E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు అవుట్?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇల్లు ఇల్లాలు పిల్లలు అవుట్?
Advertisement

Telugu TV Serials : ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టీవీ సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. వారంలో దాదాపు ఆరు రోజుల వరకు ప్రసారమవుతున్న సీరియల్స్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటున్నాయో తెలిసిందే. ఒక్కో సీరియలు ఒక్కో స్టోరీ తో విపరీతంగా అలరిస్తూ వస్తున్నాయి. సీరియల్స్ గురించి చెప్పాలంటే ఎన్నో విశేషాలను పంచుకోవాలి. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ గురించి మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. ఈ ఛానల్ లో ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి.. ఒక్కో సీరియలు ఒక్కో స్టోరీ తో రావడంతో జనాలు వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. సినిమాలకు ఎలాగైతే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ ఉంటాయో సీరియల్స్ కూడా అలానే టిఆర్పి రేటింగ్ అనేది ఒకటి ఉంటుంది. గత వారంతో పోలిస్తే ఈ వారం టిఆర్పి రేటింగ్ సీరియల్స్ కి కాస్త ఎక్కువగానే నమోదు అయినట్లు తెలుస్తుంది. మరి ఏ సీరియల్ ఏ స్థానంలో ఉంది అన్నది ఇప్పుడు కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…

కార్తీక దీపం మళ్ళీ టాప్..

ప్రతి వారం కూడా టీవీ సీరియల్స్ కు టి ఆర్ పి రేటింగ్ ఆ ఛానల్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ టాప్ రేటింగ్ లో కొనసాగుతుంది. కానీ ఇప్పుడు మళ్లీ కార్తీకదీపం టాప్ లోకి రావడంతో ఆ సీరియల్ లవర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. గత కొన్ని వారాలు ఇంటింటి రామాయణం సీరియల్ ఏ రేంజ్ కి వెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు కార్తీకదీపం 2 మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది. అదేవిధంగా మూడవ స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కొనసాగుతుంది.. ఈమధ్య ఇల్లు ఇల్లాలు పిల్లలు స్టోరీ కాస్త డల్ అయినట్టు అనిపిస్తుంది. దాంతో ఈ సీరియల్ ముగింపు పలికే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఇందులో ఏదో ఒక ట్విస్ట్ జరగాల్సిందే.. వల్లి బండారం ఎప్పుడైతే రామరాజుకు తెలుస్తుందో అప్పుడు ఈ సీరియల్కు శుభం కార్డు పడిపోతుందని అర్థమవుతుంది.. మరి సీరియల్ ఎలాంటి ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి..

ఈ వారం టాప్ రేటింగ్ సీరియల్స్..

Advertisement

బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే విధంగా కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తుంది  స్టార్ మా.. ఇందులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈవారం ఇందులో ప్రసారమవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ విషయానికి వస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం కొనసాగుతుంది. రేటింగు 14.05 గా ఉంది.. రెండవ స్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుంది. ఇక రేటింగు 13.60 గా ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 12.06, గుండె నిండా గుడి గంటలు 11.34, పొదరిల్లు 11.26, నువ్వులేక నేను లేను 9.46, నిండు మనసులు 8.36, చిన్ని 7.72, బ్రహ్మముడి 6.79, పలుగే బంగారమాయెనా 6.32 ఉంది. ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. పొదరిల్లు సీరియల్ ఇప్పుడు ముందంజలో కొనసాగుతుంది అని తెలుస్తుంది. ఈ ఛానెల్ లో ఇప్పటికే కొత్త సీరియల్స్ కూడా రాబోతున్నాయి. మరి వచ్చేవారం ఏ సీరియల్ కు ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×