// // Podarillu Vicky : 'పొదరిల్లు' లో మహా బాస్ విక్కీ బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు -->
E-Paper
Advertisement

Podarillu Vicky : ‘పొదరిల్లు’ లో మహా బాస్ విక్కీ బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Podarillu Vicky : ‘పొదరిల్లు’ లో మహా బాస్ విక్కీ బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Podarillu Vicky : తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ఒకటి.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కేవలం కొద్ది నెలలోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. నలుగురు మగాళ్ళ మధ్యలో ఒక ఆడపిల్ల ఎలాంటి జీవితాన్ని గడుపుతుంది అన్న స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ సీరియల్స్ తో పోటీపడి మంచి రేటింగ్ను సొంత చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్లో కొత్త క్యారక్టర్లు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ మహాలక్ష్మి బాస్ విక్కీ పాత్రలో మరో కొత్త నటుడు ఈ సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను చూడడానికి చక్రి లాగే ఉండడంతో మరో హీరో వచ్చేసాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విక్కీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఒక్క రోజుకి ఈయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఏంటో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

‘పొదరిల్లు’ విక్కీ బ్యాగ్రౌండ్..?

స్టార్ మా ఛానల్ ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రేక్షకులకు అందిస్తూ జనాల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సీరియల్స్ కి రారాజు స్టార్ మా.. ఇందులో కొత్త సీరియల్స్ కి కొదవలేదు. అయితే గత ఏడాది డిసెంబర్ 22న ప్రారంభమైన పొదరిల్లు సీరియల్ ఇప్పుడు అనేక ట్విస్టులతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇటీవల కాలంలో ఈ సీరియల్ లో చాలా మంది కొత్త క్యారక్టర్లు ఎంట్రీ ఇచ్చారు. కేశవ కు జోడిగా స్టైలిష్ శైలజ పాత్ర ఎంటర్ అయింది. రీసెంట్ గా మహాలక్ష్మికి ఉద్యోగం వచ్చిన విషయం తెలిసిందే. అయితే మహాలక్ష్మి బాస్ విక్కీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. విక్కీ అసలు పేరు సాయికిరణ్.. ఈయన గతంలో అనేక తెలుగు సీరియల్స్ లలో నటించాడు.. అయితే సాయికిరణ్ ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్లలో నటించాడో అన్నిట్లోనూ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. అమ్మాయి గారు, నువ్వు లేక నేను లేను వంటి సూపర్ హిట్ సీరియల్స్లలో ఇతను నటించారు. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ లో విక్కీ పాత్రలో నటిస్తున్నారు.

విక్కీకి ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Advertisement

పొదిరిల్లు సీరియల్ లో మహాలక్ష్మి రీసెంట్గా వెళ్లిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయింది. తనకు ఉద్యోగం వచ్చిందన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరితో చెప్పి సంతోషాన్ని పంచుకుంటుంది. అయితే మహాలక్ష్మిని ఇంటర్వ్యూ చేసిన బాస్ పేరు విక్కీ. ఇతను మహాలక్ష్మిని చూసిన వెంటనే ఇంత అందమైన అమ్మాయిని చూడ్డం కొత్తగా ఉంది అని మహాలక్ష్మితో పులిహార కలిపే ప్రయత్నం చేస్తాడు. కానీ మహాలక్ష్మి మాత్రం మీరు నా అందం గురించి కామెంట్ చేయడం ఆపేయండి అంటూ రివర్స్ పంచులు వేస్తుంది. తీరా ఎండి చాంబర్ లోకి వెళ్ళగానే తాను ఎవరినైతే తిట్టిందో అతని తన బాస్ అని తెలుసుకొని కాస్త భయపడుతుంది.. కానీ అతను మాత్రం మహాలక్ష్మిని అసలు ఇంటర్వ్యూ కూడా చేయకుండానే యువర్ సెలెక్టెడ్ అని అంటాడు. అంతే ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకునేందుకు జనాలు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. మహాలక్ష్మి బాస్ విక్కీ గతంలో అనేక తెలుగు సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో నటుడిగా ముద్ర వేసుకున్నారు. ఇకపోతే ఈ సీరియల్ లో నటించిన విక్కీ అలియాస్ సాయి కిరణ్ ఒక్క రోజుకు గాను దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక సీరియల్ నెలలో 25 రోజులు షూటింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ లెక్కన చూస్తే ఈయన దాదాపు నెలకు లక్షల్లోనే పారితోషకం తీసుకుంటున్నారు. ఇకపోతే సాయికిరణ్ ఈ సీరియల్ తో పాటుగా మరో రెండు సీరియల్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×