E-Paper
Advertisement

Kissik Talks: మరకతమణి సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సంజన!

Kissik Talks: మరకతమణి సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సంజన!
Advertisement

Kissik Talks:సంజన.. బెంగళూరు కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈమె.. అసలు పేరు అర్చన మనోహర్ గల్రాణి. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత కన్నడ నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా 2005 లో వచ్చిన సోగ్గాడు అనే చిత్రంతో తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన సంజన.. 2006లో గండ హెందతి అనే చిత్రం ద్వారా కన్నడ రంగ ప్రవేశం చేసింది. ఇక ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంజన.. 2008లో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ మరదలిగా నటించి, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత తమిళ్, మలయాళం భాషా చిత్రాలలో కూడా నటించింది. అలా ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె వెబ్ సిరీస్ లతోపాటు రియాలిటీ షోలలో కూడా సందడి చేసింది. అంతేకాదు హిందీలో కలర్స్ టీవీలో ప్రసారమైన సీరియల్స్ లో కూడా నటించి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘ఏ దేవి వరమో నీవు’ అనే తెలుగు సీరియల్ ద్వారా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.

మరకతమణి సీక్వెల్ పై సంజన బిగ్ అప్డేట్..

తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాప్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె తన మరిది, ప్రముఖ హీరో కం విలన్ ఆది పినిశెట్టి గురించి మాట్లాడుతూ.. అతనితో ఉన్న బాండింగ్ గురించి చెబుతూ అలాగే మరకతమణి సీక్వెల్ పై కూడా అప్డేట్ ఇచ్చింది.” నా చెల్లి నిక్కి, ఆది నా ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉంటారు ఇటీవలే నా కూతురు బర్తడే కి కూడా వచ్చారు. ప్రస్తుతం ఆది మరకతమణి సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్నారు .పెద్ద ఆర్టిస్టులతో భారీ క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు”.. అంటూ మరకతమణి 2పై సంజన క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Advertisement

also read:Kissik Talks: ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు సంజన మాటల్లో!

పెద్ద స్టార్లతో క్లైమాక్స్ షూటింగ్..

నిజానికి మరకతమణి సినిమా విషయానికి వస్తే.. ఏ ఆర్ కె సరోజన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి , ఆయన భార్య నిక్కీ గల్రాణి జంటగా ప్రియా భవాని శంకర్ కీలక పాత్రలో ఈ సినిమా సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికీ 2017 లో వచ్చిన మొదటి భాగంలో ఫాంటసీ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పెద్ద తారాగణంతో ఈ సినిమా క్లైమాక్స్ షూట్ అవుతోందని సంజన చెప్పడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. కామెడీ , అడ్వెంచర్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, శాపం పెట్టిన మరకతమణి కథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా డైలాగ్స్, ఆకట్టుకునే వీఎఫ్ ఎక్స్ సినిమాకి కల్ట్ ఫాలోయింగ్ సృష్టించాయి. ఆది మళ్ళీ తన పాత్రలో కనిపిస్తాడు. అటు నిక్కీ కూడా జంటగా కనిపిస్తోంది. మొదటి భాగం లోని మునిష్కాంత్, అరుణ్ రాజా కామరాజ్, ఆనందరాజు వంటి ప్రముఖ పాత్రధారులు మళ్లీ కనిపించనున్నాయి. కొత్తగా సత్యరాజ్, ప్రియా భవాని శంకర్ సీక్వెల్ లో చేరడం వల్ల కథలో కామెడీ డ్రామా మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోందని .. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని సంజన తెలిపింది.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×