అంశం ఏమిటంటే హోస్ట్ నవజ్యోత్ సింగ్ సిద్దు తిరిగి కొనసాగడమే.. అర్చనా పురాన్ సింగ్ తో కలసి సిద్దు తిరిగి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించబోతున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు కోల్పోయిన వినోదాన్ని ఆయన తిరిగి తీసుకువచ్చారని చెప్పవచ్చు.

భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన హోస్ట్..

దాదాపు ఐదు సంవత్సరాల పాటు విరామం తీసుకున్న తర్వాత.. సీజన్ 3లో కపిల్ షోలో తిరిగి సిద్దు కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు సీజన్ 4 లో కూడా ఆయన కొనసాగుతుండడంతో షోతో ఆయనకున్న అనుబంధం ఎలాంటిదో తెలుస్తోంది. ఇకపోతే జూన్ లో నెట్ ఫ్లిక్స్ లో సీజన్ 3 ప్రీమియర్ అయినప్పుడు.. సిద్దు నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫారమ్ లోకి తిరిగి రావడంతో ఈయనకు భారీగానే రెమ్యూనరేషన్ లభించినట్లు తెలుస్తోంది.. అలా సీజన్ 3లో ఒక్కో ఎపిసోడ్ కి రూ.30 లక్షల నుండి రూ.40 లక్షల వరకు రెమ్యూనరేషన్ వసూలు చేశారు. మొత్తం 14 ఎపిసోడ్లు ఉండగా.. అందులో 11 ఎపిసోడ్లలో కనిపించారు. అయితే ఈ సీజన్ లో 2,3 అలాగే 13వ ఎపిసోడ్లను ఆయన మిస్ అయ్యారు.

ఆశ్చర్యపరుస్తున్న కపిల్ షో హోస్ట్ రెమ్యూనరేషన్..

Advertisement

అయితే ఇప్పుడు ఈ సీజన్ కి ఊహించని రెమ్యూనరేషన్ ను ఆయన పొందుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ 4 మొత్తానికి దాదాపు రూ.3.3 కోట్ల నుండి రూ.4.4 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే నాలుగవ సీజన్ డిసెంబర్ 20 2025న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అయింది.. ఈ సీజన్ లో సరికొత్త ఫార్మాట్లు కూడా చేర్చారు.. ఇందులో కపిల్ శర్మ రాజా అనే కొత్త పాత్రతో పరిచయం అయ్యారు.

ALSO READ:Stranger Things: వినోదంతో పాటు ఆదాయం, ఉద్యోగాలు కూడా.. ఎలాగో తెలిస్తే షాక్!

మిగతా వారికి కూడా భారీ రెమ్యూనరేషన్..

Advertisement

ఇకపోతే ఈ కపిల్ షోలో సిద్దుతోపాటు కామెడీని పంచడానికి సిద్ధమైన అర్చన పురన్ సింగ్ కూడా గత సీజన్ 3 కి ఒక్కో ఎపిసోడ్ కి సుమారుగా రూ.10 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఈమె.. ఈసారి ఏకంగా 12 లక్షల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం.. ముఖ్యంగా గత సీజన్ లో తన కామెడీ, సరదా సంభాషణలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే సీజన్ 3లో సందడి చేసిన కృష్ణ అభిషేక్, సునీల్ గ్రోవర్, కికు శారద, రాజీవ్ ఠాకూర్ వీరంతా కూడా తిరిగి ఇందులో పాల్గొనబోతున్నట్లు సమాచారం. వీరందరికీ కూడా భారీగానే రెమ్యూనరేషన్ అందుతున్నట్లు తెలుస్తోంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×