E-Paper
Advertisement

Big TV Kissik Talks: రియాలిటీ షోల వెనుక ఇంత కుట్రా.. పీఆర్ టీమ్ లోగుట్టులు బయటపెట్టిన శ్రీ సత్య!

Big TV Kissik Talks: రియాలిటీ షోల వెనుక ఇంత కుట్రా.. పీఆర్ టీమ్ లోగుట్టులు బయటపెట్టిన శ్రీ సత్య!
Advertisement

Big TV Kissik Talks:ఈ మధ్యకాలంలో టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు చాలామంది పిఆర్ టీమ్ ను సెలబ్రిటీలు నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా తమ పాపులారిటీని ప్రచారం చేయించుకోవడం కంటే పక్క వాళ్ళని నెగిటివ్ చేయడానికి ఎక్కువగా ఈ పిఆర్ టీమ్స్ ను ఉపయోగిస్తున్నారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయం అటు టాలీవుడ్ లో ఎక్కువగా కనిపించకపోయినా బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చాలామంది స్టార్ హీరోయిన్లు కూడా ఈ విషయాన్ని బయటపెట్టారు. అయితే మరోసారి శ్రీ సత్య కూడా ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుంది.

ఒక్కో కామెంట్ కి ఐదు రూపాయలు..

బిగ్ బాస్, బీబీ జోడీ వంటి రియాలిటీ షోలలో ఎంతోమంది కంటెస్టెంట్స్ పాల్గొంటారు. అయితే వారు కొంతమంది పి.ఆర్ టీంస్ ను పెట్టుకుంటారు. ఆ టీం వాళ్లు నన్ను బ్యాడ్ చేయడానికి ఒక్కో కామెంట్ కి ఐదు రూపాయలు ఇచ్చి మరీ పిఆర్ చేయించినట్లు.. ఎవరైతే నాకు బ్యాడ్ కామెంట్స్ చేశారో వారు నాకు చెప్పారు. ఎందుకంటే వారికి నేనంటే ఇష్టమట. ముఖ్యంగా కొంతమంది కావాలని నన్ను బ్యాడ్ చేయించడానికి ఇలా డబ్బులు ఇచ్చి మరీ పిఆర్ చేయించారు అంటూ తెలిపింది శ్రీ సత్య. ఇకపోతే రియాలిటీ షో లలో మాత్రమే ఇలాంటి చెత్త పీ ఆర్ లు ఉంటారు అని, పి ఆర్ అంటే కేవలం మన పాపులారిటీని పెంచుకోవాలి తప్ప ఇతరులను నెగిటివ్ చేయకూడదు అంటూ తన అభిప్రాయాలను పంచుకుంది.

కర్మ ఎవరిని వదలదు..

Advertisement

మనం ఎదగాలంటే పక్కవాడిని తొక్కాల్సిందే అనే ప్రయత్నాలు చేస్తే మాత్రం మనల్ని తొక్కడానికి కూడా ఎవరో ఒకరు రెడీగా ఉంటారు. కర్మ అనేది ఎవరిని వదలదు. నీకు రాసిపెట్టి ఉంటే ఎంత కష్టం ఎదురైనా సరే నువ్వు జీవితంలో ఎదుగుతావు . రాత లేనప్పుడు ఏం చేసినా వృధానే.. ఇండస్ట్రీలో ఎంత పలుకుబడి ఉన్నా సరే ప్రస్తుతం అవకాశాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్లు కూడా ఉన్నారు.

తల్లిదండ్రులు జీవన ఆధారం..

మనం జీవితంలో ఎన్ని తప్పులు చేసినా.. మనల్ని కాపాడేది కేవలం మన తల్లిదండ్రులు మాత్రమే . దయచేసి మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా.. మీకు తల్లిదండ్రుల నుంచి కష్టాలు వచ్చినా సరే మీరు మీ తల్లిదండ్రులను మాత్రం వదులుకోకండి.. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కనీ పెంచి ఇంత వాళ్లను చేసిన వాళ్ళను వదిలేయడం నిజంగా బాధాకరం. తల్లిదండ్రులను బాగా చూసుకోండి . అప్పుడే మిమ్మల్ని మీ పిల్లలు మరింత బాగా చూసుకుంటారు అంటూ శ్రీ సత్య తెలిపింది.

Advertisement

also read:Big TV Kissik Talks: డ్రెస్సింగ్ సెన్స్ పై శ్రీ సత్య కామెంట్.. చీరకట్టిన ప్రతి ఒక్కరూ పతివ్రత కాదు!

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×