E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. టాప్ లో వంటలక్క..!

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. టాప్ లో వంటలక్క..!
Advertisement

Telugu TV Serials : ప్రతి వారం సీరియల్స్ టిఆర్పి రేటింగ్ అనేది నమోదు అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో బాక్స్ ఆఫీస్ కన్నా టిఆర్పి రేటింగ్ ఎక్కువగా నమోదవడం విశేషం. సీరియల్స్ కి డిమాండ్ పెరుగుతుండడంతో రేటింగ్ కూడా పెరుగుతుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ రేటింగ్ విషయంలో దూసుకుపోతుంది. ప్రతివారం బాక్స్ ఆఫీస్ వీక్లీ కలెక్షన్స్ ఎలాగైతే ఉంటాయో.. సీరియల్స్ కి కూడా అలానే టీఆర్పీ రేటింగ్ ఉంటుంది.. మరి ఈ వారం ఏ సీరియల్ టాప్ లో ఉంది. ఎంత రేటింగ్ ని సొంతం చేస్తుంది అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

టాప్ ప్లేసులో వంటలక్క..

ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ మంచి రేటింగ్ తో పాటుగా జనాలనుంచి మంచి రెస్పాన్స్ని కూడా సొంతం చేసుకుంటున్నాయి. గతవారం టిఆర్పి రేటింగ్ తో పోలిస్తే ఈ వారం కాస్త ఎక్కువగానే నమోదయింది. ఇది ఎప్పటిలాగే కార్తీకదీపం సీరియల్ ఒక్క అడుగు ముందుంజలో ఉంది. గతవారం గుండె నిండా గుడి గంటలు సీరియల్ టాప్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ తో పోటీ పడుతుంది.. కొత్త క్యారెక్టర్ ఈ సీరియల్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో జనాలు సీరియల్ చూడడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా కార్తీకదీపం 2 సీరియల్ టాప్ లోకి వచ్చేసింది. రెండో స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది..

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..?

Advertisement

స్టార్ మా ఛానెల్ లో టాప్ లో కొనసాగుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ ఉండటంతో పోటీ గట్టిగానే ఉంటుంది.. స్టార్ హీరోల సినిమాల కన్నా కూడా ఈ సీరియల్స్ కి కాస్త పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ సీరియల్స్ కి బాగా పెరిగింది.. అయితే ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. రేటింగు 11.48 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ చూస్తే.. 11.37 ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.35, ఇంటింటి రామాయణం 10.20, పొదరిల్లు 9.27, నువ్వులేక నేను లేను 8. 66, నిండు మనసులు 7.26, చిన్ని 6.83, బ్రహ్మముడి 6.67.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2 అలాగే గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. అలాగే ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా పోటీ పడుతున్నాయి. మొత్తానికి ఈవారం రేటింగు కాస్త ఎక్కువగానే ఉంది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×