E-Paper
Advertisement

Satyabhama Today Episode: మహదేవయ్యకు సత్య కౌంటర్.. బయటపడ్డ మైత్రి నిజ స్వరూపం.. క్రిష్ శోభనంకు గ్రీన్ సిగ్నల్..

Satyabhama Today Episode: మహదేవయ్యకు సత్య కౌంటర్.. బయటపడ్డ మైత్రి నిజ స్వరూపం.. క్రిష్ శోభనంకు గ్రీన్ సిగ్నల్..
Advertisement

Satyabhama Today Episode October 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. నందిని మైత్రి తనకన్నా ముందే పూజ చెయ్యడంతో కోపంతో రగిలి పోతుంది. ఇక క్రిష్ తన శోభనం కోసం సత్య పెట్టిన కండిషన్స్ తలచుకొని బాధపడుతుంటారు. ఈ తెలుగు మాసాలా గురించి ఎవరిని అడగాలి అని అనుకుంటాడు. అప్పుడే ఎదురుగా బామ్మ ఉంటుంది. ఈ ముసలిదానికి అన్ని తెలుసు.. దీన్ని అడుగుతే శోభనం జరుగుతుందని వెళ్తాడు.. ఎలాగో బామ్మ ద్వారా నిజం తెలుసుకుంటాడు. అర్జునుడుకు మరో పేరు పాల్గుణ అంటే మార్చి నెల అంటుంది. కనిపెట్టాను నీ పుట్టినరోజు మార్చిలో అంటాడు క్రిష్ . ఇక శోభనంకు రెడీ అంటాడు.. సత్య తన పుట్టిన డేట్ ను కనుక్కోమని క్రిష్ కు చెబుతుంది. ఇక క్రిష్ రేపు కనుక్కొని వస్తాను రేపు ఇక శోభనం జరిగిపోవాలి అంటాడు. ఇక అప్పుడు తన ఫ్రెండ్ తో కలిసి హాస్టల్ దగ్గరకు వెళ్తాడు.. ఇక సత్య భైరవి, రేణుక శారీస్ కొనడానికి చూస్తారు. అప్పుడు సత్య మహాదేవయ్యకు చురకులు అంటిస్తుంది. అందరు డౌట్ గా చూస్తారు. ఇక అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రేణుక సీమంతం కోసం అందరు చీరలు చూస్తారు. రేణుక సంతోషంగా ఉందని సత్య అనుకుంటుంది. ఇక సత్య అందరు అక్కడే ఉండటంతో మహదేవయ్య గుట్టు బయట పెట్టేందుకు ప్లాన్ వేస్తుంది.. ఈ సంతోషం క్రిష్ కు పుట్టబోయే పిల్లల మీద ఉంటుందా అంటుంది. అప్పుడు భైరవి ఏందీ అట్లా అంటున్నావు.. నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసి మీ మామ ఎంతాగానం డ్యాన్స్ చేశాడో మర్చిపోయావా.. అలా కాదు.. ఆలూ లేదు సులూ లేదు.. గానీ అప్పుడే ఆస్తి పంపకాల వరకు వెళ్ళావా అంటుంది. ఆస్తుల గురించి కాదు అంటుంది. వేరే కాపురం పెట్టాలని అనుకున్నావా నువ్వే అడిగావు అని రుద్ర సత్యను అంటాడు.. అది కాదు నా బిడ్డకు ఇదే సంతోషం ఉంటుంది. ఆ సంతోషంలో వాటా లేదా అంటుంది. దానికి భైరవి నువ్వు ముందు వారసుడును అయితే కను మీ మామ సంతోషం ఎలా ఉంటుందో చూడు అంటుంది. ఆ వారసుడు త్వరలోనే వస్తాడు. తాతయ్య మీసాలు పట్టుకొని ఆడుకుంటాడు. అని సత్య అంటుంది. ఇక సత్య మాటలకు మహదేవయ్య ఈ తాత మామూలోడు కాదు మీసాలు పట్టుకొని ఆదుకోవడానికి అని వెళ్ళిపోతాడు.

