E-Paper
Advertisement

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!
Advertisement

Smriti Irani: సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు (Politics)ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది. సినిమాలలో నటించేవారు రాజకీయాలలోకి వెళ్లి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ఇక రాజకీయాలలో గెలుపోటములు అనేది సర్వసాధారణం. ఇలా ఎన్నికలలో ఓటమిపాలు అయిన తర్వాత తిరిగి సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి వస్తు నటనపరంగా బిజీ అవుతుంటారు. ఇలా రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన వారిలో కేంద్రమంత్రి(Central Minister) స్మృతి ఇరానీ (Smirit Irani)కూడా ఒకరు. కేంద్ర మంత్రిగా కీలకమైన బాధ్యతలు చేపట్టిన ఈమె ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరమైనప్పటికీ తాను ఫుల్ టైం రాజకీయ నాయకురాలినని నటన అనేది పార్ట్ టైం మాత్రమే అని చెబుతూ వచ్చారు.

నటిగా స్మృతి ఇరానీ…

Advertisement

ఇకపోతే గతంలో ఎన్నో అద్భుతమైన టీవీ సీరియల్స్ లో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న స్మృతి ఇరానీ రాజకీయాలలో బిజీ అయిన నేపథ్యంలో సీరియల్స్ కు కాస్త  దూరమయ్యారు. ఈమె నటించిన బుల్లితెర సీరియల్స్ లో “క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ”(Kyunki Saas Bhi Kabhi Bahu Thi)అనే హిందీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సీరియల్ 2000 నుంచి 2008 వరకు ఎంతో అద్భుతమైన రేటింగ్ కైవసం సొంతం చేసుకొని ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక ఈ సీరియల్ లో స్మృతి ఇరానీ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈమె రాజకీయాలలో బిజీ అయిన నేపథ్యంలో  నటనకు దూరమయ్యారు.

ఒక్క ఎపిసోడ్..రూ.14 లక్షల రెమ్యూనరేషన్…

Advertisement

ఇక ప్రస్తుతం ఈమె తిరిగి ఇండస్ట్రీ వైపు అడుగులు వేయడంతో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న “క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ 2”  సీరియల్ ద్వారా మరోసారి స్మృతి ఇరానీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ సీరియల్ ప్రసారం అవ్వడమే కాకుండా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ సీరియల్ కోసం స్మృతి ఇరానీ తీసుకున్న రెమ్యూనరేషన్ (Remuneration) గురించి సోషల్ మీడియాలో వార్తలు సంచలనంగా మారాయి. ఈమె ఈ సీరియల్ ఒక్క ఎపిసోడ్ లో పాల్గొంటే సుమారు 14 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తోంది.

ఆదాయం కోసం పని చెయ్యొద్దు…

ఇలా ఒక సీరియల్ ఎపిసోడ్ కోసం 14 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు స్మృతి ఇరానికి నటనపరంగా, అభిమానులు ఎంతలా ఆదరిస్తున్నారో స్పష్టమవుతుంది. ఇప్పటికీ కూడా ప్రేక్షకులలో ఈమె పట్ల ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్మృతి ఇరానీ.. మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు ఎప్పుడు మనం ఖాళీగా ఉండకూడదని నిరంతరం ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని తెలిపారు. ఏదైనా పని చేసేటప్పుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చేయాలి తప్ప ఆదాయాన్ని ఆశించి పని చేస్తే మన లక్ష్యం నెరవేరదంటూ ఈ సందర్భంగా ఈమె అందరికీ స్ఫూర్తిని కలిగించే విషయాలను కూడా తెలియజేశారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మరోసారి సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా సీరియల్ కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ద్వారా కూడా వార్తల్లో నిలిచారు.

Also Read: Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×