E-Paper
Advertisement

Big TV Kissik Talks: సర్జరీపై తొలిసారి స్పందించిన శ్రీ సత్య.. ఆ మాటలు భరించలేకపోయా!

Big TV Kissik Talks: సర్జరీపై తొలిసారి స్పందించిన శ్రీ సత్య.. ఆ మాటలు భరించలేకపోయా!
Advertisement

Big TV Kissik Talks:బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్ గా తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్న శ్రీ సత్య .. అటు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ గా ఇటు సీరియల్ నటీమణిగా అటు సినిమాలలో కూడా సందడి చేసి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ..ప్రస్తుతం బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె ఎన్నో విషయాలను పంచుకుంది.. అలాగే లిప్ సర్జరీపై చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సర్జరీపై తొలిసారి స్పందించిన శ్రీ సత్య..

నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా నా ముఖం చాలా క్యూట్ గా ఉంది అని, చిన్నపిల్లలా ఉంది అని చాలామంది కామెంట్లు చేసేవారు. అలా విని విని విసిగిపోయి.. ఆ మాటలు క్రమంగా భరించలేకపోయాను.. నా వయసు పెరిగినా కూడా నా ఫేస్ మాత్రం ఇంకా చిన్నపిల్లలాగా కనిపించేసరికి ఎలాగైనా నేను పెద్దదాని లాగా కనిపించాలని లిప్స్ కి సర్జరీ చేయించుకున్నాను. డాక్టర్ వద్దని చెప్పినా సరే నేను వినకుండా లిప్స్ కి సర్జరీ చేయించాను. కానీ అది మూడు నాలుగు నెలలకి మించి ఉండదు. కానీ నా లిప్స్ సర్జరీ తర్వాత చాలా పెద్దవిగా అయిపోయాయి . ఇక వాటిని మళ్లీ సరి చేసుకోవడానికి నా చేతులతో నేనే సరి చేసే ప్రయత్నం చేశాను . ఆఖరికి మొత్తం చెడిపోయింది. నా ఫేస్ చూసి నాకే అసహ్యం వేసింది.. అందుకే మళ్లీ లిప్ కాస్మెటిక్ జోలికి వెళ్లలేదు” అంటూ చెప్పుకొచ్చింది శ్రీ సత్య. ఇక తాను ఎలా ఉన్నా సరే ..ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినా సరే ఇకపై డోంట్ కేర్ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

also read:Big TV Kissik Talks: కన్నతండ్రినే దూరం పెట్టిన శ్రీ సత్య.. చివరికి?

మిస్ విజయవాడ టైటిల్ కొట్టేవరకు అమ్మ మాట్లాడలేదు..

ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ అయిపోయాక మిస్ విజయవాడ అందాల పోటీ కోసం ఆడిషన్ జరిగింది. అప్పుడే హాస్టల్ నుంచి వచ్చిన నన్ను మా నాన్న ఒకసారి ట్రై చేయమని చెప్పారు. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు . అయితే మా నాన్న సహాయంతో నేను ఆడిషన్ కి వెళ్ళాను. కాల్ వస్తే అందాల పోటీలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. కాల్ రాలేదని నేను హాస్టల్ కి బయలుదేరే సమయంలో కాల్ వచ్చింది. ఇక మా నాన్నని చూసి నేను చదువుకోను అని చెప్పాను. ఇక నాన్న వెంటనే నన్ను ఇంటికి తీసుకువచ్చేసారు. ఇక మిస్ విజయవాడ టైటిల్ గెలిచే వరకు కూడా మా అమ్మ నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత మిస్ ఏపీ పోటీల్లో పాల్గొన్నాను.ఇక ఆ సమయంలో మా నాన్న మా అమ్మకు చెప్పారు.. పెళ్లయ్యాక అత్త మామ భర్త మాట వినాలి. అప్పుడు ఎలాగో తాను స్వతంత్రం కోల్పోతుంది. కనీసం ఇప్పుడైనా తనకు నచ్చింది చేయనివ్యు అని నాన్న చెప్పడం వల్ల అమ్మ మిస్ ఏపీ పోటీల్లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది శ్రీ సత్య.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×