Advertisement

ఇక మైత్రిని శృతి దగ్గర డ్రాప్ చేస్తాడు. శృతి మైత్రి జాగ్రత్త నేను ఆఫీస్ నుంచి రిటన్ వచ్చినప్పుడు తీసుకొని వెళ్తాను అంటాడు. దానికి శృతి అలాగే అంటుంది. ఇక మైత్రి శృతి ఇద్దరు నవ్వుకుంటారు. పాపం పిచ్చోడే అంటుంది. నా హర్షను పిచ్చోడు అంటే ఊరుకోను అని మైత్రి అంటుంది. అతనికి పెళ్ళై పోయింది. న్రే ప్రేమ ఇంకా ఉంటుందా అని అంటుంది. నాకు ఆ దేవుడు అన్యాయం చేశాడు. నాకు ఇష్టమైన తల్లీ దండ్రులను దూరం చేశాడు. అది మర్చిపోలేను. ఇప్పుడు నాకు ఇష్టమైన నా హర్ష ను వదులుకొను.. దాదాపు పెళ్లి పీటలు వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు నందినికి పీకల వరకు కోపం ఉండేలా చేశాను.. ఎప్పుడైనా దూరం అవ్వొచ్చు.. నా హర్షకు నేను మళ్లీ దగ్గరవుతాను. ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇంట్లోకి అడుగు పెట్టాను అని చెబుతుంది. నాకు హర్షతో ఎప్పుడైనా పెళ్లి అవ్వొచ్చు. ఇంటిని అమ్మాలి. డబ్బులు అవసరం అవుతాయి. బ్రోకర్ ను చూడమని చెబుతుంది..

ఇక క్రిష్ సత్య ఫ్రెండ్ రూమ్ ను కనిపెట్టెందుకు రాత్రి ముసుగులో హాస్టల్ కు వెళ్తాడు. వాచ్ మెన్ చూడకుండా దొంగల చూస్తారు. ఎవరో వచ్చినట్లు ఉన్నారని ఓ అమ్మాయి సెక్యూరిటీకి చెబుతుంది. అతను వెతుకుతూ వస్తాడు. క్రిష్ అతని నుంచి పరిగెత్తుతూ సత్య ఫ్రెండ్ ను గుద్దుకుంటాడు. ఆమె సత్య ఫ్రెండ్ అని తెలుసుకొని అక్కడి నుంచి తెలుసుకొని ఉడాయిస్తాడు.. ఇక రేణుక తనకు కొన్న చీరలను చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే సత్య వస్తుంది. చాలా బాగుందని చెబుతుంది. నాకు నీ వల్లే ఈ సంతోషం వచ్చింది. నాకు కాన్పు సమయంలో నా పుట్టింటి వాళ్లు వస్తారని నమ్మకం లేదు.. నువ్వే నాకు చెల్లి అయిన తళ్ళైన అని ఎమోషనల్ అవుతుంది. సత్య ఓదారుస్తూ ఉంటుంది.. నీ దూకుడును కాస్త తగ్గించుకోమని చెబుతుంది.. ఇక మరిదితో నీ శోభనం ప్లాన్ చేసావని అర్థమవుతుంది. నన్ను హెల్ప్ చేయమంటావా అని అంటుంది. ఇక నందిని గుమ్మం దగ్గర నిల్చొని టెన్షన్ పడుతుంది. ఏమైందమ్మా అని వాళ్ల మామయ్యా అడుగుతాడు.. హర్ష కోసం అయితే వస్తాడులే ఆఫీస్ లో ఒక్కోసారి లేట్ అవుతుంది అని అంటాడు. హర్ష కోసం కాదు. మైత్రి కోసం అంటుంది.. పరాయి పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వెళ్లి ఇప్పటివరకు రాకుంటే టెన్షన్ ఉంటుంది కదా అని అంటుంది. మైత్రి చిన్న పిల్ల కాదుగా అని అంటారు. అప్పుడే హర్ష, మైత్రి బైకు పై వస్తారు. అది చూసి కోపంతో రగిలిపోతుంది నందిని.. నేను ఒక్కటి అడగనా నువ్వు ఆఫీస్ పోయినవా చెట్టా పట్టాలేసుకొని పోయినవా అని హర్షను అడుగుతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో సత్య పుట్టినరోజు కనుక్కున్న క్రిష్ అరచి మరి చెబుతాడు.. శోభనం కు సత్య ఏర్పాట్లు చేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×