E-Paper
Advertisement

Telugu TV Serials:  ఈ వారం దారుణం.. సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ పడిపోయింది.. ఆ రెండు అవుట్..

Telugu TV Serials:  ఈ వారం దారుణం.. సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ పడిపోయింది.. ఆ రెండు అవుట్..
Advertisement

Telugu TV Serials : బుల్లితెర అభిమానులకు ఎక్కువ వినోదాన్ని పంచుతున్న వాటిలో సీరియల్స్ ఎప్పుడు టాప్ లోనే ఉంటాయి.. ఈమధ్య టీవీ చానల్స్ కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ ఆడియన్స్ ని ఆలోచించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.. నువ్వా నేను అంటూ పోటీపడి మరి ఎన్నో సీరియల్స్ ఇప్పుడు జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాయి.. ఒకప్పుడు సీరియల్స్ లో కేవలం సెంటిమెంట్ డైలాగులు మాత్రమే ఉండేవి. కానీ ఈ మధ్య వస్తున్న సీరియల్ అన్నిట్లో కూడా కామెడీ, రివెంజ్ డ్రామా తో స్టోరీలు ఉంటున్నాయి. అందుకే సినిమాలకన్న ఎక్కువగా సీరియల్స్ ను చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి తెలుగు ఛానల్ లో ప్రతిరోజు బోలెడు సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ మాలో బోలెడు ప్రసారం అవుతున్నాయి. మరి వాటిలో ఈ మధ్య స్టోరీలో వీక్ అవ్వడంతో టీఆర్పీ రేటింగ్ కూడా పడిపోయింది. మరి ఈ వారం ఏ సీరియల్ రేటింగ్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..

స్టార్ మా టాప్ రేటింగ్ సీరియల్స్..

తెలుగులో టాప్ ఛానల్ లలో స్టార్ మా ఒకటి.. ఇందులో కేవలం సినిమాలు మాత్రమే కాదు సీరియల్స్ కూడా ఎక్కువగా ప్రసారమవుతున్నాయి.. అప్పుడు కేవలం చిన్న చిన్న సీరియల్స్ మాత్రమే జనాలను అలరించేది.. ఈమధ్య మంచి స్టోరీలతో కొత్త కొత్త సీరియల్స్ కూడా ప్రసారమవుతున్నాయి.. ఇందులో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో కార్తీకదీపం 2 మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది. ప్రస్తుతం స్టార్ మాలో వస్తున్న  సీరియల్స్లలో ఈ రెండు మంచి రేటింగ్ లో కొనసాగుతున్నాయి. గుండె నిండా గుడి గంటలు, ఇంటింటి రామాయణం సీరియల్స్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. టాప్ టిఆర్పి రేటింగ్ కార్తీకదీపం 2 ఉంది. 13.25 రేటింగ్ నమోదు చేసుకుంది.. ఈ సీరియల్స్ అన్ని కూడా డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాయి. కొత్త సీరియల్స్ ను స్టార్ మా ప్రసారం చేస్తుంది. కొత్త సీరియల్స్ ప్రసారం అవుతున్నా కూడా పాత సీరియల్స్ కు మంచి రేటింగ్ రావడం విశేషం.. ఇక మిగిలిన సీరియల్స్ రేటింగ్ విషయానికొస్తే.. చిన్ని 9. 48 రేటింగ్ ను నమోదు చేసుకుంది. నిండు నూరేళ్ల మనసు 9 ఉండగా, మిగిలిన సీరియల్స్ తర్వాత స్థానంలో ఉన్నాయి.. కొత్త సీరియల్స్ పొదరిల్లు, నువ్వు లేక నేను లేను సీరియల్స్ 8 రేటింగ్ తో దూసుకుపోతుంది.. కొత్త సీరియల్స్ కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది.

Advertisement

Also Read : ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 13 సినిమాలు..

శుభం కార్డు పడుతున్న హిట్ సీరియల్స్…

నిన్న మొన్నటి వరకు టాప్ స్టోరీ తో కొనసాగుతున్న సీరియల్స్ అన్నీ కూడా ఈ మధ్య కాస్త వీక్ గా నడుస్తున్నాయి.. కొత్త సీరియల్స్ రోజుకు ఒకటి రావడంతో పాత సీరియల్స్ కి డిమాండ్ పెరగడంతో పాటుగా స్టోరీని కూడా తొందరగా ఫినిష్ చేసే ఉద్దేశంలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టాప్ లో కొనసాగుతుంది. ఇంటింటి రామాయణం, గుండెనిండా గుడిగంటలు సీరియల్ దాదాపు అయిపోయినట్లు ప్రస్తుతం నడుస్తున్న స్టోరీని చూస్తే అర్థమవుతుంది.. రోహిణి గురించి అసలు నిజం బయటపడితే ఈ సీరియల్ అయిపోతుందని సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రోహిణి గురించి దాదాపు అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి.

Advertisement

ఒకవేళ రోహిణి ఫ్రాడ్ అని తెలిస్తే బాలు చేసే యుద్ధం అంతా ఇంతా కాదు. ఇప్పుడు దినేష్ కూడా రోహిణి గురించి నిజం చెప్తానని కూర్చున్నాడు. దాంతో ఈ సీరియల్ శుభం కార్డు వేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఈ సీరియల్ కి సీక్వెల్ గా మరో సీరియల్ కూడా రాబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా శుభం కార్డు వేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పల్లవి గురించి దాదాపు బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఈ సీరియల్స్ శుభం కార్డు పడే అవకాశం కూడా ఉందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ సీరియల్స్ త్వరలోనే ఎందుకు శుభం వేసుకుంటాయా లేదా స్టోరీలలో మరికొన్ని ట్విస్ట్ లతో ఈ సీరియల్స్ ఇంకాస్త ముందుకు వెళ్తాయి అన్నది చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×