E-Paper
Advertisement

Seethe Ramudi Katnam Serial Today Episode: మహాలక్ష్మీని మీడియా ముందు ఇరికించిన సీత – సీత మాటలకు అర్చన షాక్‌

Seethe Ramudi Katnam Serial Today Episode: మహాలక్ష్మీని మీడియా ముందు ఇరికించిన సీత – సీత మాటలకు అర్చన షాక్‌
Advertisement

Seethe Ramudi katnam Serial Today Episode:  ఇలాంటి పేరు షాపుకు పెడతారా? అన్న మహాలక్ష్మీ మాటలకు..  సీత కొన్ని సినిమాల  పేర్లు, సీరియల్స్  పేర్లు చెప్పి అవన్నీ హిట్‌ అయినప్పుడు నేను షాపుకు పెట్టిన పేరు ఎందుకు హిట్‌ అవ్వదు అంటుంది. దీంతో రామ్‌ నీ ఐడియా బాగుంది సీత. సీరియల్స్‌ , సినిమాలు హిట్‌ అయినప్పుడు షాపు కూడా హిట్ అవుతుంది అంటాడు.

షాపు ముందు మహాలక్ష్మీ కటౌట్ పెట్టించిన సీత

Advertisement

దీనికే సర్‌ప్రైజ్‌ అయిన మీ అందరికీ మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉంది అని చెప్పి అది జనార్ధన్‌ మామయ్య ఓపెన్‌ చేస్తారు. రండి మామయ్యా ఓపెన్‌ చేయండి అనగానే జనార్ధన్‌ ఓపెన్‌ చేయాడికి వెళ్తాడు. అర్చన షాపు పేరుతో షాక్‌ ఇచ్చింది. ఇప్పుడేం షాక్‌ ఇస్తుందో మహాతల్లి అనుకుంటుంది. జనార్ధన్‌ చేత మహా కటౌట్‌ ఓపెన్‌ చేయిస్తుంది సీత. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇప్పుడు రెండు నిమిషాలు బ్రేక్‌ తర్వాత షాపు ఓపెనింగ్‌ చేద్దామని రామ్‌ ను తీసుకుని లోపలికి వెళ్తుంది.

మహాలక్ష్మీ ని ఆకాశానికి ఎత్తిన సీత

Advertisement

 తర్వాత మహా, అర్చన, గిరి షాపు పక్కన కూర్చుని సీత ఇస్తున్న షాకుల గురించి మాట్లాడుకుంటుంటారు. ఇంతలో సీత జ్యూస్‌ తీసుకుని వస్తుంది. నా షాపునకు బ్రహ్మాండమైన పేరు కుదిరింది. ఈ పేరు త్వరలోనే ఫేమస్‌ అవుతుంది. ఈ దెబ్బతో నేను మీ కోడలిని అని మొత్తం సిటీ తెలిసిపోతుంది అనగానే ఈ షాపుకు ఈ పేరు పెట్టమని నీకు ఎవరు చెప్పారు అంటూ మహా కోపంగా అడుగుతుంది. మీరే చెప్పారు అత్తయ్యా అంటూ సీత చెప్పడంతో మహా షాక్‌ అవుతుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఏ కోడలు కూడా ఇలా అత్తగారిని వాడి ఉండరు అని సీత చెప్తుంది. నాకు పైసా ఖర్చు లేకుండా మీ వల్లే ఫ్రీగా పబ్లిషిటీ వచ్చింది. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఫ్యాషన్‌ కావాలనుకునే ఆడవాళ్లకు మీరే రోల్‌ మోడల్‌. మీరు మీ ఫిగరు ఏమన్నా ఉన్నారా? మెరుపుతీగలా..? కత్తిలా ఉన్నారు. మీ ముందు ఏ సినిమా హీరోయిన్‌ కూడా పనికిరాదు. ఇప్పుడు మీరు సినిమాల్లోకి వెళ్లినా టాప్‌ హీరోయిన్‌ అయిపోతారు అంటూ సీత, మహాను ఆకాశానికి ఎత్తుతుంది. ఇంతలో రామ్‌ వచ్చి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి సీత ఇక ఓపెనింగ్‌ చేద్దాం అంటాడు.

