E-Paper
Advertisement

Kissik Talks: కర్మ ఎవరిని వదిలిపెట్టదు – సుమన్ శెట్టి కామెంట్స్!

Kissik Talks: కర్మ ఎవరిని వదిలిపెట్టదు – సుమన్ శెట్టి కామెంట్స్!
Advertisement

Kissik Talks:బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ప్రముఖ సినీ కమెడియన్ బిగ్ బాస్ ఫేమ్ సుమన్ శెట్టి గెస్ట్ గా వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది. అలా తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. అందులో 300 సినిమాలు చేశాను నాకు అవకాశాలు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు.. కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. కోటి రూపాయలు ఆమెకే ఇస్తాను అంటూ పలు విషయాలపై చర్చించారు.

ఇంట్లో ఆయన కోసం గుడి కట్టాను- సుమన్ శెట్టి

తాజా ఇంటర్వ్యూలో భాగంగా సుమన్ శెట్టి మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి వచ్చాను అంటే దానికి కారణం మా గురువుగారు డైరెక్టర్ తేజ. ఇప్పటికీ ఆ గుడి అలాగే ఉంది. ఆయన కోసమే నేను ఆ గదిని అలాగే ఉంచాను అంటూ తనకు ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చిన తేజపై కామెంట్లు చేస్తూనే ఆయన కోసం కట్టిన గది గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

నాడు తండ్రి చెప్పిన మాటే ఇప్పటికీ ఎప్పటికీ..

Advertisement

కోటి రూపాయలు ఇస్తే మీరు ఏం చేస్తారు అన్న ప్రశ్నకు సుమన్ శెట్టి మాట్లాడుతూ..” నేను మొదట మా అక్కకు ఇస్తాను .ఎందుకంటే ఇంటి ఆడపిల్ల బాగుంటేనే మనం బాగుంటామని మా నాన్నగారు చెప్పారు. ఇంటి ఆడపిల్ల కన్నీరు పెట్టకుండా చూసుకోవాలని ఆయన చెప్పిన మాటలే నేను ఇప్పటికీ ఎప్పటికీ ఫాలో అవుతున్నాను. అంటూ ఇంటి ఆడపిల్లకు ఇచ్చే గౌరవం పై సుమన్ శెట్టి కామెంట్లు చేశారు.

పాపమైనా పుణ్యమైనా అనుభవించి తీరాల్సిందే..

కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా అనే ప్రశ్నకు సుమన్ శెట్టి మాట్లాడుతూ.. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అది పాపం అయినా.. పుణ్యమైనా కచ్చితంగా అనుభవించాల్సిందే. ఈ జన్మలో పాపం చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తావు అంటారు. అలా కాదు ఎన్ని జన్మలెత్తినా ఎత్తకపోయినా చేసిన కర్మ.. చేసిన పుణ్యం ఉన్న జన్మలోనే పూర్తి చేయాల్సిందే.

Advertisement

ALSO READ:తీన్ మార్ సినిమాలో నటించింది అన్నా లెజినోవా కాదా?

300 సినిమాల్లో చేసిన అవకాశాలు లేవు..

గ్యాప్ అన్నది నాకు తెలీదు. నెలకి 30 రోజులు నేను షూటింగ్ లో పాల్గొనేవాడిని.ఒక నంది అవార్డు కూడా వచ్చింది. ఇప్పటివరకు మొత్తం 300 సినిమాలలో నటించాను.. షూటింగ్స్ లేకపోవడం, చిన్న సినిమా లేదు పెద్ద సినిమా లేదు అవకాశం ఇస్తే ప్రాణం పెట్టి చేస్తాను. కాళ్ళకి, చేతులకి ఫ్రాక్చర్లయ్యాయి. నాలో ఏం లోపం ఉంది. ఎందుకు మనకి అవకాశాలు తగ్గాయి.. ఇచ్చే క్యారెక్టర్స్ సరిగ్గా చేయడం లేదా? అందుకే నేనెప్పుడూ బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే సినిమాలు తప్ప నాకే పని రాదు. అంటూ సినిమాలలో అవకాశాలు లేకపోవడంపై కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×