E-Paper
Advertisement

Shiva jyothi: బేబీ జెండర్ రివీల్ చేసిన శివజ్యోతి… వీడియో వైరల్!

Shiva jyothi: బేబీ జెండర్ రివీల్ చేసిన శివజ్యోతి… వీడియో వైరల్!
Advertisement

Shiva jyothi: శివ జ్యోతి పరిచయం అవసరం లేని పేరు. న్యూస్ రీడర్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన ఈమె అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా యూట్యూబర్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇకపోతే శివ జ్యోతి నేడు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. శివ జ్యోతి గంగూలీను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇలా ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట పిల్లల కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నప్పటికీ సంతానం మాత్రం కలగలేదు. అయితే ఈమె సంతానం కోసమే 7 శనివారాల వ్రతం చేశానని తద్వారా తాను తల్లి కాబోతున్నాను అంటూ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

అమ్మాయికి జన్మనిచ్చిన శివ జ్యోతి..

ఇలా ఈమె తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు. ఇకపోతే నేడు శివ జ్యోతి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈమె డెలివరీ అయిన విషయాన్ని తెలియచేశారు కానీ పాప పుట్టిందా? లేదా బాబు పుట్టారా?అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఈ విషయానికి సంబంధించి శివ జ్యోతి మరొక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా తనకు అమ్మాయి (Baby Girl)పుట్టింది అనే విషయాన్ని తెలియజేశారు. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటూ శివ జ్యోతి దంపతులు తమకు పుట్టింది పాప అనే విషయాన్ని షేర్ చేయడమే కాకుండా ఈమె ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. నా వెంకటేశ్వర స్వామి ప్రసాదం.. నా స్వామి ఇచ్చిన మహాలక్ష్మి అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.

నా పుట్టినరోజున భగవంతుడు ఇచ్చిన కానుక..

Advertisement

ఇక తన పుట్టినరోజున ఈమె బేబీకి జన్మనివ్వడంతో తన పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు తనకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారని తెలిపారు. భగవంతుడు నాకు ఈ కానుక ఇవ్వడం కోసం చాలా పరీక్షించారని తాను ఎంతో సహనంతో ఎదురు చూశానని, కరెక్ట్ సమయానికే నాకు బేబీని ఇచ్చారని తెలిపారు. అలాగే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మొదటి నెల నుంచి అమ్మాయి పడుతుందని మనసు చెబుతున్నప్పటికీ నా మైండ్ మాత్రం కొడుకు పుడతాడేమో అని ఆలోచన కలిగించిందని తెలిపారు. అయితే డెలివరీకి రెండు రోజుల ముందు నా ఆలోచనలు మారిపోయాయని నాకు పుట్టేది అమ్మాయి అని భావించానని తెలిపారు.

?igsh=Mm1laWU4MmZma29k

Advertisement

అనుకున్న విధంగానే అమ్మాయి జన్మించడంతో ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నామని, మీ అందరి బ్లెస్సింగ్స్ తో పాప చాలా ఆరోగ్యంగా ఉంది అంటూ ఈమె తన బిడ్డ గురించి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా తనకు పాప పుట్టిందనే విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. శివ జ్యోతి పాప పుట్టిందని చెప్పినప్పటికీ పాప ఎలా ఉంటుంది అనేది మాత్రం రివీల్ చేయలేదు.

Also Read: Rajinikanth: శివరాత్రి ఎఫెక్ట్.. రజనీకాంత్ పోస్టర్ కు పాలాభిషేకం.. ప్రత్యేక పూజలు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×