E-Paper
Advertisement

Telugu TV Serials : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ ఒక్క సీరియల్ కు శుభం కార్డు..?

Telugu TV Serials : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ ఒక్క సీరియల్ కు శుభం కార్డు..?
Advertisement

Telugu TV Serials : ఒకప్పుడు సినిమాలను ఎక్కువగా చూసేవారు.. అందుకే థియేటర్లు ఫుల్ అయ్యేవి. కానీ ఈ మధ్య జనాలు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో సీరియల్స్ కి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఇక ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా సీరియల్స్ కూడా రావడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. తెలుగు చానల్స్ సీరియల్స్ డిఫరెంట్ స్టోరీలతో వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ మా చానల్లో సీరియల్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని ట్విస్ట్ లతో ఫ్యామిలీ స్టోరీలతో వస్తుంటాయి.. స్టార్ మా లో ప్రసారమవుతున్న కొన్ని సీరియల్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. అందులో ఈమధ్య ఎక్కువగా కార్తీకదీపం 2 సీరియల్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో పాటుగా మరికొన్ని సీరియల్స్ కూడా జనాల్ని బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. గత వారం టీఆర్పీ రేటింగ్ విషయానికొస్తే ఏ సీరియల్ కు ఎలా ఉంది..? ఏ సీరియల్ కు శుభం కార్డు పడుతుందో ఒకసారి తెలుసుకుందాం..

ఇంటింటి రామాయణం…

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం ఒకటి.. తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకొని వచ్చినా నువ్వు కోడలు ఆ ఇంటి నాశనాన్ని కోరుకుంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్ స్టోరీ అలా ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్లపై పూర్తిగా పగ పెంచేసుకొని నా జీవితాన్ని నాశనం చేశారు అంటూ కుటుంబాన్ని రోజురోజుకీ నాశనమయ్యేలా చేస్తుంది. అందరితో మంచి దానిలాగా నటిస్తూ కుటుంబం ఏమైపోతే నాకేంటి అనుకుంటూ తన స్వార్థాన్ని చూసుకునే ఒక కోడలు ఆ ఇంటి పరిస్థితిని ఎలా మారుస్తుంది అన్నది ఈ సీరియల్ లో చూపిస్తారు. అదే విధంగా తన ఎత్తుగడలను ఆ ఇంటి పెద్ద కోడలైన అవని తిప్పికొడుతూ ఉంటుంది. పల్లవి మాత్రం ఆస్తులు పోయినా సరే ఆ ఇంటిని ఇంకా ఇబ్బంది పెట్టాలని కంకణం కట్టుకుంటుంది. చివరకు ఆమె అనుకున్నది సాధిస్తుంది. కానీ ఈ మధ్య ఆ చిన్న కోడలు చేసే ప్రతి ప్లాను ఫెయిల్ అవుతూ రావడంతో ఆమె మెడకే చుట్టుకుంటున్నాయి. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ గతవారం చాలా దారుణంగా పడిపోయింది అని తెలుస్తుంది.. ఎందుకంటే గతవారం స్టోరీలో ఎక్కడ ట్విస్టులు లేవు. కేవలం ఆస్తి కోసం గొడవలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు తన సొంత ఊరిలో ఉన్న ఆస్తుల కోసం వెళ్తారు. అక్కడ ఓ వ్యక్తి చేతిలో ఆ ఆస్తులు ఉన్నాయని తెలుసుకొని షాక్ అవుతారు. అయితే ఆస్తులు మీరు రాబట్టుకోవడం కోసం ఏం చేస్తారు? ఆస్తులు వచ్చిన తర్వాత అందరూ ఆస్తులను పంచుకుంటారు.. అక్కడితో సీరియల్ ఎండ్ అవుతుంది అని జనాల్లో ఒక ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే ఈ సీరియల్ మరికొద్ది రోజుల్లోనే శుభం కార్డు వేసుకోబోతుంది. మరి దీంట్లో ఇంకా ఏదైనా ట్విస్టులు ఉంటాయా? కొన్ని క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయా అన్నది చూడాలి..దీని టీఆర్పీ రేటింగ్ విషయానికొస్తే.. 11. 02 గా ఉంది.

Advertisement

Also Read : సోమవారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. వీటిని మిస్ అవ్వకండి…

గుండెనిండా గుడిగంటలు.. 

స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న మరో సక్సెస్ఫుల్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు.. మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలతో కలిసి ఉన్నావో కుటుంబంలో మనుషుల మధ్య డబ్బు వస్తే ఎలా మారతారు అన్నది ఈ సీరియల్ లో చూడొచ్చు. ఇందులో ప్రభావతి డబ్బు ఆశతో తన ఇద్దరి కోడలు మాత్రమే గ్రేట్ అంటూ చెప్పుకుంటూ ఉంటుంది. కానీ మూడో కోడలుగా అడుగుపెట్టిన పూలమ్మ కొన్ని అమ్మాయి మీనా మాత్రం అత్త బాగుండాలి అని కోరుకుంటుంది. ఎంత తక్కువ చేసి మాట్లాడిన తన అత్త గ్రేట్ అంటూ చెప్పుకుంటుంది. ఇక ఈ సీరియల్ గతవారం పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని తెలుస్తుంది. అందుకు కారణం సీరియల్ స్టోరీ కాదు కొత్త సీరియల్ రావడమే. పొదిరిల్లు సీరియల్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతుంది. దీంతోపాటుగా నువ్వు లేక నేను లేను సీరియల్ కూడా ప్రసారమవుతుంది. ఈ రెండు కొత్త సీరియల్స్ వల్ల గుండె నిండా గుడి గంటలు రేటింగు అమాంతం పడిపోయింది అని తెలుస్తుంది. స్టోరీ బాగున్న సరే జనాలు కొత్త వాటిని చూసేందుకు ఆసక్తి కనబరచడంతో దీనికి కాస్త రేటింగ్ తగ్గింది. ప్రస్తుతం ఈ సీరియల్ రేటింగ్ విషయానికొస్తే.. 11.45 ఉందని టాక్. ఇప్పుడు స్టోరీ కూడా దాదాపు సీరియల్ ఎండింగ్ వచ్చినట్లే కనిపిస్తుంది. ఈవారం ఎలాంటి ట్విస్టులతో ఈ సీరియల్ ఆకట్టుకుంటుందో చూడాలి.. ఒకవేళ కొత్త సీరియల్స్ వల్ల ఈ సీరియల్ డౌన్ అయితే శుభం కార్డు పడిపోతుందంటూ మరోవైపు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×