E-Paper
Advertisement

Seethe ramudi katnam Serial Today Episode: మహాకు వార్నింగ్‌ ఇచ్చిన మధు – మహాను అరెస్ట్‌ చేసేందుకు ఇంటికి వచ్చిన పోలీసులు

Seethe ramudi katnam Serial Today Episode: మహాకు వార్నింగ్‌ ఇచ్చిన మధు – మహాను అరెస్ట్‌ చేసేందుకు ఇంటికి వచ్చిన పోలీసులు
Advertisement

Seethe Ramudi Katnam Serial Today September 18th Episode: ఆపరేషన్‌ గురించి పది లక్షల గురించి సీతకు కాల్‌ చేశానని మధు చెప్పగానే మహా షాక్‌ అవుతుంది. సీత అంత డబ్బు ఎలా సర్దుతుంది అనుకున్నావు మధు అంటూ మహా అడగ్గానే ఎలాగైనా సర్దుతుందని అడిగాను అంటుంది మధు. అయితే సర్దడానికి సీత ఇక్కడ ఏం పని చేస్తుందని. తనకు డబ్బుల  ఎక్కడి నుంచి వస్తాయి. అయినా నన్ను పెట్టుకుని సీతను డబ్బులు అడగడం ఏంటి..? అనగానే మధు కోపంగా ఇంకోసారి ఆ మాట అన్నారంటే మర్యాద ఉండదు. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం అయింది. ఇక్కడ నా కాపురం నాశనం చేసుకుని అక్కడ సీత కాపురంలో నిప్పులు పోయమంటారా? అని తిడుతూ మహాకు వార్నింగ్‌ ఇస్తుంది మధు.

కోపంలో నిజం చెప్పిన మహాలక్ష్మీ

Advertisement

కోపంగా మహా ఫోన్‌ పగులగొట్ట బోతుంటే అర్చన వచ్చి ఆపుతుంది. అది సీత ఫోన్‌ అంటుంది. ఎందుకు అంత కోపం అని అర్చన అడగ్గా.. మధు మాట్లాడిన విషయం చెప్తుంది. సీత కోసం ఫోన్‌ చేసి నాతో పొగరుగా మాట్లాడింది. ఒకప్పుడు నేను చెప్పినట్టు వినేది ఇప్పుడు నన్ను లెక్కచేయడం లేదు. దాన్ని నా కోడలు చేసుకోవాలని ఎంతో ఆశపడ్డాను. దానికి పెళ్లైన సరే అదే నా కోడలు కావాలని వెంట పడ్డాను. అది సూర్యతో యాక్సిడెంట్‌ చేసి వాడి కాలు పోగొట్టాను. అని మహా చెప్పగానే సీత షాక్‌ అవుతుంది. సూర్య కాలు పోగోట్టింది నువ్వా మహా అని అర్చన అడగ్గానే కాలు పోగోట్టిందే కాదు. వాణ్ని డ్రగ్స్‌ కేసులో ఇరికించి జైలుకు పంపించింది నేనే అంతా చేసి మధును ఇక్కడికి తీసుకొచ్చి నాకు కాబోయే కోడలుగా ట్రీట్‌ చేస్తే ఇప్పుడు అది నన్నే తిడుతుంది. అని చెప్పగానే అర్చను మధును తిడుతుంది.

రెండో అత్తకు బుద్ది చెప్పాలనుకున్న సీత

Advertisement

ఇది నమ్మకద్రోహం. నిన్ను మోసం చేసిన ఆ మధు ఏం బాగుపడుతుందిలే అంటుంది. దీంతో  సూర్యకు ఆఫరేషన్‌ కోసం సీతకు ఫోన్‌ చేసిందట. ఆ డబ్బులు నేను ఇస్తాను నేను చెప్పినట్లు చేయ్‌ అంటే నా చెల్లెలుకు ద్రోహం చేయలేనని నీతులు చెప్తుంది అని మహా చెప్తుంది. తర్వాత ఫోన్‌ అక్కడే పెట్టి వెళ్లిపోతారు. చాటు నుంచి అంతా విన్న సీత అక్కడికి వచ్చి ఫోన్‌ తీసుకుని ఎంత దారుణం చేశావు అత్తా నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. మా బావకు కాలు లేకుండా చేయి మా అక్కను బాధపెడుతున్నావా? నీకు తగిన బుద్ది చెబుతాను అని మనసులో అనుకుంటుంది సీత.

