E-Paper
Advertisement

Sreemukhi: గుడిలో రీతూ, డెమోన్ పెళ్లి…గుట్టు రట్టు చేసిన శ్రీముఖి

Sreemukhi: గుడిలో రీతూ, డెమోన్ పెళ్లి…గుట్టు రట్టు చేసిన శ్రీముఖి
Advertisement

Sreemukhi: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ బుల్లితెర ప్రేక్షకులకు పెద్ద ఎత్తున వినోదాన్ని అందిస్తున్నాయి. స్టార్ మా లో ప్రతివారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం(Aadivaram With Star Maa Parivaaram) కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు పాల్గొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా శ్రీముఖి (Sreemukhi)కొనసాగుతున్న విషయం తెలిసిందే. శ్రీముఖి యాంకర్ గా ఉన్నారంటే అక్కడ పెద్ద ఎత్తున ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పాలి.. ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ కార్యక్రమం ఏకంగా 175 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.

175 ఎపిసోడ్ స్పెషల్…

ఈ స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో హరి నటి కావ్యని చూస్తూ సూపర్ డైలాగ్ వేశారని చెప్పాలి. మన షో ఎపిసోడ్లు ఎలా అయితే పెరుగుతున్నాయో కావ్య గారి అంద కూడా అలాగే పెరుగుతుంది అంటూ హరి డైలాగు వేయగానే అవినాష్ కల్పించుకొని ఆవిడ అందం ఏమో కానీ నీ కామెడీ మాత్రం పెరగట్లేదు అంటూ హరికి కౌంటర్ ఇచ్చారు. ఇక పలువురు తమ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో కూడా సందడి చేశారని ఈ ప్రోమో చూస్తుంటేనే అర్థమవుతుంది ఇటీవల బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న రీతు చౌదరి(Ritu Chowdary) ఈ ఎపిసోడ్లో రాను రాను అంటూనే చిన్నదో అనే పాటకు అద్భుతమైన డాన్స్ వేసి అందరిని సందడి చేశారు.

ఏ గుడిలో పెళ్లి చేసుకుంటున్నారు..

Advertisement

ఇలా ఈ డాన్స్ పర్ఫామెన్స్ అవ్వగానే శ్రీముఖి రీతుతో మాట్లాడుతూ.. సర్లే గాని ఏ గుడిలో పెళ్లి చేసుకుంటున్నారు చెప్తే భోజనాలకు వచ్చేస్తాం అంటూ మాట్లాడగా వెంటనే రీతు ఎవరి పెళ్లి అంటూ ప్రశ్నించింది. దీంతో శ్రీముఖి నీది డెమోన్ ది .. వాడిని అడిగితే అక్క నువ్వు అలా అనకు అంటాడు అంటూ సరదాగా రీతుని ఆటపట్టించింది. ఇక ఈ కార్యక్రమంలో ప్రియాంక సాగర కన్య అవతారంలో కనిపించడంతో హరి ప్రియాంకతో కలిసి కాసేపు పులిహోర కలిపే ప్రయత్నం చేశారు. ఇలా బుల్లితెర సెలబ్రిటీలతో ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ చాలా వినోదాత్మకంగా ఉండబోతుందనేది ఈ ప్రోమో వీడియో చూస్తేనే అర్థమవుతుంది.

Advertisement

బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో భాగంగా రీతు డెమోన్ (Demon)కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ హౌస్ లో చాలా క్లోజ్ గా ఉన్న నేపథ్యంలో ఇద్దరు మధ్య లవ్ రిలేషన్ ఉంది అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటున్న నేపథ్యంలో వీరిద్దరి గురించి శ్రీముఖి ఇలా సరదాగా ఆటపట్టించారని తెలుస్తోంది. ఇక రీతు డెమోన్ ఇద్దరు కూడా ప్రస్తుతం బీబీ జోడీ సీసన్ 2 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొని సందడి చేస్తున్నారు.

Also Read: Tharun Bhascker: వెంకీ మామతో సినిమా..ఇదే కరెక్ట్ టైం అంటున్న తరుణ్ భాస్కర్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×