E-Paper
Advertisement

Satyabhama Today Episode: రావణుడు గురించి మహాదేవయ్యకు స్టోరీ చెప్పిన సత్య .. రేణుక సేఫ్ .. రుద్ర చేసిన పనికి అంతా షాక్ ..

Satyabhama Today Episode: రావణుడు గురించి మహాదేవయ్యకు స్టోరీ చెప్పిన సత్య .. రేణుక సేఫ్ .. రుద్ర చేసిన పనికి అంతా షాక్ ..
Advertisement

Satyabhama Today Episode October 18th : నిన్నటి ఎపిసోడ్ లో నందిని బొమ్మల కొలువు కోసం అత్తింటికి వస్తుంది . అందరితో సరదాగా గడుపుతుంది. ఇంట్లో అందరు దసరా సంబరాల్లో ఆనందంగా ఉంటారు. హర్షను ఎలాగైనా ట్రాప్ చెయ్యాలని మైత్రి అనుకుంటుంది. ఇక బొమ్మల కొలువు కోసం ఇంటికి వచ్చిన ముత్తైదువులు అందరు రేణుకకు పిల్లలు పుట్టారు అని ఎత్తి పొడుస్తారు. ఇలాంటివి చేస్తే సత్యకు పిల్లలు పుట్టరాణి అంటారు . ఆ విషయం పై సీరియస్ అయిన సత్య వచ్చిన వారిని కడిగి పడేస్తుంది. ఇక మైత్రి హర్షను ఎలాగైనా రప్పించాలని కళ్ళు తిరిగి పడిపోయినట్లు యాక్ట్ చేస్తుంది . ఇక హర్షకు బామ్మ ఫోన్ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ విషయానికొస్తే.. హర్షకు వాళ్ళ బామ్మ ఫోన్ చేస్తుంది మైత్రి కళ్ళు తిరిగి పడిపోయిన విషయాన్ని చెబుతుంది. హర్ష నువ్వు కంగారు పడకు నేను ఇప్పుడే వస్తున్నా అనేసి నందినికి అసలు విషయం చెబుతాడు. నేను వెళ్తున్న నువ్వు నిదానంగా రా అని అంటాడు . ముందు సరే అన్న నందిని ఆమ్మో వీరిద్దరిని ఒంటరిగా వదిలేస్తే ఎలా అని నేను వెళ్ళాలి అని సత్యతో చెబుతుంది. మల్లి ఫోన్ చేస్తానని చెబుతుంది. ఇక సత్య రేణుక కనిపించలేదని వెతుకుతూ వెళ్తుంది . పైన గదిలో బాధపడుతున్న రేణుకను చూసి సత్య అక్క ఇక్కడ ఎం చేస్తున్నావ్ కింద పూజ అయిపొయింది . కిందకు రా అందరు నీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెబుతుంది. వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇవ్వాలి అంటుంది. వాళ్ళు అన్నారని కాదు నాకు ఏదోలా ఉంది. నేను కాసేపు ఆగి వస్తాను అని అంటుంది. అందరి మాటలు పట్టించుకోవద్దు అని సత్య కిందకు వెళ్తుంది . రేణుక కడుపు నొప్పిగా ఉందని డాక్టర్ కు ఫోన్ చేస్తుంది ఏదైనా టాబ్లెట్ గురించి చెప్పండి వేసుకుంటాను అని అడుగుతుంది . కానీ డాక్టర్ ఈ టైం లో ఫోన్ నొప్పి ఎందుకు వస్తుంది ఒకసారి హాస్పిటల్ కు రా చెక్చేస్తాను అంటుంది. సరే అని రేణుక అంటుంది.

Advertisement

ఇంట్లో అందరు పండుగ హడావిడిలో ఉన్నారు . నేను చెప్పకుండా వెళ్లి త్వరగా వస్తాను అనుకుంటూ వెళ్లి పోతుంది. ఇకపోతే మహాదేవయ్య రావణుడు గురించి దహనం గురించి తనలో తానే మాట్లాడుకుంటాడు. అప్పుడే సత్య అక్కడకు వచ్చి అది పొరపాటు అని రావణుడి దహనం ఎందుకు చేస్తారో చెబుతుంది. మహాదేవయ్యకు స్టోరీ చెబుతూనే అతనికి కోడలు పెద్ద క్లాస్ పీకుతోంది. అప్పుడే అక్కడకు భైరవి వస్తుంది. ఏంటి మామా కోడలు ఎదో ముచ్చట పెట్టారు అని అడుగుతుంది. నీ కు తెలియంది కాదుగా పెనిమిటి అంటుంది. వెంటనే క్రిష్ వచ్చి సత్య చెబితే ఏదైనా వినాలని అనిపిస్తుంది అంటాడు . ఇక బామ్మా వచ్చి రావణుడి దహనం కు పూజకు సిద్ధం చెయ్యాలి అంటుంది. ఇంతకీ రేణుక కనిపించలేదు ఎక్కడుందో అని భైరవిని అడుగుతుంది . దానికి భైరవి నన్ను అడుగుతావేంటి నేను సంకలో పెట్టుకొని తిరుగుతున్నానా అత్తమ్మ అని అడుగుతుంది. అందరు రేణుక గురించి వెతుకుతారు.

అప్పుడే సత్యకు డాక్టర్ ఫోన్ చేస్తుంది . రేణుకను తీసుకొని ఆసుపత్రికి రాలేదా అంటుంది . పూజలో ఉన్నాము అంటుంది రేణుక ఇంకా రాలేదని ఫోన్ చేసాను . అనగానే ఒక్కటే ఎలా వెళ్తుంది అని అందరు తిడతారు . ఇక మైత్రి అనుకున్నట్లుగానే హర్ష ఇంటికి వస్తాడు. ఎదో కొంపలు మునిగిపోయినట్లు హర్షకు కాల్ చేశారు . పుట్టింటికి వెళ్లిన మమల్ని రప్పించారని తిడుతుంది. మైత్రి పరిస్థితి తెలుసుకొని కూడా ఇలా ఎలా అంటావని హర్ష నందినిని తిడతాడు. మైత్రి నాకు కావాల్సిందే ఇది అని మనసులో సంబరపడి పోతుంది. రేణుక కోసం ఆగుదాం అని సత్య అంటుంది . అదెలా కుదురుతుంది . ముహూర్తం ముహూర్తమే అని రుద్రా అంటాడు. ఇక బామ్మ కూడా సరే కానివ్వండి అని అంటుంది. అందరు కలిసి రావణదహనం చేసేందుకు సిద్ధం చేస్తారు. మహాదేవయ్య సత్యను బాణం వెయ్యమని అంటే భైరవి రుద్రకు ఛాన్స్ ఇవ్వమని అంటుయింది. రెండు సార్లు వేసిన గురి తప్పుతుంది ఇక సత్య క్రిష్ లు కలిసి బాణం వదులుతారు . అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో రేణుకను కనిపెడుతుంది సత్య .. రుద్రా ఇదంతా చేసాడని తెలుసుకుంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×