E-Paper
Advertisement

భర్త ఫోటో రివీల్ చేసిన తమన్నా.. క్యూట్ జోడీ!

భర్త ఫోటో రివీల్ చేసిన తమన్నా.. క్యూట్ జోడీ!
Advertisement

Tamanna Simhadri:వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు సొంతం చేసుకున్న బిగ్ బాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ షో ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీలుగా మారిన వారు కూడా లేకపోలేదు. అలాంటి వారిలో తమన్నా కూడా ఒకరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన ఈమె తన బోల్డ్ మాటలతో వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. ఇక నటిగానే కాకుండా అటు రాజకీయాలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇకపోతే తమన్నా వ్యక్తిగత జీవితం ఎప్పటికీ హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఆమె భర్త ఎవరు? ఆయన ఏం చేస్తారు? అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా ఆమె తన భర్త ఫోటోని కూడా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో చూసిన అభిమానులు చాలా క్యూట్ జోడీ అంటూ కామెంట్లు చేస్తూనే.. ఆమె భర్త గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కుతూహలం చూపిస్తున్నారు.

భర్త ఫోటో రివీల్ చేసిన తమన్నా సింహాద్రి..

ప్రముఖ ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బిగ్బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొని ఆకట్టుకున్న ఈమె.. గతంలో వైవాహిక జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి. “నాకు పెళ్లయింది.. నా భర్త నన్ను ఎంతో గౌరవంగా చూసుకుంటున్నారు. ఒక ట్రాన్స్ జెండర్ గా సమాజంలో ఎన్నో అవమానాలు, హేళనలు ఎదుర్కొన్న నాకు నా భర్త తోడుగా నిలబడడం గొప్ప విషయం” అంటూ తెలిపింది. అయితే ఆ సమయంలో తన భర్త ఫోటో కానీ , పేరు కానీ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దాంతో ఆమె భర్త గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా తమన్నా సింహాద్రి భర్త విదేశాలలో ఉంటారని , వ్యాపార రంగంలో ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆమె తన భర్త వివరాలను గోప్యంగా ఉంచినట్లు కూడా వార్తలు వినిపించాయి.. కానీ తాజాగా తన భర్త ఫోటోను ఆమె రివీల్ చేసింది. తన భర్త గురించి చెబుతూ ఆయన నన్ను ఒక సామాన్య మహిళలాగే ప్రేమిస్తారు. నా పోరాటాలలో అండగా నిలుస్తారు అంటూ తెలిపింది..

Advertisement

ALSO READ:బోయపాటి – కొరటాల మధ్య అక్కడే చెడిందా?

వివాహ వార్షికోత్సవం సందర్భంగా..

ప్రస్తుతం తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భర్త ఫోటోని షేర్ చేస్తూ సొంత ఊరికి వెళ్లి భర్తతో తన వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్లు ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఈ క్రమంలోనే ఆమెకు బిగ్ బాస్ ఫ్రెండ్స్, నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు ఏది ఏమైనా తమన్నా సింహాద్రి తన భర్త ఫోటోను షేర్ చేయడంతో క్యూట్ జోడి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×