E-Paper
Advertisement

Sri Satya: తల్లి ఫిజియోథెరపీ కోసం ప్రతినెలా అంత ఖర్చు చేస్తోందా.. శ్రీ సత్య కష్టం పగవాడికి కూడా వద్దు!

Sri Satya: తల్లి ఫిజియోథెరపీ కోసం ప్రతినెలా అంత ఖర్చు చేస్తోందా.. శ్రీ సత్య కష్టం పగవాడికి కూడా వద్దు!
Advertisement

Sri Satya: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొని తన పెర్ఫార్మెన్స్ తో, వ్యక్తిగత విషయాలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది శ్రీ సత్య. అంతకు ముందు మోడల్గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. 2019లో నటిగా తన ప్రయాణాన్ని మలుచుకుంది.సినిమాలలో, సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ఈ చిన్నది.. తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో విషయాలను బిగ్ బాస్ రియాల్టీ షోలో పంచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా తన తల్లి గురించి చెప్పి అందర్నీ కంటతడి పెట్టించింది.

మా అమ్మకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే..

అసలు తెలిసీ తెలియని వయసులో నేను ప్రేమలో పడ్డాను. అయితే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పినప్పుడు మా నాన్న ఒప్పుకోలేదు. దీంతో నేను ఏడాది పాటు ఆయనతో మాట్లాడలేదు. అతడిని చాలా ఇష్టపడ్డాను. అయితే ఎంగేజ్మెంట్ కూడా అయింది. పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో నా దగ్గర డబ్బు లేదని అతను బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు. ఇక దాన్నుంచి బయటపడడానికి చాలా రోజులు పట్టింది.. బ్రేకప్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. నా బ్రేకప్ , నేను ఆత్మహత్య చేసుకోవడం ఇవన్నీ తట్టుకోలేక మా అమ్మ మానసికంగా క్షోభ ఎదుర్కొంది. ఆ ప్రభావం ఆమె మాట తీరుపై పడింది. క్రమంగా మాటలు కోల్పోయింది. ఇక ఎంతో కాలం ఆమెకు చికిత్స చేయించాము. ఫిజియోథెరపీలో భాగంగా ఆమె ఎముకలు విరిగిపోయాయి. దాంతో ఆమె కదలలేని పరిస్థితికి చేరుకుంది. ఇక ఆమె జీవితాంతం అలాగే వీల్ చైర్ లో ఉండిపోవాల్సిందేనని వైద్యులు చెప్పారు.. మా అమ్మకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే అంటూ ఎమోషనల్ అయింది శ్రీ సత్య.

నెలకు రెండున్నర లక్షలు ఖర్చు..

Advertisement

మా అమ్మ ఫిజియోథెరపీ కోసం వారానికి 20,000 వరకు ఖర్చు అవుతుంది. అలాగే ప్రతి నెల రెండు నుండి రెండున్నర లక్షల వరకు ఖర్చవుతుంది. మా అమ్మ నువ్వు ఆరోగ్యంగా ఉంచడానికి, ఆమెను మళ్లీ మునుపటిలా చూడడానికి నాకు అదృష్టం లేదేమో కానీ నేను ఉన్నంతకాలం మా అమ్మ నాన్నను ఆరోగ్యంగా చూసుకుంటాను. నా ముందున్న మొదటి చివరి లక్ష్యం అదే. ఇక నా చేతిలో ప్రస్తుతం సినిమాలు కానీ , షోలు కానీ లేవు. ఉన్నది ఒకటే బీబీ జోడి. ఇది ఉంది కాబట్టి ప్రస్తుతం డబ్బులు వస్తున్నాయి. ఇది అయిపోతే నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మా అమ్మను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు అంటూ శ్రీ సత్య ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read: Sri Sathya: లగ్జరీ బంగ్లాలు.. ఖరీదైన కార్లు.. ఆస్తులపై శ్రీ సత్య షాకింగ్ కామెంట్!

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×