E-Paper
Advertisement

Serial Actress : సీరియల్స్ లలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా..? నిజాలను బయటపెట్టిన నటి..

Serial Actress : సీరియల్స్ లలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా..? నిజాలను బయటపెట్టిన నటి..
Advertisement

Serial Actress : సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య క్యాస్టింగ్ కౌచ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఒకప్పుడు వీటి గురించి మాట్లాడాలంటే చాలామంది భయపడే వాళ్ళు. తమ కెరియర్ ఎక్కడ నాశనం అయిపోతుందేమో అని టెన్షన్ పడుతూ కొన్నిటిని భరించేవారు.. అయితే అప్పట్లో కాస్టింగ్ కౌచ్ అనేది పెద్దగా వినిపించలేదు. కానీ ఈ మధ్య మాత్రం సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న యాక్టర్స్ తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం సినిమాలలో మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ సీరియల్స్లలో కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని చాలామందికి తెలియదు. తాజాగా ఓ బుల్లితెర నటి యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది.. అందులో దీని గురించి ప్రస్థావించింది. ఆమె మరెవ్వరో కాదు ప్రత్యూష పొన్నపల్లి..బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు సీరియల్స్ లలో నటించిన ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.

క్యాస్టింగ్ కౌచ్ నిజమేనా..? 

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ లలో నటిస్తున్న నటీనటులు కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నారని ఈ మధ్య పలువురు సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది. తాజాగా బుల్లితెర యాక్టర్ ప్రత్యూష పొన్నపల్లి ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.. ఈ సందర్బంగా ఆమెను సీరియల్స్ కు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందా అని అడుగుతారు. దానిపై మాట్లాడిన ఆమె నాకు తెలిసి లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి అవుతుంది. బహుశా ఎవరికైన గ్రోత్ కోసమో, లేదా మనీ కోసమో అలా కమిట్ అవుతారేమో తెలియదు. మాకు ఎప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురవ్వలేదని చెప్పింది.

కన్నడ యాక్టర్స్ పై షాకింగ్ కామెంట్స్.. 

Advertisement

తెలుగు బిగ్ బాస్ లో కన్నడ యాక్టర్ కు ట్రోపీని ఇచ్చారని ట్రోల్స్ వినిపించాయి.. ఈ మధ్య తెలుగు సీరియల్స్ లో కన్నడ స్టార్స్ రాక ఎక్కువైందని టాక్ వినిపిస్తుంది. నిజమేనా..? తెలుగు వాళ్లకు అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు? అన్న ప్రశ్నలు ఆమెకు ఎదురయ్యాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ.. కొత్త వాళ్లకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది.. నిర్మాతలు ఏమి చెబితే డైరెక్టర్స్ అవే చేస్తారు. తెలుగులో కూడా చాలా మంది పాపులర్ స్టార్స్ ఉన్నారు. వారికి అవకాశాలు ఇచ్చి కుటుంబాలను కాపాడండి అని ఆమె విజ్ఞప్తి చేసింది..ఇప్పటికే ఎంతోమంది ఈ విషయం పై మాట్లాడారు. మరి ఇప్పటికైన తెలుగు వాళ్లకు అవకాశాలు ఇస్తారేమో చూడాలి…

ప్రత్యూష సీరియల్స్.. 

తెలుగు బుల్లితెర నటి ప్రత్యూష పొన్నపల్లి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఎన్నో సీరియల్స్ లలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె నటించిన సీరియల్స్ లలో సీతా మహాలక్ష్మి, మా ఇంటి దేవత వంటి ఎన్నో సీరియల్స్ లలో నటించి ఫెమస్ అయ్యింది. కొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×