E-Paper
Advertisement

Sri Satya Kissik Talks: ‘బీబీ జోడీ’లో సెల్ఫ్ ఎలిమినేషన్‌కు కారణమిదే!

Sri Satya Kissik Talks: ‘బీబీ జోడీ’లో సెల్ఫ్ ఎలిమినేషన్‌కు కారణమిదే!
Advertisement

Sri Satya Kissik Talks: సీరియల్స్‌లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న శ్రీ సత్య (Sri Satya).. బిగ్ బాస్ ఎంట్రీతో స్టార్ నటిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై కనువిందు చేస్తున్న శ్రీ సత్య.. తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్నారు. అందులో ప్రస్తుతం ఆమె చేస్తున్న ‘బీబీ జోడీ’ (BB Jodi) షో పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

డ్యాన్స్ నా జోనర్ కాదు

‘‘నాకు ఇది హ్యాపీని ఇస్తుంది అనుకునే ప్రాజెక్ట్‌లను మాత్రమే చేస్తాను. నేను చేస్తే గుర్తుండిపోయేలా ఉండాలి. నేను ఏదైనా చేస్తున్నాను అంటే, అది నాకు ఎక్సైట్‌మెంట్ ఇవ్వాలి. ఎక్సైట్‌మెంట్ ఇవ్వకపోతే నేను అది చేయను. ఒక్క డ్యాన్స్ షో అనే కాదు, నిజం చెప్పాలంటే డ్యాన్స్ అనేది నా జోనరే కాదు. డ్యాన్స్ చేస్తానని కూడా నాకు తెలియదు. బీబీ జోడి 1 చేసే సమయంలో కూడా నేను అదే చెప్పాను. నా వల్ల మెహబూబ్ ఎలిమినేట్ అవుతాడు.. నాకు డ్యాన్స్ రాదండి అని చెప్పాను.. కానీ నేర్పించారు. బీబీ జోడీ మొత్తం సెల్ఫ్ ఎలిమినేషనే నడుస్తుంది. మేము ఎవరినీ ఎలిమినేట్ చేయకుండానే.. వారంతట వారే ఎలిమినేట్ అవుతున్నారని జడ్జ్‌లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓన్లీ పవన్, రీతూ మాత్రమే ఎలిమినేట్ అయ్యారు.

Advertisement

Also Read- Dacoit: ‘డెకాయిట్‌’లో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ భామ ఎవరో తెలుసా?

సెల్ఫ్ ఎలిమినేషన్‌కు కారణమిదే..

సెల్ఫ్ ఎలిమినేషన్ కావడానికి రీజన్ చెప్పాలంటే.. కొంతమందికి హెల్త్ బాగోక, కొంతమంది మెంటల్లీ రెడీ కాకపోవడం, స్ట్రెస్ తీసుకోలేక కొందరు ఇలా సెల్ఫ్ ఎలిమినేట్ అవుతున్నారు. వాస్తవానికి డ్యాన్స్ షో చూడటానికి చాలా ఈజీ అని అందరూ జడ్జ్ చేస్తుంటారు కానీ, ఎంత స్ట్రెస్సో ఎవరికీ తెలియదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు డ్యాన్స్ చేస్తూనే ఉండాలి. ఒక్కోసారి సడెన్‌గా స్టేజ్ మీదకు పిలిచి స్టార్ట్ అంటారు. ముగ్గురు జడ్జ్‌ల కంటే కూడా ఈ షోలో మేమే ఎక్కువ జడ్జిమెంట్ ఇస్తుంటాం. చిన్న చిన్న మైనర్ విషయాలను కూడా మేము పట్టించుకుంటాం. జడ్జ్‌లు కూడా అవి చూడరు. కానీ మేము చూస్తాం.. ఎందుకంటే, బిగ్ బాస్ చేసి చేసి అలవాటైపోయింది.

Advertisement

Also Read- Vishwambhara Movie: చిరంజీవి విశ్వంభర మూవీ థియేట్రికల్ రైట్స్ వారి చేతికే!

బీబీ జోడీకి కూడా పీఆర్స్

ఇందులో చాలా మంది డ్యాన్స్ కంటే కంటెంట్ ఎక్కువ ఇస్తున్నారు. అది బిగ్ బాస్ నుంచి అలవాటైపోయింది. అక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ల గేమ్‌ని వాళ్లు సీరియస్‌గా తీసుకుంటారు. అంతా ఎంతో కష్టపడి ఇదంతా చేస్తుంటే.. చిన్న చిన్న పాయింట్స్‌ని చూపిస్తే కోపం రాకుండా ఎలా ఉంటుంది. బిగ్ బాస్‌కే కాదు.. బీబీ జోడీకి కూడా పీఆర్స్ ఉన్నారు. ఇది నిజం. దీనికి పీఆర్స్ ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. సోషల్ మీడియాలో పుష్ చేయడానికి ఓకే. నాకు పీఆర్స్ లేరు. పీఆర్స్‌ని మెయింటైన్ చేసేంత డబ్బులు నా దగ్గర లేవు, నాకు రావు కూడా. నేను అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయను. పీఆర్స్ ఉన్నారనే విషయం నాకు ఎలా తెలుస్తుందంటే.. అన్ని కామెంట్స్ చూస్తుంటాను. అప్పటికప్పుడు క్రియేట్ చేసిన అకౌంట్స్ నుంచి కామెంట్స్ వస్తుంటాయి. వారికి జీరో ఫాలోయర్స్ ఉంటారు. వాళ్లని అనడానికి కూడా లేదు. వాళ్లకి కూడా డబ్బులు కావాలి కదా. అందుకే అలా చేస్తుంటారు’’ అని శ్రీ సత్య బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్‌ (Big TV Kissik Talks)లో అసలు విషయం రివీల్ చేశారు.

Also Read- SS Rajamouli: ‘ధురంధర్ 2’లో ఆ సీన్ అదిరిందన్న జక్కన్న, దర్శకుడి స్పందన చూశారా!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×