E-Paper
Advertisement

Kissik Talks: సోనియా – సిద్ధూ మధ్య బ్రేకప్.. టార్చర్ భరించలేకపోయా !

Kissik Talks: సోనియా – సిద్ధూ మధ్య బ్రేకప్.. టార్చర్ భరించలేకపోయా !
Advertisement

Kissik Talks: అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై ఎన్నో ప్రేమ జంటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే అందులో కొన్ని జంటలు పెళ్లి పీటలు ఎక్కితే.. మరికొన్ని జంటలు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మరో జంట పెళ్లికి సిద్ధమవుతూ అటు ప్రేమ పక్షుల్లా విహరిస్తూ అందరికీ చూడ చక్కని జంటగా ఆకట్టుకుంటున్నారు. వారెవరో కాదు సోనియా సింగ్ -పవన్ సిద్ధూ.. కలిసి తీర్థయాత్రలకు, టూర్లకు వెళ్లి నెటిజన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా ఇటు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు.

బంధం నిలబడాలంటే రహస్యం ఉండకూడదు – సోనియా

అటు వెబ్ సిరీస్, సినిమాలు అంటూ జంటగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పెళ్లికి సిద్ధమవుతున్న ఈ జంట మధ్య బ్రేకప్ అనే ప్రస్తావన వచ్చిందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది సోనియా.. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా సింగ్ బ్రేకప్ పై స్పందిస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచింది. మీ మొబైల్ పాస్వర్డ్ సిద్ధూకి తెలుసా? అని వర్ష ప్రశ్నించగా.. ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉన్నప్పుడు మనం ఏ విషయం కూడా దాచకూడదు కదా.. అందుకే ఏమీ లేనప్పుడు ఎందుకు నేను సిద్ధూ దగ్గర దాస్తాను.. ప్రస్తుతం నా ఫోన్ కూడా సిద్ధూ దగ్గరే ఉంది అంటూ తమ బంధంపై క్లారిటీ ఇచ్చింది.

Advertisement

also read:Kissik Talks: టీవీ ఇండస్ట్రీ నన్ను వెలేసింది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సోనియా!

మూడు నెలల క్రితం అంతా అయిపోయిందనుకున్నాం -5 సోనియా

లవ్ లో బ్రేకప్ అయి.. ముందుకు వెళ్లకుండా.. డిప్రెషన్ లో ఉన్న వాళ్లకు మీరు ఏం చెప్తారు? అని ప్రశ్నించగా.. మూడు నెలల క్రితం మేము కూడా దాదాపు బ్రేకప్ దాకా వెళ్లి వచ్చాము. ఇద్దరి మధ్య ఎన్నో గొడవలు, మిస్ అండర్స్టాండింగ్, చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాము. సిద్ధూ సడన్ గా ఒక మాట అనేస్తాడు. నేనెందుకు భరించాలి. నన్ను అలా అంటాడా? ఇలా అంటాడా? అనే బాధ నాలో ఇంకా ఎక్కువ ఉండేది.. ఇక ఆ సమయంలో బ్రేకప్ చెప్పుకుంటామేమో అనే అనుమానం కూడా మాలో కలిగింది. కానీ ఆ తర్వాత శాంతంగా ఒకరినొకరు అర్థం చేసుకొని అన్నింటికీ దూరంగా మళ్ళీ మేము ఒక్కటయ్యాము. ఇప్పుడు సిద్ధూ ఏమన్నా సరే సిద్ధూ నే కదా అనే ఆలోచన నాలో కలుగుతుంది” అంటూ తెలిపింది సోనియా.

రూమర్స్ పై క్లారిటీ..

Advertisement

సిద్ధూ తో ఉన్నప్పుడే నాపై ఎన్నో రూమర్లు గుప్పించారు.. పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారు అంటూ ఎన్నెన్నో రూమర్లు సృష్టించారు . అయితే నేను కూడా అందరిలాంటి ఆడపిల్లనే కదా.. పద్ధతి కలిగిన కుటుంబం నుంచే నేను వచ్చాను. మా నాన్న లేకపోయినా మా అమ్మ చాలా జాగ్రత్తగా, పద్ధతిగా పెంచింది. ఇక ఎలాంటి రూమర్లు, ట్రోల్స్ వచ్చినా సరే మనకు మనమేంటో తెలుసు.. వాటన్నింటికీ మనం బాధపడాల్సిన అవసరం లేదు అంటూ తెలిపింది సోనియా. మొత్తానికైతే ఇప్పుడు అన్ని సెటిల్ అయ్యాయని.. పెళ్ళికి సిద్ధం అవుతున్నామని.. సెప్టెంబర్ రెండవ తేదీన ఎర్లీ మార్నింగ్ 1:45 గంటలకు తమ పెళ్లి అంటూ క్లారిటీ ఇచ్చేసింది సోనియా ఇకపోతే ఏడాది ఈ జంట కలసి ఒక ఇల్లు , ఒక కార్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×