E-Paper
Advertisement

Telugu Serials : టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సీరియల్ యాక్టర్స్ వీళ్లే..

Telugu Serials : టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సీరియల్ యాక్టర్స్ వీళ్లే..
Advertisement

Telugu Serials : సినిమాలలో నటించిన హీరోయిన్లు ఇప్పుడు సీరియల్స్లలో మెరుస్తున్నారు. ఎంతోమంది యూటర్న్ తీసుకొని సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.. అయితే ఒకప్పుడు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న యాక్టర్స్ సీరియస్లలో కనిపిస్తూ మరింత దగ్గరవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకులను తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. సినిమాల నుంచి వచ్చిన సీనియర్ యాక్టర్స్ ఎవరు? ప్రస్తుతం వీళ్లు ఒక్కో సీరియల్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు కాస్త మనం వివరంగా తెలుసుకుందాం..

టీవీ సీరియల్స్లలో నటిస్తున్న సీనియర్ యాక్టర్స్.. 

రాధిక శరత్ కుమార్..

చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో నటించిన రాధిక శరత్ కుమార్ ప్రస్తుతం బుల్లితెరపై కూడా పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది. ఇది కథ కాదు వంటి సూపర్ హిట్ సీరియల్స్లలో నటించిబుల్లితెరపై కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఎన్నో సీరియల్స్లలో నటించిన ఈమె ఒక్క సీరియల్ కి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది..

పవిత్ర జయరాం..

Advertisement

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్ లలో అత్తగా, విలన్, సహాయనాటిగా నటించిన పవిత్ర జయరాం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమె సీరియస్లలో నటించినందుకు గాను భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. ఒక్క రోజుకి దాదాపు 25 వేలకు పైగా తీసుకుంటుందని మీడియా వర్గాల్లో సమాచారం..

కస్తూరి శంకర్..

ఒకప్పుడు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో కస్తూరి శంకర్ ఒకరు.. తెలుగులో కూడా ఈమె పలు సినిమాలలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది.. ఎన్నో అవార్డులను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య బుల్లితెరపై అడుగు పెట్టింది.. తెలుగులో ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ లో తులసి పాత్ర ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది.. ఆ సీరియల్ తో జనాలను ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు.. ఈమె ఒక్క రోజుకి సీరియల్ లో నటించినందుకు గాను ఒక్క రోజుకి దాదాపు 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటుంది అని సమాచారం..

ఆమని..

Advertisement

తెలుగులో స్టార్ హీరోలతో నటించి మంచి స్టార్డంని సొంతం చేసుకున్న సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించి నటిగా ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈమె ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ వాళ్ళు నటిస్తూ వస్తుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.. ఈ సీరియల్ లో నటించిన దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది..

వీళ్లు మాత్రమే కాదు.. సీనియర్ హీరోయిన్ రాశి, తులసి వంటి వాళ్లు కూడా సినిమాల నుంచి సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. లేడీస్ మాత్రమే కాదు అటు జెంట్స్ కూడా సినిమాలనుంచి సీరియల్స్లలోకి అడుగుపెట్టి తమ క్రేజ్ ని ఇక్కడ కూడా పెంచుకుంటూ వస్తున్నారు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×