మధును కించపరిచిన జలజ

మరోవైపు దిగాలుగా కూర్చున్న మధు దగ్గరకు జలజ వస్తుంది. మీ అమ్మానాన్న డబ్బులు ఇచ్చారా? అని వెటకారంగా అడుగుతుంది. నీ తల మీద వంద రూపాయలు పెట్టినా పది రూపాయలు కూడా చెల్లవు అంటూ వెక్కిరిస్తుంది. చెల్లి డబ్బులు ఇస్తుంది. తల్లి డబ్బులు ఇస్తుంది అని పనికిమాలిన ఆలోచనలు ఆపేసుకో.. అని తిడుతుంది. ఇంతలో సూర్య వస్తాడు. జలజను తిడతాడు. నేను బయట నుంచి అంతా విన్నాను. మధు నాకోసం చేయాల్సింది అంతా చేస్తుంది అని సూర్య అనగానే ఏం చేసింది. అదే వేరే ఎవరినైనా చేసుకుని ఉంటే ఎంత కట్నం వచ్చేది అంటుంది. దీంతో సూర్య జలజకు వార్నింగ్‌ ఇచ్చి మధును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో సూర్య వాళ్ల అన్నయ్య వచ్చి అంతా వింటాడు. జలజను కొడతాడు. ఎందుకు కొట్టారు మీరు అంటూ జలజ అడగ్గానే మధును నువ్వు ఎంత తిట్టావో నేను విన్నాను అంటాడు.

Also Read: విశాల్‌ కోసం వచ్చిన విశాలాక్షి – భుజంగమణి కోసం సుమన ప్లాన్‌

మధును ఓదార్చిన సూర్య

లోపలికి వెళ్లిన మధు, సూర్యకు సారీ చెప్తుంది. నేను నీకోసం ఏం చేయలేకపోతున్నాను అంటూ బాధపడుతుంది. దీంతో ఆపరేషన్‌కు డబ్బు లేకపోయినా నాకు కాలు లేకపోయినా నీ ప్రేమ తగ్గదు కదా? అంటూ మధును ఓదారుస్తాడు సూర్య. దేవుడా ఒక్క అవకాశం ఇవ్వు డబ్బులు దొరికే చాన్స్‌ ఇవ్వు అని మనసులో వేడుకుంటుంది.

మహాను అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన శివకృష్ణ

మరోవైపు శివకృష్ణ, డ్యూటిలో భాగంగా మహా వాళ్ల ఇంటికి వస్తాడు. శివకృష్ణను చూసిన రామ్‌ రండి మామయ్యా అని పిలుస్తాడు. దీంతో నేను ఇప్పుడు మామయ్యగా రాలేదు రామ్‌ డ్యూటీ చేయడానికి వచ్చాను అని చెప్పి మహాలక్ష్మీని పిలుస్తాడు. ఎందుకు మహాలక్ష్మీని పిలుస్తున్నారు అని అడగ్గానే ఆవిడ రానివ్వండి చెప్తాను అంటాడు శివకృష్ణ. ఇంతలో మహా కిందకు వస్తుంది. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు. అయినా యూనిఫామ్‌ లో వచ్చారేంటి అని అడగ్గానే నిన్ను అరెస్ట్‌ చేయడానికి వచ్చాను అని శివకృష్ణ చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. గతంలో మహా చేసిన నేరం తెలిసిందని అది సూర్యను మీరే యాక్సిడెంట్‌ చేయించిన కేసు ఉందని శివకృష్ణ చెప్పగానే మహా షాక్‌ అవుతుంది.

శివకృష్ణను నిలదీసిన సీత

ఇంతలో సీత వచ్చి ఈ ఇంటి కోడలిగా అడుగుతున్నాను. మాఅత్తయ్య  ఏం నేరం చేసిందని అరెస్ట్‌ చేస్తున్నారు.. మీ దగ్గర సాక్ష్యం ఉందా? మా అత్తయ్యా క్రిమినల్‌ కాదు. తనకంటూ పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఎవరో ఏదో వాగితే మా అత్తయ్య ఇంటికి వచ్చి తనను అరెస్ట్‌ చేస్తారా? అంటూ సీత నిలదీయడంతో మహా, అర్చన, గిరి  షాక్‌ అవుతారు. ఇంతటితో ఇవాళ్టీ సీతే రాముడి కట్నం సీరియల్‌ ఎపిసోడ్‌ ముగుస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×