E-Paper
Advertisement

Shanmukh Jaswant: షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య వైష్ణవి రియాక్షన్!

Shanmukh Jaswant:  షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య వైష్ణవి రియాక్షన్!
Advertisement

Shanmukh Jaswant: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswant) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. యూట్యూబర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ తో మరింత పేరు సొంతం చేసుకున్నారు. అయితే డాన్స్ వీడియోలతో విశేషంగా ఆకట్టుకున్న ఈయన .. ఇలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియాలో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్నారని చెప్పాలి.. ఇకపోతే ఆ ఇమేజ్ ను రెట్టింపు చేసింది బిగ్ బాస్ అనే చెప్పాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న షణ్ముఖ్ ఈ షో ద్వారా ఎంత పాపులారిటీ అయితే సంపాదించుకున్నారో అటు వ్యక్తిగత జీవితంలో అన్నే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కారణం ఈయన ప్రియురాలు దీప్తి సునయన(Deepti Sunaina) ఈయన నుంచి విడిపోవడమే.

దీప్తితో బ్రేకప్..

ఇకపోతే ఈ షోలో విన్నర్ కావాల్సిన వాడు రన్నరప్ గా నిలిచాడు. దీనికి కారణం బయట ఈయన ప్రియురాలు దీప్తి ఉండగానే ..షోలో మరొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సిరి హనుమంత్ తో కాస్త చనువుగా ఉండడమే. దీంతో వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొని ఫాలోవర్స్ ను కోల్పోయాడు. ఫలితంగా రన్నరప్ గా నిలిచాడు. ఇక బయటకు వచ్చాక ఈయనకు దీప్తి బ్రేకప్ చెప్పింది. ఇకపోతే ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న షణ్ముఖ్ , దీప్తి సునయన ఈ ఒక్క షో వల్ల తమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. ఇద్దరు కూడా సోషల్ మీడియా పోస్ట్లతో తమ బాధను వ్యక్తపరిచారు. ఇకపోతే దీప్తి తన బాధను వ్యక్తం చేసింది కానీ షణ్ముఖ్ అయితే ఈ విషయంపై పెద్దగా ఓపెన్ కాలేదు. దీనికి తోడు రిలేషన్ లో ఉన్నప్పుడు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ టాటూలు కూడా వేయించుకున్నారు. ముఖ్యంగా డి అంటే దీప్తి అని అర్థం వచ్చేలా షణ్ముఖ్ తన చేతిపై టాటూ వేయించుకున్న విషయం తెలిసిందే.

Advertisement

also read:Harish Shankar: పవన్ కళ్యాణ్ కి డూప్ గా హరీష్ శంకర్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

టాటూపై షణ్ముఖ్ కాబోయే భార్య రియాక్షన్..

ఇక బ్రేకప్ తర్వాత ఎవరికి వారు అంటూ బిజీగా గడిపేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా షణ్ముఖ్ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నాను అని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకొని అభిమానులను సర్ప్రైజ్ చేశారు.. అయితే ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న షణ్ముఖ్ తన చేతి పై ఉన్న టాటూని చూసి తన కాబోయే భార్య వైష్ణవి ఏం ప్రశ్నించలేదా అని ఎదురైన ప్రశ్నకు తనదైన సమాధానం ఇచ్చారు.

Advertisement

పెళ్లి తర్వాత ఈ టాటూ రిమూవ్ చేద్దామని అనుకున్నాను . కానీ నా కాబోయే భార్య వైష్ణవి..” అది మీ మెమొరీ కదండీ.. అది మీ ఇష్టం.. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయండి. నేనైతే చెప్పను.. నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను అంటూ చెప్పింది ” అని తన భార్య వైష్ణవి మాటగా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే అలాంటి అమ్మాయి దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు షణ్ముఖ్ చెప్పడంతో అభిమానులు కూడా నిజంగా అర్థం చేసుకునే అమ్మాయి మీ జీవితంలోకి రావడం మాకు సంతోషంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా అసలైన సోల్ మేట్ ను షణ్ముఖ్ సొంతం చేసుకున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×