E-Paper
Advertisement

Illu Illaalu Pillalu : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ కు శుభం కార్డు.. ఫైనల్ ట్విస్ట్ ఇదే..

Illu Illaalu Pillalu : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ కు శుభం కార్డు.. ఫైనల్ ట్విస్ట్ ఇదే..
Advertisement

Illu Illaalu Pillalu : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న పలు సీరియల్స్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటివరకు ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా తెలుగు ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఆ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా ఒకటి. ఒక తండ్రి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటాడు అన్న స్టోరీ తో ఈ సీరియల్ ప్రసారమైంది. అనాధగా పెరిగిన తండ్రి తన పిల్లలకు ఎలాంటి భవిష్యత్తును ఇవ్వాలని అనుకుంటున్నాడో అన్నది ఈ సీరియల్ యొక్క స్టోరీ. ప్రస్తుతం ఈ సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఈ మధ్య జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే మరి కొద్ది రోజుల్లో ఈ సీరియల్కు శుభం కార్డు పడబోతుందని వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అంతేకాదు ఫైనల్ గా జరగబోయే ట్విస్ట్ ఇదే అంటూ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అసలు సీరియల్ ఎండింగ్ వచ్చిన తర్వాత స్టోరీ ఎలా ఉండబోతుందో ఒకసారి మనం చూసేద్దాం..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ స్టోరీ..

ఎవరూ లేని ఒంటరి జీవిగా పరిచయమైన రామరాజు లేచిపోయి పెళ్లి చేసుకొని తనకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు.. ఆయనకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు. వాళ్లే తన ప్రపంచం గా బతుకుతూ ఉంటాడు. అందులో ఇద్దరు కొడుకులు తండ్రి బాటలోనే నడుస్తారు. తమకి ఇష్టమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తారు. రామరాజు ఆ జంటలని ఆహ్వానించి ఇంట్లోకి రానిస్తాడు. ఆయన ఏరి కోరి తెచ్చుకున్న కోడలు ఆధిపత్యం కోసం అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆఖరికి ఆ ఇంటి ఆడపిల్లని శత్రువులను అబ్బాయితో పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్న ఆ ఇంట్లోనే మరో ఇద్దరు కోడలు ఆమెకు చుక్కలు చూపిస్తారు. అయితే ఫైనల్ గా స్టోరీ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. రామరాజు చిన్న కూతురు శత్రువుల ఇంటికి కోడలుగా వెళుతుంది. అయితే పెళ్లి చేసుకోకుండా కేవలం నాటకం ఆడి మరి తన ఇంటి పరువు ని కాపాడాలని అనుకుంటుంది.. ఆ విషయాన్ని రామరాజుకి తెలియజేసేలా ఇద్దరు కోడలు ప్రయత్నాలు చేస్తారు. అలా రోగరాజు తన కూతుర్ని మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడు. ప్రేమ తన అన్న విశ్వక్ మనసుని పూర్తిగా మార్చేస్తుంది. దాంతో అతను తన భార్య అమూల్య కోసం పుట్టింటికి ఇల్లరీకానికి వచ్చేస్తాడు. ఇక ప్రేమ అనుకునట్లుగా పోలీస్ ఆఫీసర్ అవుతుంది. ఆ విషయం తెలుసుకున్న రామరాజు తన చిన్న కోడలు కొడుకుతో మాట్లాడటం మానేస్తాడు. కానీ ఆయనను పెద్ద సమస్య నుంచి ప్రేమ కాపాడుతుంది. ఇక సాగర్ కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ తన తండ్రి పరువుని నిలబెట్టాలని అనుకుంటాడు. మొత్తానికి రామరాజు ఉమ్మడి కుటుంబం విడిపోయి మళ్లీ ఒకే చోటకి చేరుతుందని ఫైనల్ స్టోరీ చెబుతుంది… ఈ స్టోరీ గనుక నిజమైతే మాత్రం ఈ సీరియల్ రేటింగు మామూలుగా ఉండదు. ఇకముందు ఎపిసోడ్ లలో ఇదే విధంగా జరుగుతుందో లేదో చూడాలి..

Advertisement

Also Read : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ మీనా ఆస్తుల విలువ ఎంతంటే..?

ప్రస్తుతం ఎపిసోడ్ విషయానికొస్తే.. 

ప్రస్తుతం ఈ సీరియల్ అమూల్య పెళ్లితో గొడవలు తగ్గినట్లు కనిపిస్తున్నాయి.. అమూల్య మాత్రం విశ్వక్ తనని ప్రేమించానని నమ్మించి మోసం చేశాడని తనపై రివేంజ్ తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. ప్రేమ ఎస్సై జాబ్ కోసం ఎగ్జామ్ రాయడానికి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పెళ్లెందుకు ధీరజ్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు.. 20 లక్షలు కట్టి సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటాడు. ఆ విషయాన్ని ఇంట్లో చెప్తాడా? వనజకి ఇవ్వాల్సిన 20 లక్షల మ్యాటరు ఎలాంటి గొడవలకు దారితీస్తుందో అన్నది రానున్న రోజుల్లో జరగనుంది. ఇవాళ ఎపిసోడ్ మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తుంది…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×