E-Paper
Advertisement

Krishna Kaushik : బిగ్ బాస్ భరణి గురించి సంచలన విషయాలు బయటపెట్టిన కౌశిక్

Krishna Kaushik : బిగ్ బాస్ భరణి గురించి సంచలన విషయాలు బయటపెట్టిన కౌశిక్
Advertisement

Krishna Kaushik : చాలా తెలుగు సీరియల్స్ లో నటించి తనకంటూ మంచి పేరు సాధించుకున్నాడు కృష్ణ కౌశిక్. నటుడు బాలాదిత్య కు కృష్ణ కౌశిక్ అన్నయ్య అవుతారు. సీరియల్స్ లో నటించడం వలన భరణి తో కూడా దాదాపు 24 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఈ తరుణంలో రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భరణి గురించి ఆసక్తికర విషయాలు బయటకు చెప్పారు కృష్ణ కౌశిక్.

ఈరోజు భరణి శంకర్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే కారణం తనకు తానుగా ఇదంతా నిర్మించుకున్నాడు. వాడి కష్టానికి వాడు సంపాదించిన స్థాయికి తరువాత చాలా ఆడ్ అయ్యాయి. వీడి జర్నీలోనే నాగబాబు గారు పరిచయం అవ్వటం ఇవన్నీ తర్వాత జరిగాయి.

బిగ్ బాస్ కి వెళ్లడానికి నాగబాబు కారణం కాదు

Advertisement

చాలామంది బిగ్ బాస్ కి భరణి వెళ్లడానికి కారణం నాగబాబు అని అనుకుంటారు. లేదు వాడు సొంతంగానే ఆ స్థాయిని సంపాదించుకున్నాడు. ఇలా మొన్న జరిగిన ఫ్యామిలీ వీక్ నాగబాబు గారు వచ్చినట్లు అలా వస్తుంటారు అంతే. వీడు మెంటాలిటీ వీడి మనస్తత్వం నచ్చి చాలామంది వీడికి దగ్గరయ్యారు.

2002 నుంచి 2005 టైం లో నేను సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు, ఆ టైంలో భరణి ఇండస్ట్రీకి వచ్చాడు. అప్పటికే సత్య అనే ఒక సీరియల్ చేసి ఈ సీరియల్ కి వచ్చాడు. ఒక సీరియల్ జరుగుతున్నప్పుడు మా ఇద్దరికీ మధ్య బాగా క్లోజ్ బాండింగ్ ఏర్పడింది. మా ఫ్రెండ్ షిప్ భరణి గారు దగ్గర నుంచి ఏరా వరకు వచ్చింది.

భరణి చాలా హానెస్ట్

Advertisement

భరణి చాలా హానస్ట్. నేను ఒక ఎలక్షన్ కి నిలబడినప్పుడు నాకు ఆపోజిట్ పర్సన్ హరి అనే ఒక వ్యక్తి నాగబాబుకి చిరంజీవికి బాగా క్లోజ్. భరణి నాకు క్లోజ్ ఫ్రెండ్ మరోవైపు నాగబాబు గారితో ఎంత బాండింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సింది అవసరం లేదు. ఆ టైంలో తన సపోర్ట్ నాకు నా టీంకు ఉండదు అని ఫోన్ చేసి మరి సారీ చెప్పాడు.

అయితే నా ప్రెసిడెంట్ ఓటు మాత్రం నీకే వేస్తాను నీ టీం కి మాత్రం నా సపోర్ట్ ఉండదు అని చాలా హానస్ట్ గా చెప్పాడు. అంతేకాకుండా నాగబాబు అన్నయ్యతో ఆల్రెడీ చెప్పేశాను నా ప్రెసిడెంటు మాత్రం కౌశిక్ వేస్తాను కానీ వాళ్ళ టీం కి నేను సపోర్ట్ చేయను అని చెప్పాడు. తర్వాత కలిసిన సందర్భాల్లో కూడా చాలాసార్లు సారీ చెప్పాడు.

ఈమధ్య భరణి కొన్ని బంధాల్లో ఇరుక్కుపోతున్నాడు కానీ ఈ వారం చాలా పరిస్థితులు మారుతాయి మళ్లీ ఏక్ నిరంజన్ అయిపోతాడు. వాడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాడు. ఫ్రెండ్ గా వాడి గురించి నాకు తెలుసు. అంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు కౌశిక్.

Also Read: Krishna Kaushik : బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నా తమ్ముడు బాలాదిత్య తేరుకోలేకపోయాడు

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×