E-Paper
Advertisement

Soniya Singh: గంటల తరబడి బాత్రూంలోనే.. అబ్బాయిలందరికీ సోనియా ఝలక్!

Soniya Singh: గంటల తరబడి బాత్రూంలోనే.. అబ్బాయిలందరికీ సోనియా ఝలక్!
Advertisement

Soniya Singh:యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ మొదలుపెట్టి, ‘విరూపాక్ష’ సినిమాతో వెండితెరపై మెరిసిన నటి సోనియా సింగ్.. ఇప్పుడు తన రియల్ లైఫ్ పార్ట్‌నర్‌తో కలిసి సందడి చేస్తోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘మాడ్ ఫర్ ఈచ్ అదర్’ (Mad For Each Other) రియాలిటీ షోలో పాల్గొన్న ఈ బ్యూటీ, తాజాగా రిలీజైన ప్రోమోలో తన భర్త సిద్ధు గురించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. ముఖ్యంగా అబ్బాయిల బాత్రూమ్ అలవాట్లపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ నవ్వులు పూయిస్తున్నాయి. ఆ విశేషాలేంటో చూద్దాం.

‘మాడ్ ఫర్ ఈచ్ అదర్’లో సోనియా సందడి:

స్టార్ మాలో సరికొత్తగా మొదలైన రియాలిటీ షో ‘మాడ్ ఫర్ ఈచ్ అదర్’ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. 10 సెలబ్రిటీ జంటలు ఒకే విల్లాలో 70 రోజుల పాటు ఉంటూ, తమ బంధం ఎంత బలమైనదో నిరూపించుకోవడమే ఈ షో ముఖ్య ఉద్దేశం. ఇందులో నటి సోనియా సింగ్ తన భర్త సిద్ధుతో కలిసి పార్టిసిపేట్ చేస్తోంది. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, గొడవలు, సరదాలు ప్రేక్షకులకు భలే వినోదాన్ని పంచుతున్నాయి. జియో హాట్‌స్టార్‌లో కూడా ఈ షో స్ట్రీమింగ్ అవుతూ మంచి వ్యూస్ రాబడుతోంది.

బాత్రూంలో గంటల తరబడి ఏం చేస్తారు?:

Advertisement

తాజాగా విడుదలైన ప్రోమోలో సోనియా తన భర్త సిద్ధుపై ఒక ఆసక్తికరమైన కంప్లైంట్ చేసింది. “సిద్ధు బాత్రూంకు వెళ్తే ఇక బయటకు రాడు.. గంటల తరబడి అక్కడే కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటాడు” అని అందరి ముందు చెప్పేసింది. ఇక ఇది కేవలం తన భర్త సమస్యే కాదు, అసలు అబ్బాయిలందరూ చేసే పనే ఇదని సోనియా ఝలక్ ఇచ్చింది. ఈ మాట విన్న వెంటనే అక్కడ ఉన్న మిగతా కంటెస్టెంట్లు, జడ్జిలు ఒక్కసారిగా నవ్వేశారు. అబ్బాయిల ఫోన్ పిచ్చిపై సోనియా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనిల్ రావిపూడి ఇచ్చిన లాజిక్ అదిరింది:

సోనియా మాటలకు యాంకర్ శ్రీముఖి స్పందిస్తూ.. “అసలు అబ్బాయిలు బాత్రూంలో అంత సేపు ఏం చేస్తారు?” అని గెస్ట్ గా వచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడిని అడిగింది. దానికి అనిల్ తనదైన స్టైల్లో సమాధానమిస్తూ.. “అబ్బాయిలకు మనసు ప్రశాంతంగా ఉండే ఏకైక ప్లేస్ అదే” అని నవ్వుతూ చెప్పారు. అక్కడ ఉన్న అబ్బాయిలందరూ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారని ఆయన అనగానే, సోనియా భర్త సిద్ధు వెంటనే చేయి ఎత్తి ‘నేను కూడా అంతే’ అని ఒప్పుకున్నాడు. దీంతో సెట్ అంతా నవ్వులతో నిండిపోయింది.

రిలేషన్ షిప్ పరీక్షలో గెలిచేది ఎవరు?:

Advertisement

ఈ షో కేవలం నవ్వులకే పరిమితం కాకుండా, జంటల మధ్య ఉండే ప్రేమని కూడా పరీక్షిస్తోంది. రాధా మరో జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ షోలో సవాళ్లు చాలా గట్టిగానే ఉంటున్నాయి. ఒకరి అలవాట్లు మరొకరికి నచ్చకపోయినా, వాటిని ఎలా అడ్జస్ట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారనేది ఇక్కడ ముఖ్యం. సోనియా తన భర్త గురించి బయటపెట్టిన ఈ బాత్రూమ్ సీక్రెట్ సరదాగా అనిపించినా, సాధారణంగా ప్రతి ఇంట్లో జరిగే ముచ్చటే కావడంతో ఆడియన్స్ ఈ ప్రోమోకు బాగా కనెక్ట్ అవుతున్నారు.

ఒకే విల్లాలో పది జంటల సందడి:

ఈ రియాలిటీ షోలో మొత్తం పది జంటలు పాల్గొంటున్నాయి. ఇందులో విచిత్రం ఏంటంటే.. పెళ్లైన భార్యాభర్తలతో పాటు, ఇంకా పెళ్లి కాని ప్రేమికులు కూడా జంటలుగా విచ్చేశారు. సోనియా-సిద్ధు, ప్రియాంక జైన్-శివ్ కుమార్, అషియా-నూకరాజ్ వంటి పాపులర్ జోడీలతో పాటు మొత్తం పది టీవీ సెలబ్రిటీ జంటలు ఒకే విల్లాలో ఉండబోతున్నారు. వీరందరికీ విడివిడిగా బెడ్ రూమ్‌లు కేటాయించడం ఈ షోలో ఒక హాట్ టాపిక్‌గా మారింది. వాసంతి-కళ్యాణ్, నీతూ-నటరాజ్ వంటి వారు తమ రిలేషన్‌షిప్‌లో ఉండే లోటుపాట్లను, ప్రేమని ఈ 70 రోజుల ప్రయాణంలో ఎలా నిరూపించుకుంటారో చూడాలి. శ్రీముఖి హోస్టింగ్‌లో ఈ షో బిగ్ బాస్ తరహాలోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

also read: Peddi: పెద్ది స్పెషల్ సాంగ్ లో మృణాల్ ఠాకూర్.. నిజమేనా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×