E-Paper
Advertisement

Actress Bhavana: బిగ్ బాస్ పై నటి భావన షాకింగ్ కామెంట్స్.. పుసుక్కున అలా అనేసిందేంటి..?

Actress Bhavana: బిగ్ బాస్ పై నటి భావన షాకింగ్ కామెంట్స్.. పుసుక్కున అలా అనేసిందేంటి..?
Advertisement

Actress Bhavana: బుల్లితెర ప్రేక్షకులకు నటి భావన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె వరుసగా అవకాశాలు అందుకుంటూ ఎన్నో సినిమాలు,  సీరియల్స్లలో నటించింది.. స్టార్ హీరోల చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈమె తెలుగులో మాత్రమే కాదు. అటు తమిళంలో కూడా పలు సీరియల్స్లలో నటించింది. వయసు పెరుగుతున్న తరగని అందంతో ఇప్పటికీ సీరియల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.. భావన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ గురించి ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది.. అసలు భావన బిగ్ బాస్ గురించి ఏం చెప్పిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

బిగ్ బాస్ తర్వాత జరిగేది ఇదే..

గతంలో భావన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా ఆమెను బిగ్ బాస్ గురించి ప్రశ్న అడిగారు. ఇంత క్రేజ్ ఉన్న భావన బిగ్ బాస్ ఆఫర్ ని ఎందుకు రిజెక్ట్ చేసింది అని అడిగారు. ఆమె మాట్లాడుతూ.. నేను చాలా సెన్సిటివ్.. ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా బాగా రియాక్ట్ అయిపోతూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే ఇంత బతుకు బతికి ఇంటివెనుక చావడం ఎందుకు అని నేను బిగ్ బాస్ కి వెళ్ళలేదు అని ఆమె అన్నారు.. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు మనము నెక్స్ట్ లెవెల్ కు ప్రమోట్ అవ్వడానికి వేరే వాళ్ళని దూషించడం, లేదంటే వాళ్లపై మాటలు యుద్ధం చేయడమో చేస్తుంటాము.. గేమ్లో ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నప్పుడు ఆ మాటలు గుర్తుండిపోతాయి. అందుకే నేను బిగ్ బాస్ కి వెళ్ళాలని అనుకోలేదని భావన అన్నారు. రియాల్టీ షోలు చేయడం కన్నా సీరియల్స్ చేస్తూ జనాలని ఎంటర్టైన్ చేయడం నాకు ఇష్టం అని ఆమె తేల్చి చెప్పేశారు. ఇది ఓల్డ్ ఇంటర్వ్యూ వీడియో అయినా కానీ ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది.. బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. భావన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Also Read : ప్రేమలో పడ్డ చిట్టి..ఇదేం ట్విస్ట్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

భావన కెరీర్ విషయానికొస్తే.. 

ఈ ముద్దుగుమ్మ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాలనటిగానే ‘కుట్ర’ సినిమాలో స్థానం సంపాదించింది. ఆ తర్వాత భారతంలో బాలచంద్రుడు, లాయర్ సుహాసిని, రాజేశ్వరి కళ్యాణం లాంటి సినిమాల్లో నటించింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్ వంటి హీరోల సినిమాల్లో కూడా నటించింది. తెలుగు బుల్లితెర మీద ‘సంధ్య’ సీరియల్‌తో పరిచయం అయ్యింది. అందం సీరియల్ కు మంచి పేరు వచ్చింది.. ఆ తర్వాత ఆత్మకథలు, పుత్తడి బొమ్మ, ప్రియమైన శత్రువు, స్నేహ, నా మొగుడు నాకే సొంతం, భాగవతం, సుఖదు:ఖాలు, సీతామహాలక్ష్మీ లాంటి ఎన్నో సీరియళ్లలో నటించింది.. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు సినిమాలలో కూడా నటించింది. ఇక డాన్స్ షోలు కూడా చేసింది. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్లలో తల్లి పాత్రలో నటిస్తూ వస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×