E-Paper
Advertisement

Chota Don Suman Shetty: సుమన్ శెట్టి ప్రభంజనం.. ‘చోటా డాన్’గా అదిరిపోయే ఎంట్రీ, ఏకంగా ఆ సీరియల్‌లో..

Chota Don Suman Shetty: సుమన్ శెట్టి ప్రభంజనం.. ‘చోటా డాన్’గా అదిరిపోయే ఎంట్రీ, ఏకంగా ఆ సీరియల్‌లో..
Advertisement

Chota Don Suman Shetty: బుల్లితెరపై ఎన్నో సరికొత్త సీరియల్స్ ప్రసారమవుతు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఇక త్వరలోనే స్టార్ మా లో సరికొత్త సీరియల్స్ ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 22 వ తేదీ నుంచి స్టార్ మాలో “నువ్వు లేక నేను లేను”అనే ధారావాహిక ప్రసారం కాబోతోంది. ఈ క్రమంలోనే ఈ సీరియల్లో నటీనటులను ఇప్పటికే పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీరియల్ కి సంబంధించిన మరొక కొత్త ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఈ సీరియల్ లో బిగ్ బాస్ 9 కంటెస్టెంట్, కమెడియన్ సునీల్ శెట్టి సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.

చోటా డాన్ పాత్రలో సుమన్ శెట్టి..

ఈ సీరియల్ లో సుమన్ శెట్టి చోటా డాన్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సుమన్ శెట్టి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు వెండితెరపై తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన సుమన్ శెట్టి ఇప్పుడు బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావటం విశేషం. సుమన్ శెట్టి కొన్ని వందల సినిమాలలో నటించి కమెడియన్ గా ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల కాలంలో వెండితెరకు పూర్తిగా దూరంగా ఉన్న సుమన్ శెట్టికి ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం లభించింది.

బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి..

Advertisement

ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన సుమన్ శెట్టి మొదటి నుంచి కూడా తన అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన 14 వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ ద్వారా మరోసారి తనదైన శైలిలోనే ప్రేక్షకులను సందడి చేసిన సుమన్ శెట్టి ఇకపై బుల్లితెర సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు. ఈ సీరియల్ లో చోటా డాన్ గా సుమన్ శెట్టి కనిపించబోతున్న నేపథ్యంలో ఈయన పాత్ర కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన జయం అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సుమన్ శెట్టి తన నటనతో వెండితెర ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా తానేంటో నిరూపించుకున్నారు. ఇక త్వరలోనే బుల్లితెర పై సందడి చేయబోతున్న నేపథ్యంలో బుల్లితెర ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక నువ్వు లేక నేనులేను సీరియల్ విషయానికి వస్తే కన్నడలో వచ్చిన నిన్నా జోతే నన్న కథే సీరియల్ రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెళ్లి అంటే వందేళ్ళ జీవితం అని కాకుండా ఏడాది అగ్రిమెంట్ అంటూ ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక సూపర్ హిట్ సినిమా కథతో, మరో సూపర్ హిట్ సినిమా టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సీరియల్ ఎలా ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

Also Read: Mehreen pirzada: త్వరలో మెహ్రీన్ పెళ్లి.. ఇంతలోనే బాంబు పేల్చిందిగా, మరీ అంత కోపమా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×