E-Paper
Advertisement

Kissik Talks: ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు సంజన మాటల్లో!

Kissik Talks: ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు సంజన మాటల్లో!
Advertisement

Kissik Talks: తాజాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న సంజన.. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు తన వంతు సలహా ఇచ్చింది.. ఇంటర్వ్యూలో భాగంగా వర్షా మాట్లాడుతూ..” ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?” అని ప్రశ్నించగా.. ఇండస్ట్రీకి వచ్చే కొత్త అమ్మాయిలకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఇండస్ట్రీలోకి రాకముందు మా ఫ్యామిలీ మొత్తం ఒక అద్దె కుటుంబంలో ఉండేది. ఇంటి అద్దెతోపాటు ఈఎమ్ఐ లు కూడా కట్టేదాన్ని. అమ్మానాన్నలని చూసుకోవాలి.. నా చెల్లెల్ని చూసుకోవాలి. అయితే వీటన్నింటికీ డబ్బు కావాలి. ఇక అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను వదులుకోలేదు.

ఆ భయాలతో చాలా తప్పుడు రోల్స్ చేశాను..

ముఖ్యంగా నాకు చిన్న డ్రస్ వేసుకొని నటించాలని అవకాశం వచ్చేది. ఆ సమయంలో అయ్యో వేరే సినిమాలో అవకాశం లేదు కదా.. ఇప్పుడు నేను దీన్ని వదులుకుంటే మళ్లీ అవకాశం వస్తుందో? లేదో? అని ఎక్కువగా ఫీల్ అయ్యేదాన్ని. ఒకవేళ దీనిని నేను ఒప్పుకోకపోతే ఇక నా కెరియర్ నాశనం అవుతుందేమో.. గ్యాప్ వచ్చిన తర్వాత నన్ను ఏ ప్రొడ్యూసర్ పిలుస్తారు? ఇండస్ట్రీ నన్ను మర్చిపోతుందా? అలాంటి భయాలతో నేను చాలా తప్పు రోల్స్ చేశాను. 12 సంవత్సరాల వయసులోనే నేను ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ కూడా వచ్చాను. 16 ఏళ్ల వయసులోనే నేను హీరోయిన్ అయిపోయాను. అప్పుడు నేను చాలా చిన్న పిల్లను.. నాకు అసలు నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఆ పాత్రలను నేను చూస్తే నా మీద నాకే జాలి వేస్తుంది. ఎందుకు ఇలాంటి సినిమాలు చేశాను.. అసలు ఎందుకు నన్ను ఎవరు చేయి పట్టుకొని నడిపించలేదు.. అని ఒక్కొక్కసారి కన్నీళ్లు కూడా వస్తాయి. అంటూ అంటూ తన కెరియర్ గురించి చెప్పుకొచ్చింది.

Advertisement

also read:Kissik Talks: సినిమా టికెట్ ధరలపై సంజన రియాక్షన్!

ఇండస్ట్రీకి వచ్చే కొత్త అమ్మాయిలకు సంజన సలహా..

“ఇండస్ట్రీకి కొత్తగా అమ్మాయిలు ఎవరైనా సరే ముందుగా సేఫ్టీ గా ఉండాలి. ఇక అవకాశాలు వస్తాయో లేదో అనే కంగారు పడకూడదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు ఇండస్ట్రీలో సక్సెస్ రాలేదంటే గనక మీరు మీ చదువును పూర్తి చేయండి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నట్లయితే ముందుగా మీ చదువును పూర్తి చేసి ఆ తర్వాతే మీరు ఇండస్ట్రీలోకి రండి. ముందుగా 18 , 19 ఏళ్లకే మీరు ఇండస్ట్రీలోకి రావద్దు. డిగ్రీ పట్టా అందుకని మీకు 25 లేదా 26 సంవత్సరాలు వచ్చే వరకు ఆగి , ఆ తర్వాత ఇండస్ట్రీలోకి రండి. ఈ వయసులోనే ఎందుకంటే ఈ సమయంలో మీరు సమాజం ఎలా ఉంది? మనం ఎలా ఉండాలి ? అనే విషయాలపై మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక 18 సంవత్సరాల అమ్మాయి అయితే చూడడానికి అమ్మాయి లాగే ఉన్నా మనసు మాత్రం ఇంకా పిల్లలు లాగే ఉంటుంది.. కాబట్టి చదువును పూర్తి చేసుకొని మీకంటే ఒక అవగాహన వచ్చి మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోగలము అని మీకు అనిపించినప్పుడే ఇండస్ట్రీకి రండి” అంటూ తెలిపింది.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×