E-Paper
Advertisement

పెళ్లితో ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన షణ్ముఖ్.. ఫోటోలు వైరల్!

పెళ్లితో ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన షణ్ముఖ్.. ఫోటోలు వైరల్!
Advertisement

Shanmukh:ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswant) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తో అమ్మాయిల మనసు దోచుకున్న ఈయన బిగ్ బాస్ తెలుగులో సందడి చేసి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత తన ప్రేయసి దీప్తి సునయన (Deepti Sunaina) తో విడిపోయి ఒంటరిగా ఇన్ని రోజులు కెరియర్ కొనసాగించిన షణ్ముఖ్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు .

సడన్గా నిశ్చితార్థం చేసుకొని సర్ప్రైజ్ ఇచ్చిన షణ్ముఖ్..

ఈ మేరకు ఫిబ్రవరి నెలలో వైష్ణవి (Vaishnavi ) అనే అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నట్లు అందరితో తెలియజేసి.. ఆమెను నిశ్చితార్థం చేసుకుని.. అభిమానులకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. వైష్ణవి అనే అమ్మాయితో షణ్ముఖ్ జశ్వంత్ నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షణ్ముఖ్ స్వయంగా షేర్ చేయడంతో ఆయన అభిమానులు షణ్ముఖ్ ,వైష్ణవి జంటకు శుభాకాంక్షలు తెలిపారు..

చెప్పా పెట్టకుండా పెళ్లితో షాక్ ఇచ్చిన షణ్ముఖ్..

Advertisement

ఇక త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పిన షణ్ముఖ్ సడన్ గా ఇప్పుడు పెళ్లి పీటలెక్కి అందరిని సర్ప్రైజ్ చేశారు. అయితే పెళ్లి అనౌన్స్మెంట్ చేయకుండా సడన్గా పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. పైగా ఈ పెళ్లి ఫోటోలు షణ్ముఖ్ జష్వంత్ షేర్ చేయలేదు. ఆయన పెళ్లికి వెళ్లిన ఆయన స్నేహితుడు , ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయడం వల్లే షణ్ముఖ్ వివాహం చేసుకున్నారనే విషయం స్పష్టమవుతుంది . ఏది ఏమైనా అభిమానులకి కూడా చెప్పకుండా షణ్ముఖ్ ఇలా పెళ్లి పీటలు ఎక్కడంతో అభిమానులు కాస్త హర్ట్ అవుతున్నామని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

క్లాసీ లుక్ లో ఆకట్టుకుంటున్న జంట..

షణ్ముఖ్ వైష్ణవి జంటకు సంబంధించిన ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గోల్డెన్ కలర్ షర్ట్ , ధోతీలో చాలా క్లాసిక్ గా షణ్ముఖ్ కనిపించగా.. అటు మెరూన్ రెడ్ శారీలో వైష్ణవి మహాలక్ష్మిలా అందంగా ముస్తాబయింది. ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.. ఏదిఏమైనా వైష్ణవి, షణ్ముఖ్ ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడంతో పలువురి సినీ సెలబ్రిటీలు , అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

ALSO READ:Tollywood: టాలీవుడ్ ఫీమేల్ యాంకర్స్.. ఎవరు ఎక్కువ చదువుకున్నారంటే?

ప్రేయసితో బ్రేకప్.. ఇప్పుడు మరో అమ్మాయితో పెళ్లి..

ఇకపోతే షణ్ముఖ్ తన ప్రేయసి దీప్తి సునయనతో దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రేమాయణం కొనసాగించారు. అప్పట్లో ఈ జంట షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది. పైగా రొమాంటిక్ సాంగ్స్ లో కూడా వీళ్ళిద్దరూ సందడి చేసేవారు. జంట అంటే ఇలా ఉండాలి అని అనుకున్న వాళ్లు బోలెడు మంది. అయితే 2021 సమయంలో బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సిరి హనుమంత్ రిలేషన్ పై వార్తలు తారాస్థాయికి చేరిపోయాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఎఫైర్ రూమర్స్ కూడా సృష్టించబడ్డాయి. దీంతో దీప్తి షణ్ముఖ్ మధ్య దూరం పెరిగి , ఆ దూరం కాస్త బ్రేకప్ వరకు వెళ్ళిపోయింది. 2022 జనవరి 1న దీప్తి, షణ్ముఖ్ నుంచి విడిపోతున్నట్లు పోస్ట్ పెట్టగా.. అటు షణ్ముఖ్ కూడా అధికారికంగా చెప్పేశారు. అయితే ఇప్పుడు షణ్ముఖ్ వైష్ణవి అనే మరో అమ్మాయిని ప్రేమించి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు.

–Vk66D/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×