మహాలక్ష్మీ చేత బోణీ చేయించిన సీత

అందరూ రాగానే మహాలక్ష్మీ రిబ్బన్‌ కటింగ్‌ చేసి షాపు ఓపెన్‌ చేస్తుంది. రామ్‌, సీతకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్తాడు. మహాను లోపలికి పిలిచి లక్ష్మీదేవి ముందు పూజ చేయమని చెప్తుంది. దీంతో మహా దీపం వెలిగించి పూజ చేస్తుంది.  కొబ్బరి కాయ కొట్టి హారతి ఇస్తుంది. అక్షింతలు వేసి దీని బట్టల వ్యాపారం బజారున పడాలి అని మనసులో తిట్టుకుంటుంది మహాలక్ష్మీ. ఓపెనింగ్‌ కు వచ్చిన మహిళలు లోపలికి వెళ్లి చీరలు చూసి బాగున్నాయి అని ఎగబడి కొంటుంటారు. ఇంతలో జనార్ధన్‌ ఇక మేము వెళ్ళోచ్చా అంటాడు. దీంతో సీత బోణి చేసి వెళ్లండి మామయ్యా అంటుంది. లోపలికి వెళ్లి అత్తయ్య కోసం ప్రత్యేకంగా చీర తెప్పించానని ఈ తొలి చీర మీరే కొనాలని అడుగుతుంది. రామ్‌ కూడా ఈ తొలి చీర మీరే కొనాలని అడుగుతాడు. దీంతో మహా సరే అలాగే కొంటానని రేటు ఎంతని అడగ్గానే జస్ట్‌ అరవై వేలే అంటుంది సీత. రేటు విన్న మహా షాక్‌ అవుతుంది.  జనార్థన్‌ కూడా తొలి బేరం నువ్వే చేసి సీతకు డబ్బులు ఇవ్వు అంటాడు. అర్చన ఈ చీర రేటు అంత ఉండదు అక్కా అని మహాతో గుసగుసలాడుతుంటే ఏంటి చిన్నత్తయ్యా నీకు చీర ఇవ్వలేదని బాధపడుతున్నారా? అంటూ మీకు ఒక చీర తెప్పించానని ఒక చీర తీసుకొచ్చి ఇది జస్ట్‌ ఇరవై వేలే అంటుంది. ఇంతలో జనార్ధన్‌ డబ్బులు తీసి మహాకు ఇవ్వగానే మహా ఆ డబ్బులు సీతకు ఇస్తుంది. సీత ఆ డబ్బులు రామ్‌ కు ఇస్తూ గల్లా పట్టెలో వేయమంటుంది.

Also Read: మారువేషంలో వచ్చిన గజగండ, గంటలమ్మ – గాయత్రి పాప దెబ్బకు హడలిపోయిన గజగండ

ఓపెనింగ్‌ కవరేజీకి వచ్చిన మీడియా

ఇంతలో మీడియా వాళ్లు వస్తారు. వాళ్లను చూసి రామ్‌ వీళ్లు వచ్చారేంటి ఎవరు పిలిచారు అని అడుగుతాడు. సీత నేనే పిలిచానని చెప్తుంది. దీంతో మహాలక్ష్మీ షాక్‌ అవుతుంది. ఇది చేసే బోడి బట్టల వ్యాపారానికి మళ్ళీ టీవీ ఒకటి అని ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది మహా. జనార్ధన్‌ మాత్రం  సీత తెలివిగా ప్లాన్‌ చేసింది తన బిజినెస్ మైండ్‌ కు హ్యాట్సాప్‌ అంటాడు. దీంతో అర్చన అన్ని చావు తెలివితేటలు బావగారు. పల్లెటూరి బుద్దులు ఎక్కడికి పోతాయి అంటుంది. మీడియాను పిలుస్తున్నట్టు ముందే చెప్పకుండా మనల్ని మోసం చేసింది అంటూ బాధపడతాడు గిరి.

ఒకర్ని ఒకరు పొగడ్తలతో ముంచెత్తుకున్న అత్తాకోడళ్లు

 తర్వాత మీడియా ముందుకు వెళ్లిన సీత. తనకు మహాలక్ష్మీ గారే ఆదర్శం అని చెప్తుంది. తన కోడలు అవ్వడమే నేను చేసుకున్న పుణ్యం అంటుంది. దేశంలో ఉన్న కోడళ్లు అందరికీ మా అత్తయ్య గారి లాంటి అత్తలు ఉంటే అందరూ చాలా బాగా పైకెదుగుతారు. అని చెప్తూ.. ఇప్పుడు మా అత్తయ్యగారు మాట్లాడతారు అని చెప్పగానే మహా వెళ్లి సీతను మెచ్చుకుంటుంది. నా కోడలు సీత మహిళా సాదికారతను సాధిస్తుందని నేను ప్రోత్సహిస్తున్నాను అంటుంది మహాలక్ష్మీ. దీంతో సీత మా అత్తగారిని మా షాపును, ఆ బోర్డులను టీవీలలో బాగా చూపించాలని మీడియా వాళ్లకు చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ సీతే రాముడి కట్నం సీరియల్‌ ఎపిసోడ్‌ ముగుస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×